Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.7, No.2 (1928).pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

32

(త) గవర్నమెంటు వారు జి. ఒ. రూపముగ బహిష్కరించిన గ్రంథము లం తప్ప తదితర గ్రంథముల విషయమున గ్రంథాలయములు తయారు చేసిన లిష్టుల ప్రకారము గ్రాంటులీయవలెను. 5. అఁధ్రదేశ గ్రంథాలయ సంఘమునకు ప్రజల యొక్క తగిన తోడ్పాటు ) లేకపోవుటచే ధర్మ గ్రంథాలయోద్యమ కార్యవిధానము తృప్తికరముగ పొగుటలేదు. కాన యిట్టి లోపమును నివారణజేసి, దేశాభివృద్ధికి ముఖ్య సాధనమగు ప్రజల జ్ఞానాభి వృద్ధికై నెలకొల్పబడిన ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘ కార్య క్రమమును సక్రమమాఁగ పడుపుటకుగాను తగిన ద్రవ్యసహాయమును, యితర విధములు ప్రోత్సాహమును యిచ్చు టకుగాను ప్రజలను, స్థానిక సంస్థలను యీ సభవారు ప్రార్థించుచున్నారు. 6. గౌతమీ గ్రంథాలయమునకు ఇదివరలో అమూల్యరుగు విరాళము నిచ్చి ఆంధ్రదేశ ధర్మ గ్రంధాలయోద్యమమునకు ప్రోత్సాహము గలుగ జేసిన శ్రీ కంచుమర్తి రామచంద్రరావుగారు అగ్రంథాలయము యొక్క స్త్రీ శాఖకు మరల రు 20,000 రూ ప్యము లొసంగి మహోపకారము చేసినందుకు, శ్రీ నారికి యీ సభవారు కృతజ్ఞతా పూర్వకవఁదనము అర్పించుచున్నారు. 1. ఉదశమండలములోని పబ్లికు లైబ్రరీలో చదువరులు ప్రేక్షకులు ప్రవే శించుటకు దర్బారు దుస్తులు ధరింపవలె నను నిబంధన అక్రమ మని సభవారు అభి ప్ర్రాయపడుచు ఆట్టి నిబంధనలను తొలగించుటకు గవర్నమెంటు వా రుత్తర్వు చేయవలె సని యీ సభవారు కోరుచున్నారు.


గ్రం థ ము లు శ్రమము నొందుచు గ్రంథముల్ చదివెనేని జ్ఞానవంతుఁడై నరుఁడెంతో సౌఖ్యపడును పాటుపడుటచే జెమ్మట పట్టెనేనిఁ గాలిసౌఖ్యంబు వానికే గలదు గాదె పెట్టెలోన జాగ్రత్తగాఁ బెట్టి దాఁచుఁ కప్పురపు పేర్లు హరియించు కరణి నకట జనుల యశ్రద్ధచేత భాషామతల్లి గ్రంథముల డాగి కృశియింపఁగాఁ గడంగె || —ఆచంట సూర్యనారాయణ సాంఖ్యాయనశర్మ.