Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.8, No.5 (1929).pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హూణ గ్రంథ సంపుటములు సమకూర్చబడినవి. ప్రారంభమున రెండు మూడు పత్రికలు కలిగి యల్పసంఖ్యాకులగు చదువరులను యాకర్షించిన గ్రంథనిలయు మిప్పుడు దాదాపుగా నూట యేబది వార్తాపత్రికలను గలిగి యనుదినమును వందమంది పాఠకుల నాకర్షించుచున్నది. ఇట్టి యున్న తదశయందుండు నీభాషానిలయ విశాపురమందలి పల్వురు శ్రీమంతుల యావరమునకు బాత్రమై యున్నదని వేరుగా జెప్పవలయునా? స్వ దేశస్థులగు బర్మీయులును, విదేశీయులగు భారతీయులును, ఐరోపా దేశీయులును, చైనీయులును నీ వాచనాలయమునకు నెక్కువ శ్రద్ధ జూపెదరు. బర్మా విద్యా విచారక రైలును రంగూను పురపాలక సంఘము (Corporation of Rangoon) వారి లైబ్రరీ చేయుచున్న మహెూపకారము గమనించి దగురీతిని సహాయ మొసంగుచున్నారని ప్రతీతి.

ఈగ్రంథ భాండాగారమున పనిజరుగు సమయము యుదయమున రెండుగంటలును, సాయంకాలమున 5 నుండి 8 గంటలవరకు తెఱచి యుండును, గాన నింకను కాలపరిమితిని హెచ్చించుట యవసరము. ఆలయమున పుస్తకముల బోషించువిధము, కార్యనిర్వాహకుని యరుపమ భక్తివిశ్వాసములకు బరమ నిదర్శనమై కన్పట్టెడిని. పాఠశాలలో ప్రవేశమునొందుటకు సావకాశములేనివారికిని వానిని వదలిన యీడు ముదిరిన వారికిని జ్ఞానాభివృద్ధి చేయుటయు, మహనీయుల సదాదేశముల యేర్పరచి తన్మూలమున జదు వెరుగని సామాన్యజనులు కింత జ్ఞానభిక్ష యిడుటయు ముఖ్యోద్దేశములుగా గలిగియున్నది.


ఇక నీ పుస్తకాగారమును గూర్చి నింతటితో ముగించి హిత కారవర్ధని సంఘమునుగూర్చి యొక్కింత చర్చించెదము. హితకారవర్ధని సమాజమెప్పుడు జనించెనో తెలియుటకు ఋజువులైన యాధారములు మృగ్యములు. కాని 1926 మొదలు కొనియున్నదనుట నిశ్చయము, ఇందు ఆంగ్లెయ, గుజరాతీ మరాటీ గ్రంథములు, హూణ గుజరాతీ