Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.1 (1934).pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గ్రంథాలయ సర్వస్వము

ధముల నంపి స్త్రీలు విశేషముగ చదువునటులను, చది వినదానిని వినునటులను చేయవలయును. పురాణము లన్నను ఉత్సవములన్నను పండుగలన్నను లకు స్త్రీతి మెండు. ఆట్టివాని నేర్పరచి, వారిని గ్రంథా లయములకు వచ్చునటుల జేసి జ్ఞానవతులగునట్లు చేయ వలయును. ఇంతవరకు ఆంధ్రగ్రంథాలయోద్యమ సిద్ధాంతములను గూర్చి నాకు అర్థమైనంతవరకు ముచ్చ టించితిని. ఇక ముందు ఆంధ్ర గ్రంథాలయోద్యమ చరి త్రను కొంతవరకు తెలిసికొందము.

ఆంధ్ర దేశమున ధర్మగ్రంథాలయముల ప్ర్రారంభము.

అంధ్రభాషకు అచ్చుఅక్షరములు 1806 వ సంవ త్సరమున తయారు చేయబడినవి. పిమ్మట 1834 వ సం వత్సరమునందు ఆంధ్ర) గ్రంధములు అచ్చుపడుటకు ప్రా రంభమైనది. చరిత్రపరిశోధనవలన మనకు తెలిసినంత వరకు ఆంధ్ర దేశమున మొట్టమొదటి సార్వజనిక గ్రం Ф థాలయము 1886 వ సంవత్సరమున విశాఖపట్న మున స్థాపితమైన “సరస్వతీనిలయమై యున్నది. ఈ గ్రం థాలయము అంతకు పూర్వము కొన్ని సంవత్సరముల క్రిందటనే సాపింపబడియున్నాను, ఆవత్సరమునందు మాత్రమే అది సార్వజనిక మై యొప్పినది. గ్రంథా లయమన్నను, అందులో సార్వజనిక గ్రంథాలయ మ న్నను, బొత్తిగా తెలియని అదినములయందు ఆంధ్ర దేశ మం దీ సార్వజనిక గ్రంథాలయ స్థాపన మొనర్చిన మహానుహుని నామము, ఆంధ్రదేశ గ్రంథాలయోద్యమ చరిత్రయఁచు సువర్ణాక్షరములతో లిఖియింపబడుననుట కెంతమాత్రమును సందియము లేదు. అమహామహుడు గొప్ప ధనవంతుడా కాడు. గొప్ప విద్యావంతు డాకాడు. సామాన్య బీద ఉపాధ్యాయుడు. కాని గొప్పధనవం తులుగాని గొప్ప విద్యావంతులుగాని చేయజాలని మహ త్కార్యమును ఈ మహానుభావుడు సాధించి, ఆంధ్ర దేశ గ్రంథాలయోద్యమమునకు పునాదిని వేసినాడు,

పిమ్మట, కడపజిల్లా పులివెందులలో సరస్వతీ గ్రం థాల యము బయలు దేరినది. ఆంధ్ర దేశమున బయలుదేరిన మొదటిరెండు గ్రంధాలయములకును “సరస్వతీ దేవి” పేరున నామకరణమగుట ఆంధ్రుల ప్రతిభావి శేషమునకు వన్నె దెచ్చుచున్నది. తరువాత 1890 సంవత్సరమున గుంటూరుజిల్లా వంగోలులో సి. వి. యస్. లైబ్రరీ బయలు దేరినది. 1894 సంవత్సరమున విజయనగరమున "సింహాచలపతిరావు” లెబరీ బయలుదేరినది. 1895 సంవత్సరమున భీమవరము తాలూకా ఉండి గ్రామమున "నౌరోజీక్లబ్బు" ను 1897 సంవత్సరమున ఆ తాలూ కాయందే కుముదవల్లి గ్రామమున “వీరేశలింగకవి సమాజము” ను స్థాపింపబడినవి. 1899 సంవత్సరమున తెనాలి తాలూకా 'కొల్లూరు గ్రామమున (రీడింగు క్లబ్బు బయలు దేరినది. 1900 వ సంవత్సరమున గుంటూరుపట్టణ మునందు యువకులు సాహితీసంఘము “ఎంగు మెన్సులిట రరీ అసోసియేషను” రాజమహేంద్రవరమున "వీరేశ లింగపుస్తక భాండాగారము””ను బయలుదేరినవి. 1904 సంవత్సరమున నైజాము రాష్ట్రము నందలి హైదరాబాదు పట్టణమున "కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయము ౧౧ స్థాపింపబడినది. పిమ్మట యావ దాంధ్ర దేశమునందును సార్వజనిక గ్రంథాయములు పొడసూపసాగినవి 1911 సంవత్సరమున కృష్ణాజిల్లా బెజవాడపట్టణమున శ్రీ మమోహన గ్రంథాలయము స్థాపింపబడినది. 1913 సం వత్సరమున పధమ ఆంధ్రమహాసభ “బాపట్ల” యందు జరిగినది మొదలు ఆంధ్రులయందు నూతన తేజము విక సిల్ల సాగినది. అప్పటినుండియు గ్రంథాలయములును స్థాపింపబ పఠనమందిరములునుగూడ విరివిగ సాపింపబడసాగినవి.

ఇట్లు బయలు దేరిన గ్రంథాలయములలో కొన్ని స్త్రీల యుపయోగమునకై ప్రత్యకము స్త్రీలచే సాపింపబడినవి గలవు. పెక్కు గ్రంథాలయములందు పురుషులును స్త్రీలునుగూడ సామాజికులుగా నున్నారు. ఈ గ్రంథాలయము లన్నింటియందును జన సామాన్య మున కందఱికిని ఉచితముగా గ్రంధములను వార్తాప త్రికలను ఉపయోగించు అధికారము గలదు. కొన్నిం టికి స్వంతభవనములు గలవు. కొన్ని సంఘములు రాత్రి పాఠశాలలను నిర్వహించుచున్నారు. వివిధవిష యములనుగూర్చి జనులకు సుబోధకములగు రీతిని ఉపన్యాసము 'లిప్పించుట అన్ని గ్రంథాలయములకును సర్వసామాన్య | మేను. ఇదిగాక చదువుకొనజాల నట్టియు; చదువునందు వాంఛ లేనట్టియు జనుల ఉపయోగమునకె పురాణ | పఠనము, జంగము కధలు, భాగవతములు మొద లగు పలువిధములైన పూర్వ సంప్రదాయ సిద్ధములైన 'మారములు అవలంబింపబడుచున్నవి. మరియు గ్రామ పారిశుద్ధ్య ప్రయత్నములు, ప్రదర్శనములు, బహుమతి పరీక్షలు, గ్రంథముల యొక్కయు, కరపత్రముల యొక్కయు ప్రకటనము ఇత్యాది ప్రయత్నములు కూడ జరిగినవి.