2
భక్తాగ్రేసరులు
ఈ సంచి యందు వేరొకచో బ్రకటించిన చిత్రపటమున ఆంధ్రదేశమందలి సుప్రసిద్ధ భక్తాగ్రేసరులు నల్వురు కనుపరచబడిరి. వారలగు గూర్చి సంగ్రహముగనిట వ్రాయుదుము. వీరు వెలనాటిశాఖీయులైన వైదిక బ్రాహ్మణులు. హరితసగోత్రికులు.
౧
మొదటివారు బ్రహ్మశ్రీ బలజపల్లి రామమూర్తి శాస్త్రిగారు. వీరి పూర్వికులు కృష్ణాతీర వాసులు. అయినను వీరు మాత్రము గంజాంమండలమందలి శ్రీకాకుళమునందును, ఇప్పుడు గోదావరిమండలమున కాకినాడయందును తెరచుగ నుందురు. బాల్యము నందు కొలదిగ నిగ్లీషువిద్య నభ్యసించి యటుపిమ్మట కాశీనగరమునకుపోయి సంస్కృతమున గొంతపాండిత్యమును సంపాదించి, ప్రస్థానత్రయ పఠనమును జేసి, వేదాంత శాస్త్రమున అనేక రహస్యములను దెలిసికొనిరి. వీరికి శ్రీభాగవత రామాయణాది గ్రంధములయందు విశేషాభిమానము గలదు. బహ్వన్ద్రహృదయులు. భగవన్నామోచ్చారణమాత్రముననే నరులు కలియుగమున తలంతురును నమ్మకముగల వారు. ఎచటికి బోయినను బహుజనుల నాకర్షించి, వారికి భగవన్నామోచ్చారణ మాహాత్మ్యమును బోధించి వారిచే హరిభజనమును జేయింతురు. "గోవింద రాంరాం గోపాల హరిహరి” యుటయందు వీరికెక్కుడు ప్రీతి. అందుచే వీరు "గోవిండ రాంరాం గారు" అను నామమున జనులకు డెలియబడుచు కాకినాడ ప్రాంతములయందున్నారు. వీరి దర్శనమే భక్తినిగలంగ జేయునని వేరుగ జెప్పనక్కర లేదు.
౨
రెండవవారు బ్రహ్మశ్రీ ముప్పి సూర్యనారాయణ శాస్త్రిగారు. వీరు వెలనాటిశాఖీయులగు వైదికబ్రాహ్మణులు. హరితసగోత్రీకులు. పూర్వపు గోదావరీమండలయిన గోస్తనీతిరమున "ఉండి" సమీపవాస్తవ్యులు. వీరు గొప్పఉపాసకులు. చిన్నతనముననే కాశికిబోయి గంగాతీరమున తపస్సు జేసి, కొంతకాలమునకు నీదేశమునకు మరలివచ్చిరి. వీరు సర్వదా భగవంతుని దీనబంధువని యారాధించెదరు. "దీనబంధూ!" అని దేవుని బిలుచుచుందురు. వీరి తండ్రిగారు గాయత్రీ మంత్రానుస్థానమును విశేషించి చేసినవారు. కానీ వారిని "గాయత్రీమాత" గారని జనులు పిలుతురు. వీరును “దీనబంధు" వను ప్రసిద్ధనామమున దెలియబడుచు గోదావరీమండలమున నున్నవారు.
3
మూడవవారు కృష్ణా గోదావరీ మండలములయందు సుప్రసిద్దులగు బ్రహ్మశ్రీ మల్లాది వెంకటసుబ్బారాయ శాస్త్రిగారు. వెలనాటిశాఖీయులగు వైదికబ్రాహ్మఱులు, హరితసగోత్రికులు. వీరి తండ్రిగారు గుంటూరు నందు చాలకాలము నివసించియుండిరి. తండ్రిగారు ఆంధ్రగీర్వాణములయందు పురాణములను జెప్పుచు శ్రోతలచే బహుగౌరవమున బోషింపబడుచుండెడివారు. వీరాంధ్రమున ననేక గ్రంథములజదివి, పెద్దలవలన ననేక రహస్యార్థములనుగ్రహించినవారు. భక్తివీరికి చిన్నతనమునుండియు నున్న సహజతత్త్వము. వీరి పినతండ్రిగారి పలన కొన్ని యోగరహస్యములను గ్రహించినవారు. కొలది కాలముమాత్రము రిజిస్ట్రేషను డిపార్టుమెటునందు ఉద్యగమున నుండిరి. అనంతరము తమకాలము నంతటిని హరిసేవయందు వినియోగించుచు సంతతభగవన్నామ సంకీర్తనము గావించుచు స్వార్జితపితురార్జిత ద్రవ్యము నంతటిని శ్రీమంగళగిరి లక్ష్మీనృసింహస్వామి వారి కర్పించితిరి. అందుచేత వీరికి "శ్రీహరిదాసు” అను నామము వాడుకలోనికివచ్చెను. వీరి యాజమాన్యమున రమారమి మాటయెనిమిది హరిభజన సప్తాహములయిన నెయుండవచ్చును. వీరిగురువులు భద్రాచలపమీపమున నరణ్యమధ్యమందొక గుహయం దుందురని పెద్దలవలన దెలిసికొని వారిని దర్శించి వారివలన నుపదేశమునొంది కృతార్డులు కాదలచి యాయరణ్యమునకు పోయిరి. ఆట కొన్నిదినములు దిరుగ, ఒకనాటి మధ్యాహ్నమున నొక గొల్ల వాడొక దుత్త పెరుగును, యింకొక దుత్త పాలును దీసికొని యొక గుహద్వారమునకున్న నొకపృక్షమునకుగట్టి వెడలంచుండెను. ఇవి యెవరికొర కిచెట గట్టితివనియడుగ నాగోల్లడివి "ఆత్మారామసదాశివ సద్గురువు” లకొరకనియె. వీరే తనగురువులని తెలిసికొని శ్రీహరిదాసు గారచట వేచియుండి, మధ్యాహ్నసమయమున నా వృక్షసమీపమునకు వచ్చిన మహాపురుషుని సమీపించి వారిపాదకమలములకు వందనములర్పించి తనను శిష్యునిగా పరిగ్ర