పుట:Gurujadalu.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గిరీ మరొక్కటి రాయి. అక్కడికి పదీ అవుతాయి. కుప్పుసామయ్యర్ మేడ్ డిఫికల్ట్. అక్కడికి చాల్ను. మీ వాళ్లు గాని యింగ్లీషు మాట్లాడమన్నట్టాయినా తణుకూ బెణుకూ లేకుండా పుస్తకాల్లో చదువుకున్న ముక్కలు జ్ఞాపకం వున్నంతవరకు యాకరు పెట్టు, నీ దగ్గర కాపర్సు యేవైఁనా వున్నవా? నా దగ్గిర కరన్సీ నోట్లు వున్నవి గాని మార్చలేదు. పదణాలు పెట్టి ఓ శేరు కాశీ మిఠాయి కొని పట్టుకురా. రాత్రి మరి నేను భోజనం చెయ్యను. మార్కట్టుకి వెళ్ళి బండీ కుదిర్చి దానిమీద నా ట్రావెలింగ్ ట్రంక్కు వేశి మెట్టు దగ్గర బండీ నిలబెట్టి ఉంచు. యిక్కడ కొన్ని రాచకార్యాలు చక్కబెట్టుకుని యంత రాత్రికైనా వొచ్చి కల్సుకుంటాను. గో ఎట్వన్స్; మైగుడ్ బోయ్. నువ్ బుద్ధిగా వుండి చెప్పిన మాటల్లా వింటూంటే నిన్ను సురేంద్రనాథ్ జానర్జీ అంత గొప్పవాణ్ణి చేస్తాను. నేను నీతో వస్తానన్న మాటమాత్రం పిట్టకైనా తెలియనియ్యొద్దు. జాగ్రత (వెంకటేశం నిష్క్రమించును.) గిరీ

యీ వ్యవహారమొహటి ఫైసలైంది. ఈ

రాత్రి మధురవాణికి పార్టింగ్ విజిట్ యివ్వందీ పోకూడదు. (రాగవరసతో పాడును) నీ సైటు నా డిలైటు; నీన్ను మిన్న కానకున్న క్వైటు రెచడ్ ప్లైటు, మూను లేని నైటు. (ఒక బంట్రోతు ప్రవేశించును) బంట్రోతు : నేను పొటి గరాప్పంతులు గారి నౌఖర్నండి, లెక్కజరూరుగుందండి. పొటి గరాపుల కరీదు యెంటనే యిప్పించమన్నారండి. గిరీ

(విననట్టు నటించుతూ)

ఫుల్లుమూనూ లైటటా, జాసమిన్ను వైటటా, మూను కన్న మొల్ల కన్న నీదు మోము బైటటా, టా! టా! టా! కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 222