106 ంథాలయ సర్వస్వ ము . చెప్పుకొనగా అన్నిటికంటే ముఖ్యముగా పల్లం మెరకలో చేర్చిన విషయములో ఆలోచించి వక సంవత్సరము పల్లం క్రింద సాగయిన భూములను పల్లం క్రింద నే వుంచుటకు ఆర్డరిప్పిస్తామని చెప్పినారు. ఇతర విషయము లన్నియు ఆలోచించి సాధ్యమైనంతవరకు రయితుల కోరిక ప్రకారం చేయించెదనుని చెప్పినారు. చీఫ్ యింజనీరు గారు రేపు సాయంత్రం 6 గంటలకు రయితులు విజ్ఞాపనలు వింటా మన్నారు. 19-11-1919 ఈరోజున లెజిస్లేటివ్ కౌన్సిలు మీటింగు చూచుటకు గవర్నరుగారి ఆర్డరును పొంది 10 గంటలకు వెళ్ళి చూడడమైనది. ఈ రోజు సాయింత్రం 5 గంట 57 లకు చీఫ్ ఇంజనీరు గారిని చూచి రయితుల కష్టము లన్నియు చెప్పుకొనడమయినది. a వ్యయప్రయాసలకోర్చక రైతులకొరకై యెంత త్యాగ మునకైన వెనుకంజ వేయని రైతుసేవాధురంధరు లీపంతులు గారు. వీరి చిన్న వయసుననే జమీందారీ గ్రామమైన ఎడ మరు రాణీదారు కర్ణములు, రైతులకు పెట్టిన బాధలు సహింపలేక బుద్ది క లిగి వర్తించుటకుగాను ప్రతిహింసాపరు లైన రైతులు వారిని దేవా దేవేషు చేయగా రైతుల తఱపున బోలెడు సొమ్మును వ్యయమొనర్ని కేసునందు నెగ్గి బ్రహ్మ రధమును పట్టించుకొని ఇరువదెకరములు ఏక ఖండభూమిని కొల్లేరునందు బహుమానమును పొందిరి, నేటి కాంగ్రె సధ్యక్షుడు జవాహరిలాలు రైతులతో సంబంధముకల్పించు కొని రైతు జీవిత సమస్యల నెదుర్కొని భావిజీవనము నతిసౌందర్యవంతము గాను, విజ్ఞాన పూరితముగను చేయుటయే కాంగ్రెసు ప్రచార ప్రణాలికయని నియమించియున్నారు భారతజాతీయో ధారణకు, ఔన్నత్యమునకు రైతుయొక్క మూఢత్వమును, నిరక్షరత్వమును ముఖ్య కారణములని ఆనాడే గ్రహించి 'కీలెరిగి వాత పెట్ట' ప్రయత్నించిన రాజ కీయ వైద్యులు వీరంలో సందేహం లేదు. 9-11-20 నిడమర్రు (వీ రీవిధముగ స్వగ్రామము స విశ్రాంతిగా యుండుట చాల అరుదు) ఈరోజు బందరు జాతీయ కళాశాలకు పంపించుటకు చందాలు వసూలు చేయడమైనది. సాయింత్రమునకు వసూలు రు 10-0-3లు. 13-11-20 గ్రంథాలయ సర్వస్వముయొక్క వి. పి. చెల్లించుటకు రు 3-0-0 పంపడమైనది వీరు ఆంధ్ర దైనిక పత్రిక, కృష్ణా వారపత్రిక, గ్రంథాలయ సర్వస్వము మొదలైన పత్రికలనూ, విజ్ఞాన ప్రచారిణీ, ఆంధ్ర ప్రచా రిణీ మున్నగుమండలులను తెప్పించి పోషించెడివారు, ణ 3 26 14-12-20 ఈరోజున ఉండిలో డాక్టరుగారితో మా ట్లాడి బిరువాలు 2 న్నూ రౌండు టేబిలున్ను కలిపి 50-0-0కు తీస్కున్నాను. సాయంత్రం ఉండి స్కూలులో జరిగిన అష్టావధాన సమయమునం దుపన్యాస మివ్వడమైనది. నడుం పల్లి సుబ్బారాయుడుగారితో మాట్లాడి గ్రంథాలయ సాపన రేపటిదినం జరిపించుటకువప్పించి ఉభయులమున్ను కలిసి తాడికొండ వెంకటనరసయ్య గారు కలిసి దేవాల యములోవున్న సావడిగది హాలు చూచి రావడమైనది. P సహాయనిరాకరణోద్యమము. 1921 లో దేశాన్నంతనీ వూపించిన సహాయనిరాకర ణోత్సాహము వీరి శేవిధమున కదలించినది చూతము గాక. వీరు కార్యశూరులుగ నే యెక్కువగా ప్రకాశించినదియు వ్యర్ధాడంబర రహితులనియు జ్ఞాపకముంచుకొందురు గాక . 31-3-21 ఈ రోజు వుదయం బండిమీద 11 గంటలకు బెజవాడ రావడమైనది. షౌకతాలీ మహమ్మదాలీల సంద ర్శనం చేయడమైనది. చి కుందూరి ఈశ్వరదత్తుకు (ట్వంటీ యత్ సెంచరీలను యింగ్లీషు మాసపత్రిక సంపాదకుడు, స్పార్క్ అండు ఫ్యూమ్సు మొదలైన విఖ్యాతగ ంధ కరయునగు దగ్గుగారు వీరి అప్పగారి కొడుకే.) కనపడి మరల స్నేహబృందముతో కలిసికొంటిని. గారు 1-4-1921 శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఆ రేంజి మెంట్లు బాగుగ చేయుట చే మహాత్మా గాంధి, లజ పతిరాయ్, అలీసోదరులు, మోతీలాల్, శ్రీమతి సరళా దేవి చౌదరాణి, మాతాజీ వగైరాల సందర్శనం బాగా జరిగినది. తిలకు స్వరాజ్యనిధికి విరాళ మిచ్చితిని. 11-5-1921 చీరాల పేరాల ప్రజల సహాయార్ధం 25-00 లు పంపితిని. పెద 12, 13, 14-1-22 ఈ రోజు ఉదయముకు నేను, పెద నిండ్రకొలను వారు, కూనపరాజు సోమరాజుగారు, వగై రాలు 10 మంది మందలపర్రు వెళ్ళి ఆసహాయోద్యమత త్వమునుగూర్చి ఉపన్యసించి కాంగ్రెసు, పంచాయతీ సంఘముల స్థాపన చేయించి మధ్యాహ్నము తిరిగి నిండ్రకొలనులో జరుగు సభకు వెళ్లగా దండు నారాయణ రాజు, గోవిందాచార్యులు, చింతలపాటి బాపిరాజు గార్లు సభకువిచ్చేసినారు. 8 గ్రామముల మునసబుక రణములు, నవుకర్లు గవర్న మెంటు నవుకరీలు వదులుకొని రిజై నులు దాఖల్ చేసినారు. సదరు త్యాగం చేసినవారికి గొప్పవుత్సవం చేసినారు. నిండ్రకొలనునందు, గ్రామపంచాయతీ కాం గ్రెసు సంఘస్థాపనలు చేయించ కోరినందున పెద్దనిండ 3 .
పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.3(1936).pdf/28
స్వరూపం