ఇంక నెవ్వరెవ్వరు చేసియున్నారో? దీనినిఁ బట్టి మనకు శ్రీరంగ మాహత్మ్యము వైష్ణవ భక్తు లెక్కువ భక్తితోఁ బఠియించెడు గ్రంథమని తెలియుచున్నది. అనేక నూతన రూపముల వ్రాయుటవలన విషయమొక్కటియైనను, నూతన రూపము నిచ్చుటయే వారు, వారుచేసిన కార్యముగఁ గన్పట్టుచున్నది.
భైరవుని గ్రంథమును శ్రీ మా. రామకృష్ణయ్య ప్రకటించియున్నారు. భైరవుఁడు క్రీ. శ. ౧౫౦౦ లకుఁ బూర్వుఁడని వారి యభిప్రాయము. ప్రస్తుతము దొరికిన విషయములనుబట్టి యిద మిద్ధమని నిర్ణయించుటకు వీలులేకున్నది.
నరద రాజేంద్రుఁడు "అళియ రామరాయల పెదతల్లి కుమారుఁడు” అని వారు వ్రాయుచున్నారు. దీనికాధారమేమో తెలియఁబరుపరైరి. వరదరాజీ క్రింది పద్యములవలన దనకుముందీ గ్రంథము నెవ్వరును వ్రాసియుండనట్లు వ్రాయుచున్నాడు. కవితో స్వప్నమున భగవద్వాక్యము
| క. | కృతి సేయుము గారుడ సం | |
.
| ఉ. | సేయరె తొల్లి సత్కవుల శేష పురాణ | |
| క. | అని యానతిచ్చి గరుడా | |
.
దీనినిఁబట్టి వరదరాజేంద్రునకుఁ బూర్వము శ్రీరంగ మహత్మ్యము నేరు రచియింపనట్లు భగవద్వాక్యము వినఁబడుచున్నది. భైరవుఁడే వరద రాజేంద్రునకుఁ బూర్వుఁడైనియెడల నీ పైమాట లెట్లు సత్యములగును? వరద రాజేంద్రుఁడు ౧౫౩ం ప్రాంతముల యందున్న యళియ రామరాజు పెదతల్లి కుమారుడగుట నిజమేని యించుక పూర్వుడైనను ౧౫౦౦ సం॥ ప్రాంతముల నుండవలెను. భైరవుడంతకుఁ పూర్వమే తన గ్రంథమును రచియించెనన జెల్లునా? ఒక వేళ భైరవునికృతి వరద రాజేంద్రుఁ డేఱుగడా? లేకయిరువురు సమకాలికులై యుందురా? భైరవునికృతి యాతినికి మిక్కిలి దగ్గఱ కాలములోనున్న వరద రాజేంద్రుఁని నాటికి వ్యాప్తినొంది యుండదా? ఇవి చరిత్రకారులు సమర్ధింపవలసిన విషయములు.
ప్రస్తుతమాంథ పరిశోధక మహామండలి వారికిఁ జిక్కిన వరద రాజేంద్రుని శ్రీరంగ మాహాత్మ్యము నుండి వివరణములు తెలిసికొందము.
[గ్రంధము తాటియాకులది. పొడవు 1 అ 5 అంగుశములు. వెడల్పు ఆం 1¼లు, పత్రములు 139, ఇగుప్రక్కల వ్రాయఁబడి యున్నది. పుటకు 6 పంక్తులున్నవి. గ్రంథము మంచి స్థితియందున్నది. పీఠికి పద్యములలో వంశవర్ణనము కొంతవ్రాసి విడిచినట్లు తోఁచు చున్నది.]
వరద రాజేంద్రుని కపిత బ్రాహ్మణునిది కాదని ‘చేపల బుట్టయల్లినట్లున్నదని మా. రామకృష్ణయ్యగా రనుచున్నారు. కాని నేనదిసహింపను, వరదుని కవితి కూడ భావ ప్రౌఢినుకలదియ యని వారేయంగీకరించి నాలుగైదు పంక్తులలో స్వవచన వ్యాఘాతము లొనరించుకొనుట మంచిపనికానేరదు. ఐనను వారికలము నడ్డఁగల వారెవ్వరు? వరదుని కవిత వారికి బాగుగ నుండునప్పుడది యీ కారణములచే నట్లు లేదనుట న్యాయమనియే నావినయపూర్వక విజ్ఞాపనము. తాము ప్రకటించుకొను గ్రంధముల వ్యాప్తి కితరుల గ్రంథము లప్రశస్తములని వ్రాయుట మాత్రము ధర్మము కానిపని.
వరద రాజేంద్రుఁడాది కవుల నీవిధముగా స్తుతించి యున్నాఁడు.
| ఉ. | నన్నయభట్టు ప్రెగ్గడను | |