Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.3(1936).pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

84

మోటుపల్లి రేవు (శ్రీ చిలుకూరి వీరభద్రరావుగారు) ఈ ప్రాచీన కాలమునుండియు గుంటూరుమండ లములోని బాపట్ల తాలూకాలో బాపట్లకు సమీ పమున సముద్రతీరమునందున్న మోటుపల్లి గ్రామము ప్రసిద్ధమయిన రేవుపట్టణముగా నుండి చీనా, బర్మా, పారసీకము మొదలగు విదేశ ములతో వాణిజ్యము నెరపుటకు నాంధ్ర దేశ ములో నొక ప్రథానస్థాన మయ్యెను. ఈ మోటుపల్లికే వేలానగరమని నామాంతరము గలదు. ఈ వేలానగరము ఆంధ్రశాతవాహనుల కాలమునను, ఆంధ్రపల్లవుల కాలమునను, ఆంధ్ర చాళుక్యుల కాలమునను, ఆంధ్ర చోడుల కాలము నను స్ప్రసిద్ధికెక్కిన పట్టణముగ నున్నను, క్రమ ముగా చాళుక్యుల పరిపాలనానంతరము వాణి జ్యము క్షీణింప నంతగా గణనకు రాకయుండెను. మోటుపల్లికడ మెట్టపట్టిన ఓడలలోని సరకులను ఆసవిూపమందలి మండ లేశ్వరులు కొల్లగొట్టు చుండుటచేత, నావికు లా రేవునకు జేరుట కే భయపడుచుండిరి. అందువలన ప్రసిద్ధిగాంచిన వర్తకు లెవ్వరును ఆ పట్టణమున నివాస మేర రచుకొనకపోయిరి. కాకతిగణపతిదేవ చక్రవర్తికి పూర్వము కొంత కాలమునుండి విదేశ వ్యాపారము నడపునట్టి వర్తకులకు నభయశాసన మీయగల చక్రవర్తిగాని మహారాజుగాని లేనందువలన నే ప్రసిద్ధమయిన రేవుపట్టణమున కాగతిపట్టెను. గణపతిచక్రవర్తి తాను సింహాసనారూఢుడై నెల నాటిని జయించిన పిమ్మట నీ వేలానగరము నుద్ధరించి విదేశ వ్యాపారమును పెంపొందింప వలయు నన్న సంకల్పము మనస్సున నంకురించిన వెంటనే యు పేక్షింపక మంత్రులతో నాలోచించి అం దులకుదగిన ప్రయత్న ములను గావించెను. అప్పు డాగణపతి చక్రవర్తి వర్తకులకు సభయశాసన మొసగెను. నాజీవితముకన్నను నాప్రజల సంర క్షణమే నాకెక్కువ ప్రీతికరమయిన విషయ’మని 4 ఆ అభయశాసనమున వాయించెను. మరియు నాశాసనమువలన సత్ప్రభుత్వము యొక్క ధర్మ ములను కాపాడుటకును, కీర్తికొరకై యధికా భినివేశముతో సముద్రయానముచేసి విదేశము లతో వ్యాపారము జేయునట్టి వర్తకులయందలి ప్రేమచేత నొక్క కూపశుల్కము మాత్రము గాక తక్కిన సుంకముల నన్నిటిని వదలి వేసితిమని లిఖింపబడియెను. ఉత్తరమునుండి దక్షిణమునకు గాని, దక్షిణమునుండి యుత్తరమునకుగాని పోవు మోడలు వాయువశమున నీ రేవున మెరక పట్టి పోయిన యెడల నాసరకుల నోడదొంగలు ge గొనకుండ గట్టడిజేయుటయెగాక, వర్తకులు నిర్భయముగా రాకపోకలు జరుపుటకు తగిన మార్గముల నేర్పర చెను. ఎగుమతి దిగుమతులపై శుల్క పరిమాణము ముప్పదింట నొకటిగ నిర్ణ యించెను. శ్రీగంధము ౧ కి గ ౧, పచ్చకర్పూ రమునకు, చీని కర్పూరమునకు, ముత్యాలకు వెల గ ౧ కి అ 4 పన్నీరు, దంతము, · జవ్వాది, కర్పూర తైలము, రాగి, తగరము, సీసము, పట్టునూలు, పవడము, గంధద్రవ్యము లకు వెలగం కి అ౧, మిర్యాలు వెల గంకి అ 11-, పట్టుస్వరూపము ౧ కి గ౧కి అ 4 ఈ రీతిగ సుంకము విధింపబడియెను. ఈసర కుల నామమునుబట్టియే యాకాలమునందా రేవు పట్టణము ఎంతప్రసిద్ధమయినదిగ నుండెనో, ఏ యే దేశములతోడ వ్యాపారముల జేయుచుం డెనో వేరుగ జెప్పనక్కరలేకయే బోధపడకమా నదు. కాకతి గణపతి దేవ చక్రవర్తి యొక్క కృపావిశేషము చేతనే ఆ రేవుపట్టణము పునరు దారణము గావింపబడుటయు, అతని కుమార్తె మైన రుద్రమ దేవి కాలమున వెనీసువర్తకుడైన మార్కొపోలో' అను వానిచేత శ్లాఘింపబడు టయు తటస్థించినది. 1