కరము చేసి వైచిరి. లోకులుబోర్డు శాసనము ప్రకారము ఆటవీ పరిపాలనము, పంటనీటి పంపకము, ధర్మాదాయముల పరిపాలన — ఆది ఇది యన నేల ప్రభుత్వమువారు గాని ఇతర లోకలు బోర్డులు గాని ఇతర ధర్మసంస్థలు గాని పంచాయతులకు సంక్రమింపజేసే అన్ని యధికారములును పంచాయతులు జరుపుకొనవచ్చుననుట ఈశాసన సవరణలో చేర్చిరి. కాని సంక్రమింప చేసే పుణ్యాత్ములెవరు? మంత్రులు రాజ్యమేలినా జరుగుబాటు నిరంకుశాధికారులదేగదా
కొంత కాలమునకు తరువాత బొబ్బిలి తన ముఖ్యమంత్రిత్వములో తాలూకాబోర్డులను రద్దు చేయగా జూచి పంచాయతులు విరివిగా స్థాపనయగునని మాబోటివారి కలలను మహారాజులు తీరుస్తారని భ్రమపడినవారు కొందరు కలరు. కాని వారి తాలూకాబోర్డుల రద్దు జిల్లా బోర్డుల విభజనలకు పార్టీలను బలపరచడానికి కుంగదీయడానికి పనికివచ్చే యెత్తులకు వినియోగ పడడం దేశపు దురదృష్టము.
నేటిదినము పరిస్థితులు మారి యున్నవి. గవర్నరులు ప్రతిబంధకాలు పెట్టుటలేదని తీర్మానముగా మాట యిచ్చిన పిదప పరగణా పరిపాలనను సర్వస్వతంత్రులుగా ఇండియా గవర్నమెంటు శాసనపు వీడరాని ఇబ్బందులకు లోబడి కాంగ్రెసువారు తలధరించినారు. వీరు సంపూర్ణణముగా పంచాయతీ పరిపాలనయే దేశమున స్థాపింపసద్యోగించు పార్టీవారు కావున ఇకముందు జరుగబోయే సవరణ సవరణ మాత్రముగా నుండరాదు; పరిపూర్ణమైన పునర్నిర్మాణముగానే యుండవలెను. పునాదికట్టడము నిజమైన పునాది కట్టడమే కావలెను.
శాస్త్రోక్తము గాను ఛాందసము గాను చెప్పదలచుకుంటే ఇంత కాలము అమలులో ఉండే లోకలు బోర్డు చట్టముపై దర్జా ప్రభుత్వ పుటధికారి తన ఇష్టము వచ్చినట్టుగా లోకలు బోర్డులనే క్రింది దర్జా అధికారులను నియమించి తన ప్రతినిధిగా ఈ యీ పనులు చేయవచ్చును, ఈ యీస్వాతంత్య్రములు పొందవచ్చునని ప్రాతినిధ్యాధికారులను సృష్టించే చట్టముగా ఉన్నది. ఏర్పడే లోకలు బోర్డు ప్రజల ప్రాతిపదిక హక్కు చేత ఏర్పడేదని పైఅధికారులిచ్చే యాయవారపు బ్రతుకు గాక తనకు స్వతంత్రమగు స్థానమున్నదని ఆనుకోడానికి వీలుగల్పించే చట్టము గాదు.
మనకు సంపూర్ణ స్వాతంత్య్రం సంక్రమించేవరకు ఈ విధమగు చట్టము ఏర్పడుతుందనుకోడానికి అవకాశము లేదు. కాని ఇందుకు బునాదులు వేసే ప్రయత్నం కాంగ్రెసు వారు చేయవచ్చును. దీనికి మూడు ముఖ్య సూత్రేలవసరం. మొదటిది దేశములో మునిసిపాలిటీలుగా ఏర్పడే భాగాలు తప్ప మరియే భూభాగముగాని, పంచాయతీ పరిపాలనలో లేకుండ ఉండరాదు. ఇప్పటి ప్రతి రివిన్యూ గ్రామమూ ఒక పంచాయతీగా ఏర్పరచడము అత్యవసరం; అప్పుడు దేశానికి ప్రాతిపదికమైన ఏ గ్రామపు సౌకర్యాన్ని గూడ ఇతర ప్రాంత ప్రతినిధులు కొరవడ చేసే అవకాశముండదు. కొన్ని గ్రామాలకు ఉమ్మడిమీద జరుగవలసిన పనులు కొన్ని ఉన్నవి: ఉదాహరణము : రోడ్ల ఎస్టిమేట్ అధికారిని నియమించు కోవడం. నిజానికి ఎస్టిమేట్ పనితో గూడ శిక్షణపొందిన ఏడు గ్రామముల గ్రూపు సేవకునిని ప్రస్తుతపు మంత్రి వి. వి. గిరిగారి ఆలోచనను అనుసరించి ఏర్పరచగలిగితే అతడే ప్రతిపంచాయతి కార్యక్రమమును జూచి ఉమ్మిడి పనిగూడ చేయవచ్చును. అందుచేత ఉమ్మడి కార్యాలకు గ్రూపు పంచాయతీల జాయింటు కమిటీల నేర్పరచవలెను. ఇంకొక ఎన్నికవలన ఏర్పడే జిల్లా బోర్డు లుండరాదు. ఈ జాయంటు కమిటీల జాయింట్ కమిటీ ఆవసరమని తోచితే జిల్లా విస్త్రీరపు కార్యమును చూడవచ్చును. లేదా ఇప్పుడు జిల్లాబోర్డు నిర్వహించే కొన్ని పనులు జాయంటు కమిటీలకు వదలి వేసి తక్కినవి ఆయా ప్రభుత్వశాఖోద్యోగుల వశము చేయవచ్చును. ఇంతటి కార్యకమాన్నీ తనిఖీ చూచుకొనేపని ప్రభుత్వపు తాబేదారైన లోకలు బోర్డుల ఇనస్పెక్టరుకు సర్వాధికారముతో ఒప్పజెప్పరాదు. లోకల్ అడ్మినిస్ట్రేషన్ బోర్డు శాసన సభ్యుల నుండి ఏర్పరచవలెను. లోకలు గవర్నమెంటు మంత్రి వారికి నాయకుడుగా నుండి లోకలు బోర్డుల ఇనస్పెక్టరును అతని కార్యాలయమును ఈ బోర్డు వశము నందుంచి కార్యక్రమము జరుపవలెను.
మరియొక విషయ మీసందర్భమున గమనింపదగి యున్నది. గ్రామ పరిపాలనమునకు గ్రామ పంచాయతి దక్క ఇతర సంస్థలు గ్రామము నందు నిర్మాణము చేయరాదు. ఇరిగేషన్ పంచాయతులు, ఫారెస్టు పంచాయతులు, ధర్మాదాయ పంచాయతులు వగైరాలు రద్దు కావలెను. ఇట్టి శాసన బద్ధము గాని సంస్థలను అధికారుల ఉత్తరువు మాత్రము చేత సృష్టితములగు సంస్థలను అవక తవక ఎన్నిక పద్ధతులమీద ఆధారపడిన సంస్థలను వేరు వేరుగా కల్పించి గ్రామములలో దినమొక ఎన్నికకు తావు చేసి యుండడము చేత కలతలు పెరిగిపోయినవి. ఎన్నికలమీది దృష్టితప్ప ప్రజాసేవమీది దృష్టి లేక పోయినది. కాబట్టి వేరే సంస్థలన్నిటిని గ్రామపంచాయతిలో లీనము చేసి వాని ధర్మము లన్నిటిని వీనికి నొప్పజెప్పవలెను.
ఆయిన న్యాయవిచారణ మాత్ర మీ గ్రామ పంచాయతీలకు పెట్టరాదు. ఇప్పటి పంచాయతీ కోర్టులును ప్రజలకు నష్టదాయకములే! ప్రాచీన కాలములందును న్యాయవిచా