Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol 6, No.1 (1922).pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భారతీ నిద్రావిశ్రాంతినొందునప్పుడు, పళ్ళెటూళ్ళ, పేరెన్నికలేని నియోగులు శతృకల్పనలను కొన్నిసందర్భములలో రసవంతమైన కావ్యములను జేయుచు గుప్తయశోనిధులై మరగుపడియుండిరి. భట్రాజులు శ్రీపదంబుల నాశ్రయించుచు, తెలుగుప్రబంధములు రసవత్భావ గాంభీర్యమును వెల్లడింపక, శ్లేషాదిబంధకవితా తెరఁగుల నలుదేశల మ్రోగించుచు, భాస్కరదానశీలమును గీర్తించుచు తలమార్చినపద్యములతో మెప్పించి మెప్పులవడయుచుండిరి, ఈగతి నాంధ్రభారతి 1840 సంవత్సరము వఱకు నధోగతిజెండి యుండెను.

ఇంతలో 19వ శతాబ్దారంభమువరకు గోలకొండ నెల్లూరు ఆర్కాటు నవాబులు యాధీనముననున్న యావదాంధ్రదేశము విచ్ఛిన్న మాయెను. బేరారు మధ్యపరగణాల యాంధ్రులు మహారాష్ట్ర పరిపాలనమున జేరిరి. గుంతకల్ – బెంగులూరు రైలులకు పడమటనున్న తెలుగుసీమలు హైదనరల్లీకిలోబడి క్రమముగ మహీసుర రాజ్యభాగమున జేరను. చెన్నపురి - బెంగుళూరు లైనునకు దక్షిణముననున్న యాంధ్రభూములు, మతసాంప్రదాయములచేతను వైష్ణవప్రపత్తిచేతను తమిళనాగరిక ప్రభాక్రాంములై తెలుగుతత్వముల వీడేను. దత్తమండలములు సైనికసంరక్షణము కోరి కాంగ్లేములకియబడెను. (1805) ఈ ప్రాంతములలో మొగలాయిపక్షమున నానగొంది, గద్వాల, వనపర్తి సంస్థానములు నిలిచియుండెను. దత్తమండలములు వర్షాధారమున పండునవిగానను, చాలభాగ మరణ్యములతో నిండి సేవ్యానర్హముగనుండుగావునను, క్షామకంటకము లచ్చట దఱచు తలజూపుటను, పండితిపోషకులగు సంస్థానములు లేనందులను, దత్తమండలము లొకప్పు డాంధ్రవిద్యానటీ వృత్తిరంగస్థలంబులై చెన్నొందియుండియు, గ్రమముగ బ్రాహ్మణ తిభాదరిద్రమునకు పాలైనవి. పోషకులులేరు. క్షేత్రారామములకు వలయు నీటి వసతులులేవు - బ్రాహ్మణాగ్రహారములు లేవు — పండితులు లేరు. దత్తమండలముల దౌర్భాగ్య మాంగ్లయే విద్యాప్రతిష్ఠాపకుల గాని, ప్రభువులగాని యాకర్షింపకుండెను. ఇంతలో తంజాపురినుండి చెన్నపురికిని, చెన్నపురినుండి ముంబాయికిని రైలుమార్గము లేర్పడెను. తంజాపురీ ప్రాంతమునగల హైందవసాంప్రదాయ దుర్గమ దుర్గంబుల భేదించు కొరకు, క్రైస్తవమిషనరీ లచ్చట 19వ శతాబ్దారంభమున నాంగ్లవిద్యాలయముల నేర్పరచిరి. ఊద్యోగవశమున దాక్షిణాత్యులు చెన్నై పరిసరములన్నియు నాక్రమించి వాని నాంద్రేతరమొనర్చిరి. వీరు లాకారణముననే అయోమార్గావకాశమున దత్తమండలముల కెగబ్రాకి కడప, బళ్ళారి, కర్నూలు ప్రాంతములు తమనాగరిక సత్వమల వెదజల్లి యచ్చట స్థిరవాసులైరి. మరియు నా ప్రాంతములుత్తరముననుండి మహారాష్ట్ర పౌరసీకప్రవాసుల యావాసములాయెను. ఆంధ్రవిద్యాపీఠములు లేవు. ఆంగ్లవిద్యావ్యాపనము తక్కువ. అరవపారశీక నాగరకతా విజృంభణమెక్కువ. బ్రాహ్మణప్రవత్తి కొదువ. ఇందుచే నాయెడ నాంధ్రజాతీయ సహజకావ్యోదయము లేకుండెను. ఇటీవలమాత్రము అరవ, కర్ణాట, పారసీక, మరాటీ సాంప్రదాయానుసారముగ నాటకములల్లు ధర్మవరం కృష్ణమాచార్యులు, కోలాచలం శ్రీనివాసరావుగారు అచ్చోట జనియించిరి. దత్తమండలములలో జాతి సాంకర్య మెక్కువగనుంటచే, థియాసఫీ కునికిపట్టయి, మిగిలిన భారతభావ విన్యాసతిగఁగోద్వేగమును జెందక, భవక్తితో శృంగారములతో గూడిన పురాణగ్రంధరచనారంగమై యున్నది.

నెల్లూరు చిత్తూరు ప్రాంతములు వైష్ణవ సాంప్రదాయమునను, రయిళ్ళ యంటుబాటునను, చెన్నపురియరవల విలాసభూములై యాంధ్రత్వమును గోలుపోయెను.

19వ శతాబ్దారంభమున నాంగ్లేయులుత్తర సర్కారులకు నిజాంవలన కవులుకొనిరి. ఆగౌతమీతటవ్యాప్తిమయిన కళింగరాజ్యవిభూతిని బద్మనాభరణకూటంబున పసజెంపి, యాభాగమంతయు గైవశము జేసికొనిరి. సువర్ణముఖమొదలు నాగావళివర కాంగ్లేయ ప్రభుత్వ మేర్పడెను. కాళహస్తి, వెంకటగిరి, నూజవీడు, పిఠాపురం, పెద్దాపురం, బొబ్బిలి సంస్థానములలో వెలమదొరలును, విజయనగరములో పూసపాటి క్షత్రియులను సామాన్య వైభవోపేతులై స్వాతంత్య్రరహితులయిన భూస్వాములయిరి. తెల్లదొరలు బలిగ్రహణ సౌకర్యమును కనేక చిల్లర జమీదారుల నుత్పత్తిజేసిరి. పీనాకినీ గౌతమి కృష్ణవేణీ మహావాహినులేగాక, తూర్పుకొండల సెలయేళ్ల సంఖ్యాకములు సాగరాభిముఖులై పారుకతన, ప్రాగాఁధ్రభూభాగము ఫలసస్యశోభావిభాసితమై బ్రాహ్మణావాసములతో నిండియుండెను. ఈ ప్రాంతముల వైదికులలో సంస్కృత పాఁడితీప్రాచుర్య మధికముగ నుండెను. పల్లెటీకరణాలకుటుంబములలో నూతన కావ్యోత్పత్తి వాసిగ లేకున్నను, తిక్కన పోతినాదులు కవిలేలమరియుండెను. 1840 దరిమిలాన ఆంగ్లశిల్పకులు