Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.3(1936).pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

15 గ్రామసీమల గ్రంథాలయములు - దేశీయుల తోడ్పాటు. సిస్తులు వగై రా ప్రభుత్వాదాయములో నుండి యేగదా వెచ్చింపబడుచున్నది. అట్టి పరిస్థితు లలో, ఎంతమంది విద్యాధికులు తమ స్వగ్రామా భివృద్ధికిగాను తమ చేయూత నిచ్చుచున్నారు? తమ ఆదాయములో, తమ కాలములో, బహు స్వల్పభాగమునైనను వాని యుద్ధరణలో వెచ్చిం చుచున్నారా? వీరిలో అధిక సంఖ్యాకులు తమ గ్రామములవల్ల తళుకు లభించెడి లాభముల విరివిగా పొందుటయే తప్ప, తమ గ్రామము, గ్రామస్ధులయెడు” తమ ధర్మమును పూర్తిగా విడనాడి న వారై యు న్నా రు . మఱికొందఱు తమ విద్యాబుద్ధి & లముచే తమ గ్రామములో చీలికలు కలుగజేసి, సహజముగా శాంతికాములైన తోడి గ్రావియులలో కక్షలు పెంచి, వారిని రచ్చకీడ్చి, నాశనము చేసి, దానివలన లాభమును పొంద జూచెదరు. ఇట్టి వారిచర్యలు అమానుషములు, అనిర్వచ నీయములు. గ్రామసర్వతోముఖాభివృద్ధికి దోహద మొసగెడి గ్రంథాలయములాదిగాగల అనేక గ్రామసంస్థలను, వారి ధనము, పలుకు బడి, ప్రబోధనాశక్తి, సామర్థ్యములచే నెల కొల్పి, వానిద్వారా తమ గ్రామములలో నుస్నె అజ్ఞానము, నిరు త్సాహము, నిర్వ్యాపారము అసౌఖ్యములను పారద్రోలుటకు ప్రధాన బా ధ్యత వహింపవలసినను ఈ పెద్ద మనుష్యులు నృధాగా చేతులు ముడుచుకొని కూర్చుండుట చాల శోచనీయము. పైన వివ రింపబడిన లోపములకు గురికాని కొలదిమంది పుణ్యాత్ములైన విద్యాధికులకు నాజోహారులు, కృతజ్ఞ తాభివందనములు. గ్రంథాలయములు స్థాపించి, వానిలో పుస్తకములు, వార్తాపత్రికలు దూరశ్రవణయంత్రములు వగైరాలనుంచి, రాత్రి పాఠ శాలలు, ఉపన్యాసములు వగై రాలుఏర్పాటు చేసి వాని ద్వారా గ్రామస్థుల సకలావసరములు 95 తీరేటట్లు చూచి ఆవిధముగా గ్రామవాసులలో సంతుష్టి, సౌఖ్యము, జ్ఞానము వ్యాపింప జేసి, వారి మన్ననలకు గురిగాగలందులకు ఈవిద్యాధికులను నేను హృదయపూర్వకముగా కోరుచున్నాను. 6 నా సోదర సోదరీమణులలో మఱియొక తెగ వారికికూడ నావిజ పిగలదు. వారు గడచిన 21 పదునైదు వత్సరములలో దేశములో వ్యాపించి యున్న బలవ శర మైన రాజకీయ వాతావరణములో పైకి తేలిన వారు. వారితో నేను రాజకీయములలో ఏకీభవించ జాలకున్నను, తామునమ్మిన సిద్ధా తములకు వారిలో చాలమంది జూపిన త్యాగము, కష్ట సహిష్ణుత వగైరాలను నేను ప్రశంసించ కుండజాలను. అయితే వారిలో చాలమంది తమ శక్తి, సామర్థ్యములు, తమ ధన, బల పూర్వక త్యాగములు ఒక ప్రత్యేక రాజకీయాందోళ నలో మాత్రమేగాక, తమతమ స్వగ్రామముల అభివృద్ధికి అవసరమైన అనేక సంస్థలను నెల కొల్పుట, పోషించుట వగైరా పనులలో విని యోగించిన, ఆపనులు తాము కాంక్షించిన జాతీయతకు ఇంకను ఎక్కువగా తోడ్పడి యుం డెడివని నానమ్మకము. అట్టి చాల ప్రయోజన కరమైన సంస్థలలో గ్రంధాలయము ' మొదటి స్థాన మాక మించుకొనునని నేను వేరుగా జెప్ప నవసరము లేదు. గ్రామములలో ఇంటింటికి వార్తా పత్రికలు, గ్రంధములు చేరేటట్లును, అవి విరివిగా వినియోగింప బడేటట్లును చూచెడి దానికన్న, మించిన సేవ జాతీయతకు వేఱండు కలదా! రాజకీయాందోళన ఉద్యమములో పని చేసిన వారిలో చాలమంది ఈ మాదిరి నిర్మాణ కార్యక్రమమునకు విముఖులు గా నుండి, తేలి కగా చౌక పేరు పడయగలిగెడి ఉపన్యాసములు, వార్తాపత్రికలలో వ్యాసముల కే దాస్యులుగా నుండుట కిష్టపడుచున్నారని వ్రాయుటకు చాల చింతిల్లు చున్నాను. O