పుట:Gurujadalu.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దించు లంగరు

1. దించు లంగరు దీర్ఘయుద్ధం
   ధర్మపక్షము ముల్లు చూపెను
   నరుల పీనుగు పెంట పోకల
   నాటి వెలయును శాంతి వృక్షము.

2. పాత సంధులు పాతిపెట్టుము
    యుద్ధముల కవి ఉనికి పట్టులు
    లోక మంతయు ఏకమై
    యుద్దమునె మారణము చేయును.

3. వచ్చెనిది బంగారు కాలము
    వాంఛ లెల్లను తీరు సుజనుల
    కాంగిలేయుల ధర్మ రాజ్యము
    జ్ఞానమును స్వాతంత్ర్యమిచ్చుచు
    సంతతము వర్ధిల్లు గావుత!

(కృష్ణాపత్రిక 1915 అక్టోబరు 30)

గురజాడలు

88

కవితలు