గ్రామసభ్యులు వారి శక్త్యనుసారము సాయపడిరి.
గ్రామసంఘములలో సభ్యులు
పైన వివరించిన 112 బాగుగ పనిచేయు సంస్థలలో 108 రిజస్టరు చేయబడినవి. పరిశోధన జేయుచున్నవి 4 గలవు. ఈ 108 శాఖలలో 2232 మంది సభ్యులు గలరు. కాని 1468 మందియే పుస్తకము లుపయోగించుకొనిరి. అనగా మొత్తముమీద నూటికి 61.65%
గ్రామములకు సందర్శనములు
ఈ 112 సంఘములకు ఈ 6 నెలలలో 327 మార్లు సందర్శనములు జరిగినవి. అనగా సుమారు ఒక్కొక్క దానికి 3 సందర్శనములు జరిగినవి.
అవి యీ క్రింది విధముగ విభాగించబడినవి.
- సంఘములు ::సందర్శనములు
- 11 పొందినవి :: 1
- 23 పొందినవి :: 2
- 44 పొందినవి :: 3
- 32 పొందినవి :: 4
- 2 పొందినవి :: 5
ఈ సందర్శనములు పుస్తకములు ఇచ్చుట తీసికొనుటమాత్ర మే జరిగినవి. అనేక సమయము లందు పుస్తకములు ఇచ్చుటకు, తీసికొనుటకు అనేక కారణముల వలన వీలులేకపోయినది. అందులో నొక ముఖ్యకారణమటుల చేయుటకు కాలవ్యవధి లేకపోవుట. గ్రామస్థుడు సాధారణముగ ప్రాతః కాలమందో లేక రాత్రి కాలమందోగాని యింటివద్ద నుండడు. ఎక్కడకు వెడలునో ముందు నిర్ణయింపజాలడు. మేము పని జేసిన యీ యారు మా సములును వివాహదినములును, వ్యవసాయదినములునై యున్నవి.
గ్రామసంఘములకు సందర్శనములు
::(A) (B) (C)
- 1931-32 :: - 92 92
- 1932-33 :: 147 259 406
- 1933-34 :: 100 285 385
- 1934-35 :: 316 - -
(A) ఏప్రియల్ - సెప్టెంబరు - మొదటి అర్ధ సంవత్సరము. (B) అక్టోబరు - మార్చి - తరువాతి అర్ధ సంవత్సరము. (C) సంవత్సరమునకు మొత్తము.
నిలవలో పుస్తకములు : (1) ప్రస్తుతము మా వద్ద 3718 తమిళపుస్తకములు, 819 ఆంగ్ల గ్రంథములు 537 రిఫరెన్సు పుస్తకములు నున్నవి. కొన్ని హిందీ, తెలుగు పుస్తకములుకూడ నున్నవి. ఈ యారు నెలలలో సభివృద్ధి 397. వీటిలో చాలవరకు బహూకృతము. 80 రూపాయల విలువగల పుస్తకములు కొంటిమి. 1983-84 వ సంవత్సరమునకు గవర్నమెంటు వారు ఇచ్చిన 70 రూపాయలు పూర్తిగ వినియోగింపబడినవి.
ఆంగ్ల గ్రంథములు చాలినన్ని యుపయోగింపబడలేదు. బహుశః యెవరికిని అవి యున్నవని తెలియదేమొ. గ్రామములలో చాలమంది ఆంగ్ల భాష తెలిసిన వారు కలరు.
గ్రామసంఘములకు పుస్తకములిచ్చుట.
సంవత్సరము :ఇచ్చినపుస్తకములు
- 1981-32 ::1429
- 1982_38 ::5985
- 1938-34 ::5365
- 1984-35 :: -
1931-32 మొదటి అర్ధ సంవత్సరములో గ్రామములో వేసవికాలపు పాఠశాలా సంచా