Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.2, No.1 (1918).pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శరదృతువు

రాజధానియందలి జమీందారులు చేసిన భూదానములను నిలిపి శాశ్వత యశస్సును బడసియున్నారు.

ఈ మహారాజాగారి రాజభక్తి అద్వితీయము. రాజభక్తి అనునది యీ కుటుంబము వారికి వంశానుగతింబుగ వచ్చుచున్నది. ఈ కుటుంబమువారి పూర్వచరిత్ర మును జదివిచూచినయెడల ఎచ్చటను ఏనాడును, ప్రభువునకు విరుద్ధముగ కక్షగట్టి యుద్ధములు చేసినట్లు గనుపడదు.

ఇప్పుడు జరుగుచుండు ఘోర సంగ్రామము ప్రారంభమయినప్పుడు, వీరు మూడు లక్షల రూప్యములు ప్రభుత్వమువారికి సహాయముగ నిచ్చిరి. మఱియును, యుద్ధనిధికి సహాయముగా అనేక వేల రూపాయలు పంపుచునే యుండిరి. వారి వాగ్దత్తమును వారి పుత్రులగు యిప్పటి రాజాగారు నడుపుచు నేయున్నారు. ఇదియును గాక శ్రీవారు మోటారు అంబ్యాలెన్సుకు గాను రెండు మోటారులగొని యిచ్చిరి.

ఇట్టి మహోదారుడును, జనప్రియుడునగు ఈ మహాప్రభువు వాణి ౧౮౧౭ (1817) సం॥రమున జననమంది ౧౯౧౬(1916) సం॥రం జూలై నెల ౨3(23) తేది ఆదివారమున స్వర్గస్థులయిరి.

ఇప్పుడు శ్రీవారి ఏక పుత్రులగు శ్రీశ్రీ రాజాగోవింద కృష్ణ యాచేంద్రబహదర్ గారు తండ్రిగారి యొక్క అధికారమును వహించి వంశానుగతంబగు మర్యాదల ననుసరించి ప్రజల మనస్సున కానందముగలుగునట్లు రాజ్యపరిపాలన జేయుచున్నారు.

--నెమలి సుబ్బారావు.



శరదృతువు

ఓ శరదాగమంబ నిను . నుజ్జ్వలమూతిని సర్వసస్య సం
వేశిత దివ్యపూర్ణఫల వృద్ధినిఁ గన్నులఁ గాంచి కమణక
స్వాశయముల్ ముదంబలర బ్రాహ్మణజాతి సమస్తదేవతా
భ్యాశ సపర్యఁజేసి కడు పారగ శారదగాంచగా వణి
గీశయు లాపణప్రచుర దీధితులొప్ప సువణజాల సం
నేశిత భూరిచర్చల న భీష్ట సుఖాప్తినిఁ జూడఁగా ధరా
ధీశులు క్షత్రియుల్ జ్వలద ధిజ్య శరాగనపూజసేసి యా
కాశముపిక్క టిల్ల ఘన కాహళికాది రవం బెసంగ ది
-క్క శులు తల్లడిల్ల మహి నెన్నగ దిగ్విజయంబు సేయు నా
కరూశలుపోయె నా బల మ యారె ఫలంబదిపోయె శౌర్యమ
మ్మా శుభదృష్టిఁ జూడు మొక మక్కు వదక్క నికేమిలేదు మే
మో శివపూజసేయ నిది యొప్పు నె నీకు నిదేమిఘోర మ
మ్మా శశి కాంతిఁ జూచిన మానిధి పద్మముసొంపుఁ జూడ నా
కాశ వినిర్మలప్రభ ల • గాధనదీనదముల్ ప్రవూణ నీ
రాశయముల్ త్వదీయ మహిమాజిత శక్తిని జూపుచుండ మా
యాశలదేల తేర్యవిపు డైన నిను ననుపట్టివార

మ్మా శతసంఖ్యలుండి ముద మార శరన్నవరాత్రులంచు వి
ప్రాశన శక్తి పూజనము • లచ్చట నచ్చటఁ జేయుచుండియుజ్నె
నీ శరణంబు జొచ్చిరిఁక నీ బల శక్తులఁ జూపి తొల్లి మా
పో శరదంబవణ ముల కున్నతిఁజేసి వసిష్ఠ భీమ వి
త్తేశ సమాన విడ్విదుర లేయన సంతతిమేలు మమ్మరో.
శారదచంద్ర నీదుగుణ
శారద చంద్ర నీదు గుణ
హా రహిమించునంచు నుతు
సంపద లెందరు సత్క వీళ లా
అద్భుత వైఖరి చేసి చాటిన