దానిని అఖిలభారతజాతీయోపసంఘమునకు పంపవచ్చును.
ఈమార్గము నవలంబించినచో కేదల జిల్లా, రాష్ట్రీయ, అఖిల భారత గ్రంథాలయములే గాక ప్రతిపట్టణ మందును, పల్లెయందు దును గ్రంథాలయములు స్థాపితమై తన్మూలమున జాతీయాభ్యుదయము పొందగలము.
గ్రంథాలయోద్యమమున కృషి చేయు సోదరుల కొక మనవి. కట్టుబాటులుండినగాని యేపనియును నిష్కర్హగ జరుగనేరదు. ఇందుకొరకై భారతదేశమందంతటను గ్రంథాలయోద్యమమున కృషి సలుపు ప్రముఖులందరు చేరి యొకసంఘము నేర్పడుట అవసరము. పంజాబు విశ్వవిద్యాలయము వారి యాజమాన్యముక్రింద దొరతనము వారట్టి సంఘ మొకదాని నేర్పరచటకు ప్రయత్నించిరి. అసంఘ మొకటిరెండు సమావేశములు జరిపిన పిదప దేశమున నెట్టిఉపకారమును చేయకయే నశించినది. గ్రంథాలయోద్యమాభిమానులగు భారతీయులందరు చేరి జాతీయసూత్రముల ననుసరించి జాతీయాధికారముక్రింద భారత గ్రంథాగారసంఘము పేరుతో దొరతనము వారిజోక్యమేమియులేకుండా సంఘ మొకదానిని స్థాపించుట ఆవశ్య కర్తవ్యము.
ముద్దుల నాయెంకి
న౦డూరి సుబ్బారావు, బి ఏ.
యేడుంటివే యెంకి యేడుంటివే
పూతోం పందిట్లొ
శీతాయి యెల్తుంటె
నీతళ్కు చేపకాన్ని
'నాతల తిరిగిం దోలె! యే!
మామిడి తోటో కెళ్లి
మంచీ పండోటి గోసి
యేటొ గాని నోట్టే స్థె
యిసమై పోయిందోలె యే॥
పొత్తేళ్ళ జొన్నసేలొ
సిత్తరమయి పోతాది
గమ్మైన వోన నొసై
గుండెగిరి పోయెనోలె । యే
బేలగుండెనాయెంకి.
నండూరి సుబ్బారావు, బి.ఏ.
యీరేతి రొక్క తెవు యే మొచ్చినావె?
ఆడు నే చిక్కడే యాడినామమ్మ
యేటి నురగలకెసి యేటి చూస్తావె?
మావోడి మనసట్టె మరుగుతా దమ్మ.
శంద్రవంకలొ నేమి శిత్రమున్నాదె?
వొంక పోగా నె మావో డొస్తడమ్మా.
ఆడు నే నిక్కడే యాడినామమ్మ
మావోడి మనసట్టె మరుగుతాదమ్మా.
ఆవ క పోగా నె ఆడొస్త డమ్మా.
ఓదార్పు
ఓయమ్మ చితిల్ల ♦ కూఁటగనుమ
గతముకై చింతింపఁ ♦ గార్యమేమమ్మ
పాపపు దైవమ్ము ♦ పడఁతియంచనక
ఏట్టిబొములనిన్ను ♦ హింసించెఁదల్లి
మాయమర్మము లేని ♦ మా దేశజనని
కాలకర్మము దాట ♦ గంజాక్షువశమె
కలకంఠికంటి నీ ♦ రొలుకరాదమ్మ
చెప్పరానిది తప్పు ♦ జేసినామమ్మ
మాతృద్రోహముసల్పి ♦ మసలినామమ్మ
రత్నగర్భము గల్గి ♦ రాజిల్లుచుంట
బంగారు బొజ్జనై ♦ వర్ధిలుఛుంట
మాకేమియని మేము ♦ మైమర్చినాము
కన్నబిడ్డలమమ్ముఁ ♦ గాచిరక్షింప
కడుపులోదాచిన ♦ కనకమ్ము నెల