కావేరి
(అగస్త్యకుమారుని వియోగరాగము)
ఉదయారుణ్యము లీ వనాంగణ తరువ్యూహమ్ములందు౯ రమా
స్పదమై యల్లుకొనంగ, నస్ఖలిత పూజాపుష్ప సంసాదివై
తుదలార్ద్రమ్మగు మూర్ఖజాళి విడిపోఁద్రోవ౯ గరంబెత్తి, నా
యెద కానందము గూర్చు లక్ష్మి విడిపోయె న్నేటికి౯ నాటికీ౯.
త్రోపుడువెట్టిపాఱెడు ఝరుల్ పులకింపగఁబాడ చంద్రికా
స్నాపితరాత్రులందు తరుణమ్మగు నీమృదుపాణి నా చెయి౯
దోపికొనంగ మేమెయినోదుంగుచు, నాయనురాగమూర్తి మ
ద్దేపికొనంగ యేన్నడరుదెంచెదవో!ననుఁగూడితోడుగ౯.
ఓ తేజస్విని! మౌనమోహనమ యయ్యు౯ నీదునెమ్మోము, నీ
నాతిశ్రాంత శరీరశోభ లతి సాంద్రంబైననుం గప్పఁ బ్రే
మాతీధ్యమ్మొకయింత కాసపడి, సాయంవ్యాప్తమౌ దేహ వ
ల్లీ తారుణ్యముతోడ రమ్మ నెద, కేళీలోలపై యుండగ౯.
అబద్ధంబయినట్టు లీ చరమ సంధ్యారాగ సూత్రంబులం
దో బింబోష్ఠి! విశాలపర్ణకుటి స్నాయుచ్ఛేదమై, పంజరం
బై, బాధా జనకమ్ముగాఁ దలఁతు; ప్రేమాశ్లేవబంధమ్ము లీ
లాబాహ్యవ్మయి యేగుచో జగములెల్ల౯ శృంఖలాకారముల్
- అబ్బూరి రామకృష్ణారావుగారు.
కట్టా వరదరాజేంద్రుఁడు
శ్రీరంగ మాహాత్యములు
శ్రీరంగ మాహాత్మ్యము పెక్కుకుంది తెలుఁగులో రచియించి యున్నారు. సంస్కృతమునందిది గరుడ పురాణము నందును, బ్రహ్మాండ పురాణమునందును గూడ రచియింపఁబడీ యున్నది. తెలుగులో నీగ్రంథము ననువదించిన కవులను, కావ్య స్వరూపమును ఈ క్రింద స్వల్పముగఁ దెలియఁజేసెదను.
తెలుగు శ్రీరంగమహాత్మ్యములు వ్రాసినవారు:-
- (1) భైరవుఁడు (పద్యకావ్యము)
- (2) వరదరాజేంద్రుడు (డిటో)
- (3) ముకుందయోగి (ద్విపద)
- (4) నరసన్న (కందపద్యములు)
- (5) గుండుపల్లి జగన్నా నకవి (పద్యకావ్యము)
- (6) (పేరులేదు) (వచనము)
- (7) భాగవతులరామకవి (బ్రహ్మాండపురాణము నుండి)
- (8) పులిపాక రామన్న (వచనము)