వివేకానంద పఠనమందిరము- దెందులూరు
సరస్వతీ దేవి ఆలయమగు ఈగ్రంధాలయ భవనమున గతసంవత్సర మీ దినముననే మనమందర మానందముగ సమావేశమై కార్యప్రణాళిని నిర్మించి నిర్వాహక సంఘము నేర్పరచితిమి. మన కార్య ప్రణాళి ననుసరించియే మరల కార్యనిర్వాహక వర్గము నేర్పాచేయుట కీదినమున కూడితిమి. ఆపనిప్రారంభించుటకు ముందు గతిసంవత్సర కా.ని. సంఘమేవిధముగ పనిచేసెనో మన గ్రంథాలయ బాలికా స్వరూపమెట్టి పరిణామ మందేమో సందర్శించుటకును మీరు కుతూహల పడుటలేదా! చూడుడు.
సొమ్ము మూలధనమందలి వడ్డీ పెరుగుదలతప్ప వేరుగా సంపాదించినదిలేదు. వివాహకట్నములందు 40-8-0 మాత్రము వచ్చినది. ఇందుకని వారికి కృతజ్ఞతి చూపవలసి యున్నది. వడ్డీనిమించి ఖర్చు చేయకూడదను నిబంధనను దృష్టియందుంచుకొని వ్యవహరించితిమి. వడ్డీపైవచ్చిన ఆదా రు 130.12.0 వివాహకట్నములు 40-8-0,మొత్తం 171-4-0. మేము చేసిన సాంవత్సరిక ఖర్చు 98-11-6 మాత్రమే. మూలధనమునుఁడి ఖర్చుచేయుట కనుమతించబడిన దరఖాస్తు స్తలమందలిపాకకు 45-0-6లు. ఈ మొత్తమునకు వ్యయపరుపబడిని 143-12.0 కలుపుకోన్నను సాంవత్సరిక ఆదాయమున 27-8-0 మిగిలినది. మంచో, చెడ్డో, యీవిధముగ మితవ్యయము చేసితిమి. చేయవలసిన ఖర్చులేక గాదు మేమివిధముగ మితవ్యయము చేసినది. సాంవత్సరిక విరాళములు లేవు. మూలధనమా స్వల్పము. కనుక జాగ్రతగా వ్యయముచేయ నుద్దేశ్యమే హేతువు.
బీరువా కొనవలసియున్నది. చదువరుల రాపిడిచే చేడిపోయిన పుస్తుకములసేకములు బైండులు కట్టించి వలసియున్నది. అనేక యుద్ధంధములు, వార్తాపత్రికలు తెప్పించవలసియున్నది. సమర్ధులగు నుపన్యాసకుల రప్పించి ప్రజలందు విజ్ఞానవ్యాప్తిని గలిగించవలశియున్నది. పురాణపఠనము కవకాశము గలిగించవలసి యున్నది. బాల, పాలికా, పుస్తుకపఠనమున కింకను ప్రోత్సాహము కల్పించవలసియున్నది. ఇట్లే ఆనేకావశ్యక కార్యములు కలవు. అయినను శక్తికిమించి సాహసము చేయవద్దు గదా! క్రమముగా నెరవేర్చ యత్నింతము. సత్సంకల్పముల సర్వేశ్వరుడు పోషించకపోడు. పుస్తకములు 195 మాత్రమే సమకూర్చబడినవి. ఇందు 115 పుస్తకములు సొంత ఖర్చుతో కొనబడినవి. పోస్టువ్యయముతో నిమిత్తము లేక చాల సదుపాయములగు నెలలకు కార్యదర్శి చేకొనబడినవి. తక్కిన యెరుబది పుస్తుకములును సహృదయులగు దేశాభిమానులచే ఉచితముగ నొసంగ బడియెను. వారికి మన యభివందనములర్పించి ఇట్టి ఉదారులసాయముకొరకిఁకను సర్వేశ్వరుని ప్రార్డింతుము.
ఒకేసారి విరాళములిచ్చి గ్రామస్థులనేకులు సానుభూతి క్రియాపూర్వకముగ చూపియుండుటచేతను కొంచెమించుమించు ఆయాదాయముతో గ్రంథాలయము నిర్వహింపబడుట కవకాశము కలిగి యున్నందునను, మరలవారినే వార్షికచందదారులుగ చేర్చుటంత సమంజసముగ నుండదనితోచి ప్రయత్నించినందుననే చందదారులు సభ్యుల సంఖ్య పెరుగలేదు. అవకాశమున్నంతలో యీవత్సరము యత్నము చేయవచ్చును. లోగడ విరాళములు వాగ్దానము చేసియు యింతకినివ్వవారి వద్దనుంచి వసూలు చేయ యత్నించితిమి. నిర్బంధనమేమియు లేక వారియిచ్ఛాధీనమగుట, ఇదుగో, అదిగొ అని జరుపుచుండిరి.
గట్టిగా అడిగి క్రియాసూన్యత్వమును పొందుటకన్నా క్రమముగా, యీమోమాటము, సానుభూతి, నిలిపిక్రియను సాధించుటయే మాయుద్దేశముమగుట, పర్యవసానము చెప్పజాలనందుకు క్షమాపణ కోరుచున్నాము. సుగ్గిశెట్టి పెదవెంకయ్య గారు మాత్రము గ్రంధాలయ భవనమునకు కొంత యిటుక వగైరా యిచ్చి మరియు ఆ ఖరీదు నాచందాకు సరిపోగలడనియు చెప్పుచున్నారు. అది తేల్చవలశియున్నది. తక్కిన విరాళము లీ సంవత్సరము వసూలు చేయుదము.
అంత తృప్తికరముగాకున్నను పాఠకుల సంఖ్య కొంచెము హెచ్చుట మనము గమనింపదగినదే. ఇది గ్రంధాలయ సార్ధకోద్దేశమగుట, యీయుద్దేశమును సాధించుటకే మనమందరము గట్టికృషి సలుపవలసియున్నది. పుస్తకము ..త్రము .. మనజీవితాభివృద్ధికి శ్రేయమునకు సాయపడునది. మనకన్నివిధముల మేలొనకూర్చునది. మనగృహకృత్యములు యితర అవసరవ్యవహారములు నిర్వర్తించుకొనుచు తీరిక సమయములందీపుస్తక పఠనావకాశమందరు ఉపయోగపరచుకొనవలెను.