పుట:Gurujadalu.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మిణుగురులు

(పిల్లల గీతములు)

1
మల్లెలు మొల్లలు పూచే వేళ
చల్లని గాలులు వీచే వేళ
మేనుల గంధం బలదే వేళ
ఉరుములు మెరుపులు మెరసే వేళ
తొలకరి వానలు కురిసే వేళ
మామిడి పండులు పండే వేళ
మన్మథ బాణం మ్రోగే వేళ
మగువల మనసులు క్రాగే వేళ.

2
బూరుగు చెట్టు
చిలకలతోను
ఏమని పలికింది.
పండిన పండు
ఎండిన దూదై
పకపక నవ్వింది.

3
చిలకల్లార!
చిలకల్లార!
కలవలతోను,
ఏమని పలికారు?
కలవల్లార!

గురుజాడలు

89

కవితలు