158
పశ్చిమ గోదావరిజిల్లా గ్రంథాలయ కార్యసంఘ సమావేశము
అధ్యక్షులు సర్దార్ దండు నారాయణరాజుగారు భీమవరం - ది. 28–36
భీమవరము జిల్లాబోర్డు, పటేలు గ్రంథాలయ, భవనమున
2-8-36 న పశ్చిమగో దావరిజిల్లా గ్రంథాలయ కార్యనిర్వా
హక సంఘసమావేశము అధ్యక్షులగు శ్రీయుత దండు
నారాయణరాజు గారి అధ్యక్షతను జరిగినది. సభకు హాజరైన
కార్య సంఘసభ్యులు శ్రీయుతులు భూ. తిరుపతిరాజు గారు
(ఉ॥ అధ్యక్షుఁడు) డాక్టరు పా. సత్యనారాయణశర్మగారు
తేతలి సత్య నారాయణమూర్తిగారు కార్యదర్శులు వద్దిపర్తి
రాజారావుగారు వేగేశ్ని సూరపరాజుగార్లు, ఆంధ్రదేశగ్రం
థాలయసంఘ కార్యదర్శి శ్రీ అ. వేంకటరమణయ్య గారు
శ్రీ
కూడ హాజరైరి. గ్రంథాలయాభిమానులు భూ. రామ
మూర్తిరాజు గారు, పా. వీరాజు గారు మొదలగువారుకూడ
విచ్చేసిరి. కార్యసంఘమువా రి దిగువ తీర్మానములను
ఏక గ్రీవముగా గ్రంథాలయాభివృద్ధికి గాను తీర్మానించిరి.
ది 3-5.36 న ఆమోదించబడిన నెవరు తీర్మానాను
సార మీ దిగువ ప్రణళికను ఏకగ్రీవముగా తీర్మానించిరి.
ప్రణా ళిక
ప్రచారము:-గ్రామఫోను, భజనలువ గైరాలతో
జనులను గ్రంథాలయములవద్ద గాని గ్రంథాలయ సంఘ
యాజమాన్యమున జరుపబడు ఉపన్యాస వేదిక ల యొద్దకు
వేదిక లయొద్దకు
గాని ఆకర్షించుట; తదుపరి గ్రంథాలయోద్యమమును
గురించియు విజ్ఞాన వ్యాపకమున కవసరమగు నితర విష
యములను గురించియ ఉపన్యాసము లిప్పించుట,
మ్యాజికులాంతరు బొమ్మలతో గ్రంథాలయములు
బాగుగా వృద్ధిఆయిన స్దలములను, వన్నె కెక్కిన గ్రంథాల
యములను చూపి ఉపన్యాసము లిప్పించుట; వీనినన్నిటిని
వివరములతో నిర్ణయించుటకు ప్రచారక సంఘమును
ఎన్నుకొనుట.
ఈ ప్రచారము తొలుదొలుత గ్రంథాలయములున్న
గ్రామములలో నుతదుపరి యితర గ్రామములలోను చేయుట.
ఈ ప్రచారము గ్రంథాలయాభిమానముగల గ్రంథా
లయ యాత్రికుల వలనను, ఈ సంఘమువారి చేగాని
యితర సంస్థలవలన నియమింపబడిన యీ సంఘము క్రింద
పని చేయు 'ప్రచారకులవలనను జరుపవలయును.
ఇందుకు గానురివిన్యూడివిజను ఒకటికి
m
గాని, రెండు తాలూకాలకు ఒక్కరు చొ॥
గాని జిల్లా మొ త్తముమీద ముగ్గురు ప్రచారకులకు
నెల 1కి రు25 + 10 భత్యము = 35 చొ. రు 1260.00
మూడు గ్రామఫోనులు ప్లేట్లతో సహా మూడు 150-0-0
మాజికులాంతర్లు స్లైడ్సుతో
300-0 0
రు 1710-0-0
నిర్మాణము:—ప్రతి గ్రామములోను గ్రంథాలయము
లున్న చోట్ల వానిని పునరుద్ధరించుట. లేనిచోట్ల సాపిం
చుట. వీనియాన్నిటియందు ఒకే మాదిరి నిబంధన లేరాఎటు
చేయుట. ఒక తాలూకాయందు అన్ని గ్రామములలోను
గ్రంథాలయములను ఆ తాలూకా గ్రంథాలయ సంఘ
ఆ
మలో చేర్చునట్లు ఏర్పాటు చేయుట. తాలూకాసంఘము
లేనిచోట్ల నిట్టి సంఘమును స్థాపించుట.
Q
అన్ని తాలూకా గ్రంథాలయములను జిల్లా గ్రంథా
అయసంఘములో చేరునట్లు చేయుట.
జిల్లా గ్రంథాలయ సంఘము వారిచే నిర్ణయించబడు
ప్రకారము తాలూకా గ్రంథాలయములును, తాలూకా
సంఘము నిర్ణయించబడిన ప్రకారము గ్రామ గ్రంథాలయ
ములును, గ్రంథాలయోద్యమమును నడుపునట్లు చేయుట.
జిల్లా గ్రంథాలయము ముఖ్యస్థానమందు కేంద్ర గ్రంథా
లయముగా ఏర్పాటు చేయుట. అలాగుననే తాలూకాముఖ్య
సానమందు కేంద్ర తాలూకా గ్రంథాలయమును ఏర్పాటు
చేయుట.
m
జిల్లా గ్రంథాలయము విలువగల గ్రంథములను తెప్పించి
తాలూకాగ్రంథాలయములకును తద్వారా గ్రామ గ్రం
థాలయములకును సంచారగ్రంథాలయ పేటిక ల ద్వారా
సరఫరా చేయు ఏర్పాటు చేయుట.
తాలూకా గ్రంథాలయములు, గ్రామ గ్రంథాలయ
ములందున్న గ్రంథముల సంయుక్త గ్రంథపట్టికలను తయారు
చేసి అన్ని గ్రామగ్రంథాలయములకు అందిచ్చు ఏర్పాటు
చేయుట.
గ్రామ గ్రంథాలయములవారు కోరు గ్రంథములను
తాలూకాగ్రంథాలయమువారు సరఫరా చేయుట.
గ్రామ గ్రంథాలయములందు తఱచు పెద్దలు రావించి
యుపన్యాసములిప్పించుట. మ్యాజికులాంతరు చూపించుట.
రాత్రి పాఠశాలలు పెట్టించుట.
పత్రికలయందలి ముఖ్యవ్యాసములను గ్రంధములందు
ముఖ్య విషయములను
వినిపించుట.
చదువురానివారికొరకు
చదివి
గ్రానగ్రంథాలయముల కొరకు వలయు గ్రంధము
లను క్రోడీకరించి, వారికి వారిఖర్చులపై చెప్పించి
యిచ్చుట.