పుట:Gurujadalu.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెలివైన కుఱ్ఱవాణ్ణి ఫెయిల్ చేసినందుకు మీ మాష్టరు మీద నావొళ్ళు మహా మండు తూంది. ఈ మాటు వంటరిగా చూసి వొక తడాఖా తీస్తాను. నువ్వు శలవుల్లో యిక్కడుంటావా వూరికి వెళతావా? వెంక : వెళ్ళాల్నుంది గాని, పాసు కాలేదంటే మా తండ్రి చావకొడతాడు. గిరీ : ఆ గండం తప్పే వుపాయం నేన్చెబుతాను, నే చెప్పినట్టల్లా వింటానని ప్రమాణం చాస్తావూ? వెంక : (గిరీశం కాళ్ళు పట్టుకొని) మీ శలవు యెప్పుడు తప్పాను? మా తండ్రికి మా చడ్డ కోపం. పాసు కాలేదంటే యెవిఁకలు విరగొడతాడు (కన్నీరు చేత తుడుచుకొనును) గిరీ : దటీజ్ టిరనీ -యిదే బంగాళీ కుఱ్ఱవాడవుతే యేంజాస్తాడో తెలిసిందా? తాతయేది, తండ్రయేది కత్తి పట్టుకొని చమాలెక్క గొడతాడు; మీ అగ్రహారం కుబ్జ వాళ్ళు మరి యవళ్లయినా యీ వూళ్లో చదువుకుంటున్నారా? వెంక : మరెవళ్లూ లేరు. గిరీ : ఐతే నేనో వుపాయం చెపుతాను విను, నే కూడా నీతో మీవూరొచ్చి పరిక్ష పాసయినావని మీ వాళ్ళతో చెబుతాను; అక్కడ నీకు చదువు చెప్పడానికి ఒచ్చానని మీ వాళ్ళతో చెప్పు; శెలవులాటర్ని నిన్ను టవును స్కూల్లో పై క్లాసులో ప్రవేశపెడతాను. వెంక : మీరేవొస్తే బతికాను మరేవిఁటి; కిందటి మాటు శలవులికే మా అమ్మ మిమ్మల్ని తీసుకు రమ్మంది. గిరీ

ఆలైట్-గాని-నాకిక్కడ చాలా వ్యవహారములలో నష్టం వస్తుందే - మునసబు గారి పిల్లల్కి శలవుల్లో పాఠాల్చెపితే ఫిల్టీ రుపిజ్ యిస్తావఁన్నారు; అయినా నీ విషయవైఁ యంత లాస్ వచ్చినా నేను కేర్ చెయ్యను. ఒక భయం మాత్రం వుంది. మీ వాళ్ళు బార్బరస్ పీపిల్ గదా, నన్ను తిన్నగా టీ చేస్తారో చెయ్యరో. నీవు నన్ను గురించి మీ మదతో గట్టిగా రికమెండ్ చెయ్యవలసి వుంటుంది. కొత్త పుస్తకాలికి వొక కొంచం డబ్బు చేతిలో వుంటేనే గాని సిగర్సుకి యిబ్బంది కలుగుతుంది. నోటుబుక్కు తీసి రాయి. 1 రోయల్ రీడర్, 2 మాన్యూల్ గ్రామర్, 3 గోష్ జియామెట్రీ, 4 బాస్ ఆల్జీబ్రా, 5 శ్రీనివాస్సయర్ అర్థిమెటిక్, 6 నలచరిత్ర, 7 రాజశేఖర చరిత్ర, 8 షెపర్డు జనరల్ ఇంగ్లీష్, 9 వెంకట సుబ్బారావు మేడీజీ. యెన్ని పుస్తకాలయినాయి? జాబితా రాయి వెంక : తొమ్మిది. గురుజాడలు 221 కన్యాశుల్కము - మలికూర్పు