గ్రంథాలయ సర్వస్వము
దలను యోచించి రు ౧౦,౦౦౦ ల గౌవర్న మెంటుపత్ర ములను బహుమానముగ నిచ్చిరి.
మద్రాసునందు శ్రీవిక్టోరియా మహారాజ్ఞి పేర ఘోషావైద్యశాలను గట్టుటకై ఒక లక్ష రూపాయలను ప్రభుత్వమువారికొసంగిరి. నెల్లూరునందు క్రైస్తవులు హైస్కూలును స్థాపించి హిందూ బాలురకు గూడ ఉన్నతవిద్యను గఱపుటకు ప్రారంభించిరి. కొంత కాలమైన పిమ్మట ఈపాఠశాలాధికారులు హిందూ బాలురను కొందరిని వారి మతములోనికి గలుపుకొనిరి. అప్పుడు కొందరు హిందూ హైస్కూలును స్థాపించిరి. కాని ఉత్సాహము మెండుగా నున్నను ధనసహాయము లేనందున ఈపాఠశాల నానాటికి క్షీణదశనొందసాగెను. అట్టి సమయమున విద్యాభిమానులును, స్వమతాభిమానులునగు శ్రీరాజా గారు ఈ ధర్మము యొక్క ఆవస్యకతను చక్కగా దెలిసికొని దాని పోషణను తామే భరించుట కొప్పుకొనిరి. ఇప్పుడీ పాఠశాల వెంకటగిరిరాజాగారి హైన్కూలని సుప్రసిద్ధి జెందియున్నది. ఈ పాఠశాల యొక్క భవనముల కొఱకును, పోషణ కొఱకును ఇదివర కనేక వేలరూపాయలు ఖర్చు పెట్టబడెను.
ఇదియును గాక అప్పుడప్పుడు మదరాసు మొదలగు గొప్పపట్టణములయందును, కుగ్రామములయందును స్వదేశాభిమానము గలవారు యత్నించిన సత్కార్యముల కెల్లను వెయ్యి మొదలు పదివేలవఱకును చెక్కు సారులు విరాళములనొసంగి కీర్తి గాంచి యున్నారు.
ఈమహారాజుగారికి బాల్యమునుండియు సామునందును గుఱ్ఱపుస్వారియందును మృగయావినోదమునందును అభిమానము విశేషముగా కలదు. వెంకటగిరి పట్టణమున గల అనేక గరిడీశాలలకు విశేష ధనమును ప్రతిసంవత్సరమును ఒసంగి జీర్ణించుచున్న ప్రాచీన విద్యలకు ప్రోత్సాహము గలిగించుచుండిరి. మఱియు తామును, రాజ బంధువులును, నగరికి సంబంధించిన 'జట్లు' నౌకరును దేహపటుత్వము జెడకుండ సాముచేయుటకు గాను రాజ · భవనమున౦దే గరిడీర్థలము నేర్పాటుచేసి యున్నారు. వీరు గతించునప్పటకి గి సంవత్సరముల వయస్సు చెల్లి యుండినను ప్రతిదినమును తప్పక గరడీలో సాముజేయుచు తక్కినవారిని బ్రోత్సాహపఱచుచుండువారు. ఈ కాలమునందలి కాలిబంతిఆట, టెనిస్సు, క్రికెట్టు మొదలగు ఆటలయందు అభిమానముండినను గరిడీసాములు వలన దేహమునకు స్థిరమైన పటుత్వము గలుగునని వారి నమ్మకమై యుం డెను.
ఈప్రభువు గారు గుఱ్ఱపుపందెములు పోలో మొదలగు ఆటలయందుకూడ మిక్కిలి అభిమానముగలిగియుండిరి. అందువలన మదరాసులో స్థాపింపబడియుండు 'జంఖా నా' కొఱకు అనేక వేలరూప్యములను ఖర్చు పెట్టి మే లైన సౌధమును జంఖానా మైదానమునందు గట్టించి యిచ్చిరి. హిందూ విశ్వవిద్యాలయమునకు గాను వీరు ఇరు వదియైదు వేల రూప్యములు విరాళమొసలిగిరి. మదరాసు నందు “ల్యాండు హోల్డర్సు అసోసియేషన్" అను పేరుతో నొకసభ నేర్పాటుచేసిరి. అందులకు శ్రీమహారాజా గారు అగ్రాసనాధిపతిగ నుండి దానిని మిక్కిలి జయప్రదముగను జమీందారులకు మిక్కిలి ఉపయోగకరముగను జరుపు చుండిరి, జమీందారులకు సంబంధించిన బిల్లులను ప్రభు త్వమువారు శాసన నిర్మాణసభలోనికి దెచ్చినప్పుడెల్ల వాటివిషయమై చక్కగ నాలోచించి, జమీందారుల యొక్క అభివృద్ధికి నష్టకరంబులగు విషయములుండిన వాటినిగుఱించి సవినయముగను పట్టుదలతోను విన్న ప ములను జేయుచుండిరి.
ఈమహారాజాగారును శ్రీశ్రీ బొబ్బిలిమహారాజా గారును మిక్కిలి పట్టుదలతో గృషి చేసి “ఇంపార్టబిల్ యస్టేట్సు బిల్లు" అనుచట్టమును గౌక్నరుగారి చట్టనిర్మా ణసభలోదెచ్చి అంగీకారము పొందునట్లు మిక్కిలి పా. టుపడిరి. ఈబిల్లువలన అనాది సంస్థానములు అన్యా కాంతములు కాకుండునట్లు సంరక్షింపబడుచున్నవి.
చట్టముల ననుసరించి వినయవిధేయతతో న్యా యముకొఱకు ప్రభుత్వమువారితో పోరాడుట తప్పుగా దని వారిదృఢనమ్మకము. తల్లి అయినను, పనితొందరల లోబిడ్డయొక్క ఆకలిసమయము మఱచియుండినను, బిడ్డ యొక్క రోదనలను విని ఆబిడ్డకు పాలిచ్చి పోషించు చున్నది. ఒకప్పుడు చిఱకుపడినను నైజమగు తల్లి తన ధర్మమును ముఱువజాలదు గదా!
ఈనాములను గురించి వచ్చిన తల్లి గాయిదాయందు వీరు విశేషముగ పోగాడీ పూర్వకాలమున మదరాసు