ఆంధ్ర దేశ గ్రంథాలయ సంఘము — అది చేసిన పని
ఆంధ్ర దేశమందు ఇట్లు బయలు దేరుచున్న వివిధ గ్రంథాలయములయందు సోదరభావమును గలుగజేయుటకును, పరస్పర సహకారమును గలుగ జేయుటకును, ధర్మగ్రంథాలయ మహావృక్షము ఆంధ్రదేశము నంచెల్లెడల తన వేరులను బారుకొని యూడలను సారింప చేయుటకు గాను 1914 వ సంవత్సరమున బెజవాడ యం దున్న శ్రీ రామ మోహన ధర్మగ్రంథాలయము వారు ప్రథమ ఆంధ్ర దేశ గ్రంథాలయ ప్రతినిధుల మహాసభను సమావేశపరచినారు. ఆసభకు సుప్రసిద్ధులగు శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహంగారు అధ్యతక్షత్ర వహించినారు. ఆ సనకు కృష్ణా - గోదావరి - గుంటూరు - విశాఖపట్నము - గంజాం - నెల్లూరు - కడప - కర్నూలు - బళ్లారి జిల్లాల నుండియు, నైజాము రాష్ట్రము యొక్క ఆంధ్రభాగము నుండియు పలువురు ప్రతినిధులు విచ్చేసిరి. ధర్మగ్రంథాల యోద్యమముయొక్క వివిధదశలను గూర్చి సమర్థులగువారిచే అనుభవ పూర్వకములగు ఉపన్యాసము లియ్యబడెను. ఈ సభయొక్క ఫలితముగ గ్రంథాలయోద్యమమును గూర్చి గాఢాభిమానము గలిగినది.
ఈ సభయందే, ఆంధ్ర దేశమునం దంతటను గ్రంథాలయములను నెలకొల్పుటకును, నెలకొల్పిన వానిని పెంపొందింప జేయుటకును, తగిన ఉత్సాహము నిచ్చుటకును ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘ మను పేరున శాశ్వత సంఘము నొకదానిని ఏర్పాటు జేసిరి. అ సంఘమునకు ప్రధమ అధ్యక్షులు దివాన్ బహద్దరు మోచర్ల రామచంద్రరావు పంతులు గారు, ప్రథమసభ గలుపుకొని, అప్పటి నుండి నేటివరకు పదునాలుగు ఆంధ్రదేశ గ్రంథాలయ ప్రతినిధుల మహాసభలు, ఈ సంఘము యొక్క వివిధ జిల్లాలయందు జరిగినవి. ఈసభల యొక్క ఆహ్వాన సంఘాధ్యక్షులందును అధ్యక్షులందును శ్రీరాజా పానుగంటి వేంకటరామారాయణింవారు, కొచ్చర్లకోట రామచంద్ర వెంకటకృష్ణారావు బహద్దరు గారు, శ్రీ బహద్దరుగారు, రాజా విక్రమదేవ వర్మగార్లవంటి రాజ్యాధిపతులును, ఏ.పి.పాత్రో, భూపతిరాజు వెంకటపతిరాజు, సామి వెంకటాచలం శ్రేష్ఠిగార్లవంటి శాసన నిర్మాణసభాసభ్యులును, దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు, ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, వేమవరపు రామదాసు పంతులు, గద్దే రంగయ్యనాయుడు; మాగంటి బాపినీడువంటి దేశనాయకులును, బారు నరసింహారావు, చెంగయ్య పంతులు, దేశరాజు హనుమంత రావు గార్లవంటి సుప్రసిద్ద న్యాయవాదులును, చిలకమ లక్ష్మీనరసింహం, చిలుకూరి వీర ద్రరావు, చెన్నాప్రగడ భానుమూర్తి, తల్లావఝుల శివశంకరశాస్త్రి, డాక్టరు బురా . శేషగిరిరావు, జనమంచి శేషాది శాస్త్రి గార్ల వంటి కవి శేఖరులును, సూరి వేంకటనరసింహశాస్త్రి, బెల్లంకొండ రాఘవరావు, పురాణం సూరిశాస్త్రి గార్ల వంటి గ్రంథాలయోద్యమ సేవకులును గలరు. ఇట్టి మహామహుల ఆదరణాభిమానముల వలనను మార్గదర్శకత్వము వలనను గ్రంథాలయోద్యమ నౌక ఒడుదుడుకులు లేకుండ ఇంతవరకు తన యాత్రను నిర్విఘ్నముగ కొనసాగింపుచు వచ్చినది.
కొంతకాలమైన పిమ్మట ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘము 1860 సంవత్సరము 12 నెంబరు ఆక్టుకింద చేయబడినది. గ్రంథాలయ ప్రచారకులను తయారు జేయుట కె ఒకమాసము దినములు తాత్కాలిక పాఠశాలను నిర్వహించితిమి. పల్లెటూళ్ళ సమస్యలకును, గ్రంథాలయ పరిపాలనకును సంబంధించిన వివిధ విషయములనుగూర్చి ఆయావిషయములయందు పరిశ్రమజేసిన సమర్థులచే అనుభవపూర్వకములైన ఉపన్యాసము లియ్యబడినవి. ఆంధ్రదేశ గ్రంధాలయ సంఘపక్షమున ఆనేక మంది యువకులు ఆంధ్రదేశ మందంతటను సంచారముజేసి, నూతనగ్రంథాలయములను స్థాపించుటకును, ఉన్నవానిని ఉ తేజింప జేయుటకును పలువిధముల పాటుబడియున్నారు. వీరికి జీతములు లేవుగదా, బత్తెములు గూడ లేవు. 1914 వ సంవత్సరమునందు ఆంధ్ర దేశమునందున్న అట్టి సోదర సేవకుల యొక్క పరిశ్రమ ఫలితముగ 1914-వ సంవత్సరమునందున్న 168 ఆంధ్ర గ్రంథాలయములను నేడు 600 కంటే ఎక్కువ సంఖ్య గలవియైనవి. ఆంధ్రదేశ గ్రంథాలయోద్యమ నిర్మాతలు అనేకమందిగలరు. అట్టివారిలో నాకు ఙ్ఞాపక మున్న వారి పేర్ల నిటవివరింతును:-
గఁజాంజిల్లా:---త్తికి బలరామయ్య గారు, జగన్నాధ పాడి శుడంగ గారు, వ్యాపతి నారాయణమూర్తి గారు, సింహాచలం గారు, టంకాల సాంబమూర్తి గారు, పొట్నూరి స్వామిబాబుగారు.
విశాఖపట్నంజిల్లా; మారేపల్లి రామచంద్రశాస్త్రి గారు, ప్రభల లక్ష్మీనరసింహంగారు, తూర్పాటి