94 గ్రంథాలయ సర్వ స్వ దేశములో, సహజముగా దాన ధర్మనిరతి వ్యా పించి యున్న మన పుణ్యభూమిలో, దేశప్రజల కభీష్టకరము లై న ఈధర్మచింతనలను ప్రజానాయ కులు సక్రమమార్గములకు తిప్పగలిగెడిచో, గ్రంథాల యోద్య మాభివృద్ధి కేగాక, అట్టివినూ రు దేశ శ్రేయస్కరమైన పనులకు వారు బహు తేలి కగా దోహదము చేయగలుగుదురు. దేశీయు లలో ఒక్కొక్కరు తమ ఆదాయములో కనీ సము పదియవవంతైనను తమ కుటుంబముసకు గాను చేయబడెడిఖర్చులకుగాక, తమగా మలేక దేశ క్షేమకరమైన వ్యయములకు వినియోగ పఱిచెడిచో, గ్రంధాలయముల బోలెడి సంస్థలు ధనాభావముచే కృశించిపోవుటగాని, వ్యాప్తి చెందక పోవుటగాని జరుగదు. ఒక్కొక్క గృహ ములో కనీసము ఒక శేరుబియ్యము బట్టెడి బుట్ట యొకటి యుంచబడి, నా సోదరీమణులు తాము నిత్యము రెండుపూటలును తమ ఇండ్లలో వంట జేయునఫ్ట్లు రెండుపిడి కెళ్లు బియ్యము దానిలో వేయు చుండెడిచో, వారి కెన్నదగిన కష్టములేకుండగనే బహు తేలిక గా వారమురోజులలో ఆబుట్టనిండును. నూరిండ్లుగల ఒక సామాన్య గ్రామములో వార మునకునూరు శేర్ల బియ్యము ఆగ్రామ గ్రంథాలు యసహాయార్థము ఈవిధముగ లభించగలిగెడిచో ఇక నాగ్రంథాలయమున కితరసహాయ మంతగా యవసర మే యుండకపోవచ్చును. తామురోఖము వెచ్చించికొన నవసరము లేకుండగనే తమ పొల ములలో పండెడి ధాన్యము నీవిధముగా కొంత సద్వినియోగము జేయుట నాసోదర గ్రామస్థుల కంతగా కష్టముగా నుండకూడదు. కాని నిష్క ల్మష హృదయములతో, పేరుప్రతిష్ఠల నంతగా సరకుగొనక, నిష్కా మసేవ జేయగలిగెడి ఉత్సా హపురుషులు, అకుంఠిత కార్యదీక్షాపరులు ప్రతి గ్రామములో కొంతమందియుండినగాని ఈచిన్ని కార్యములై నను ఫలోన్ముఖము గానేరవు. అట్టి గా ర్వ స్వము . 14 స్త్రీపురుషులు వయస్సులో యువకులైనను, వృద్ధు లైనను, ఉత్సాహములోమాత'ము యువకు లుగా నున్నవారు, మనగ్రామప్ర్రాంతములలో తండోపండములుగా నుండవలెను. మన దేశీయులలో అపారమైన సికులతో 'తుల తూ గెడి రాజులు, జమీందారులు, వర్తక ప్రముఖు లాదిగాగల ధనసంపన్నులకు, అమెరికా కోటీ శ్వరు డైనట్టియు, అమెరికా దేశమం దంతటను తన పేరు చిరస్మరణీయముగానుండేటట్లు గ్రంథా లయములు స్థాపించుటకు దాదాపు రెండు వందల కోట్లరూపాయల విలువగల తన కష్టార్జిత యావ దా స్తిని వినియోగించినట్టి శ్రీ కార్నే జిమహా శయుని ఉదాహరణను అనుకరించుటకు సవిన యముగా ఎత్తిచూపుచున్నాను. ఆ ధర్మనిరతి, స్వార్థ త్యాగము, విశాలహృదయములు లేనినాడు వీరి భోగ భాగ్యములు వీరికిగాని వీరి దేశమునకు గాని ఆవం తేనియు ప్రయోజనకరమైయుండవు. పైగా తోడిదేశీయులలో వీరియందు. ఈర్ష్య వగై రాదిగుణములకు ఆలవాలముగా నుండును విద్యాధికులైన సోదర దేశీయులు కొక మనవి. వీరిలో చాలమంది కుగ్రామములనుండి పైకి వచ్చినవారే. మన దేశములో నున్న ఉన్నత పాఠ శాలలు, కళాశాలలు వగైరా విద్యాసంస్థలలో పఠించి, పట్టములను పొంది, పలుకుబడి, ధనా ర్జన గల పదవులలో చాలమంది ఇట్టి వారే గలరు. ఒకసారి వెనుకకు తమ విద్యార్థిదశ వైపుకు తిరిగి చూచు కొనవలసినదని వినయపురస్సరముగా కోరుచున్నాను. తాము వారిని తమ పాఠశాలలలో గాని, కళాశాలలలోగాని చెల్లించెడి జీతమునకు దాదాపు పది రెట్లుధనము ఆపాఠశాల కళాశాల వల్ల ఒక్కొక్క విద్యార్ధి చదువు విషయములో ఖర్చుపెట్ట బడుచున్నది. ఈ అధిక ద్రవ్య మంతయు ఎక్కువగా బీదలైన గ్రామరైతుల వద్దనుండి వసూలు చేయబడిన 1 1
పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.3(1936).pdf/16
స్వరూపం