Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.11, No.6 (1937).pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లోకలుబోర్డుల శాసనము గ్రామపంచాయతీల స్థానము*

గ్రామపంచాయతులు స్వరాజ్య సౌధమునకు బునాది. ప్రజల ప్రభుత్వము నిజము కావలయునంటే ఆకాశ హర్మ్యాలు కట్టడమువల్ల ప్రయోజములేదని క్రింది నుంచి కట్టుకొని రావలసి ఉన్నదని ఏనాటినుంచో అందరు పెద్దలూ అంటున్నారు. పూర్వము పంచాయతీలు మన దేశములో ప్రబలంగా ఉంటూ ఉండినవని, అవి స్వతంత్య్ర ములని, పైరాజ్యా లెన్ని మారి మసిబొగైపోతున్నా ఈ పునాది సంస్థలను చంపివేయక ఉన్నందు చేత భారత భూమి ప్రజ తరతరాలు యుగయుగాలు స్వాతంత్య్రం పోగొట్టుకొన్న ట్టే తలచకయుండినదని ఆనేకులు వ్రాసి నారు. కాని బ్రిటిషు రాజ్యాంగ పద్ధతి ప్రవేశ మైనపిదప రూపుమాసిపోయిన పంచాయతులను మరల సృష్టించే చే ప్రయత్నం మొన్న మొన్నటి వరకూ జరిగింది కాదు

1920 లో అసంవత్సరపు XV నంబరు చట్ట మొకటి చేసి గ్రామములవారు పంచాయతు లేర్పరచుకొనవచ్చు ననిరి. ఊరిచుట్టు మొలచిన నాగ జముడు నరకడమనే పనితో కూడ కొన్ని పనులను జాబితా చేసి అందులో ఏ పని తలచు కుంటే ఆపని గ్రామపంచాయతీ చేసుకొనవచ్చు ననిరి. సర్కా—రువారిచ్చే గ్రాంటులు గ్రామములోని ఉమ్మడి ఆదాయము తప్ప దీనికి సక్రమమైన ఆదాయమార్గా లేవు. గవర్న మెంటువారి మంజూరుతో కొన్ని కొన్ని పన్నులు వేసుకోడానికి అధికారాలు ఆచట్టములో ఇము డ్చిరి. గుంటూరు, సేలము, పడమటి గోదావరి, చెంగల్పట్టు, అనంతపురము మున్నగు జిల్లాలలో ఇట్టి పంచాయతులు విస్తారముగా ఏర్పడెను. పొడుగు చేతి పన్నేరముగా పం చాయతీ రిజిస్ట్రారు జనరలు వారివద్దనుంచి గ్రాంటులు తెచ్చు కోగల పంచాయతీలు శ్రద్దగా ఊరిబలాన్ని ఉపయోగిం చుకొని రైతుల చేత కాయకష్టము చేయించుకోగల పంచా యతులు కొన్ని కొన్ని బాటలు రోడ్లు వేసుకోగలిగినవి, దీపాలు పెట్టుకోగలిగినవి, గ్రామపు బడుల గ్రాంటులు రిజిస్ట్రారుద్వారా పంచాయతులకు ఇవ్వడము సంభవించి నందువల్ల అనేక పంచాయతీలు స్కూళ్ళు లేనిచోట పె ట్టుకో గలిగినవి. కాని ఈమాత్రము పనియైనా అరు వేల

గా. హరిసర్వోత్తమరావు గారు ఎం. ఏ.

పంచాయతులలో ఏ 600-700 పంచాయతులే నిర్వహించి నవి. తక్కినవి పేరుకు పంచాయతులు గాని పనికి పంచాయతులు కాలేదు.

అందుచేత 1930 లో లోకులు బోర్డుల చట్టము సవరణకు వచ్చినప్పుడు ఈ పంచాయతులను అందులో చేర్చి “అవి యే నిజమైన లోకలు బోర్డులు, గ్రామము, తాలూకా, జిల్లా ఇన్నిటికిని సంబంధించిన సర్వస్థానిక వ్యవహారములు వాని మూలకముగా నే జరుగవలెను. పంచాయతీలేని పల్లె టూ రే యుండరాదు.” అనే పట్టుదలతో సవరణలు చేయించవలెనని అప్పుడు శాసనసభలోనున్న నాబోటి వారికి తోచినది. పంచాయతీబోర్డులను సరియైన శాస నాధారముల మీద నేర్పరచి లోకల్ బోర్డు పరిపాల నలో వీనికి కొంత ప్రముఖస్థాన మీయవలెనని అందరికిని తోచినది. గ్రామసీమలలో పంచాయతులు నిర్బంధముగా పాపించవలసినదని వాని జాయింటుక మిటీ లే, అంటే ఆయా భాగములలోని పంచాయతు లేర్పరచుకునే ప్రతి నిధి సంఘములే తాలూకా జిల్లా బోర్డులుగా నేర్పడవలసిన దని అదివరలో 'తాలూకా జిల్లాబోర్డులకు ఉన్న ఆదాయ మార్గాలన్నిటినీ వాని యధికారములన్నిటినీ ఇంక కొన్ని సర్కారు అధికారములతో కూడ పంచాయతులకు మార్చ వలసినదనీ సూచించిన పంచాయతీ రాజ్య సూచనలు జిల్లా బోర్డు అధ్యక్షులు తాలూకా బోర్డు అధ్యక్షులతో కూడిన అనాటి శాసన సభ్యుల తల కెక్కలేదు. నేటి లోకలు బోర్డుల ఆక్టులోగల సదుపాయముల మాత్రముతో ఐచ్ఛి కముగా పంచాయతు లేర్పడి తాలూకా బోర్డు జిల్లాబోర్డు లోకులుబోర్డుల ఇనస్పెక్టరు జిల్లా పంచాయతీ ఆఫీసరు ఇందరి తనిఖీలో పని చేయవలసినదని శాసన మేర్పడినది. భూమి శిస్తుమీది సెస్సులో బహు స్వల్పభాగము పంచా యతులకు ప్రత్యేకించడము జరిగినది. ప్రజలలో కలతలు పెంచే పన్నులు వేసికొనే అధికారాలు లైసెన్సు ఫీజులు విధించే అధికారాలు పంచాయతులకు నిర్ణయించిరి. జాయిం టుకమిటీ లేర్పరచుకునే హక్కు- వీనికి సంక్రమించినది. కాని బొబ్బిలి ప్రభుత్వములో ఆ హక్కు నిష్ప్రయోజన 3

  • కడచిన మాసము 30 వ తేదీని జరిగిన బెజవాడ జిల్లా పంచాయతీ ప్రెసిడెంట్ల సమావేశమున చేసిన

ప్ర్రారంభోపన్యాససారము.