42 సంపాదకీయములు కొత్తరాజ ప్రతినిధి నూతనముగా రాజప్రతినిధి పీఠమును అలంక రించిన లిత్ గో ప్రభువు మామూలు ఆచా రములను మార్చి ప్రజాకర్షకమగు కొత్త తుల నవలంబించినాడు, ఆయన కొంతమందికే తన ఉపన్యాస గాక సర్వజనులకు వినబడునట్లు మును రేడియో ద్వార వినిపించినాడు. అంతేకాక ఆయుపన్యాసమును హిందూస్థానీ భాషలోనికి తర్జుమా చేయించి అందఱకుప్రకటించినాడు. ప్రతి జిల్లా అధికారిని గ్రామములతో నెక్కువ సంబం ధము ఉంచుకొన వలసినదని హెచ్చరించినాడు. నైతిక విషయములయందు ఎక్కువ శ్రద్ధ చూపిం చెదననిమాట ఇచ్చినాడు. పెద్దలతో నేగాక ఆయన పిల్లలతోగూడ సంభాషించినాడు. తాను ప్రజలయందు నమ్మక ముంచుచు వారిని తనయందుగూడ నమ్మక ముంచవలెనని కోరినాడు. నూతన సంస్కరణ ప్రణాలిక ప్రకారము ప్రజలు, రాజధానికి సంబంధించిన మంత్రుల వలనను, గవర్నరువలనను పాలింపబడుదురు. రాజ పా ప్ర్రాతినిధ్యముచే కలిగిన బలముతో లిన్లితో ప్రభువు సాధారణ సమయములలో శాంతిస్థాపకుడుగను, అవసర సమయములలో నియంతగను, చరించుటకు ఇప్పటివిధానములో వీలుండును ఈ విషయమే ఎల్లరకును, ముఖ్యముగా ప్రతిపక్షమునకు, రాజప్రతినిధి తెల్పుట కాల సింప లేదు. లినితో ప్రభువు తా నుపక్రమించిన విధా నమును సరిగ కాపాడుకొని, ముందటి రాజప్రతి నిధివలెగాక, జనోద్ధరణ కావశ్యమగు నిర్మాణ కార్యక్రమ నిర్వహణ దీక్షాబద్ధుడై మెలంగిన యెడల ప్రతిపక్షాభిప్రాయము గూడ సంత సింప గలదు. వీ రుపన్యసించిన గ్రామసీమల ప్రేమ ఫలించుటకు సర్వజనవిద్యదక్క సాధనాంతరము లేదని వీ రంగీకరింతు రని మా నమ్మకము. ఆ సాధనకు గ్రంథాలయములే కేంద్ర స్థానములు కాబట్టి శ్రీలినితో ప్రభువుగారు తమ యధి కార కాలపరిమితిలో ప్రధమోద్యోగముగ గ్రంథాలయోద్యమ వ్యాప్తిచేసి చిరకీర్తి వహింపవలసినదని కోరుచున్నాము. గ్రామపున ర్నిర్మాణమునకు వినియోగించు ద్రవ్యములో నొక భాగ మీ యుద్యమమునకు నియోగింప జేయుటకు వీరు తోడ్పడుదురని విశ్వసించు చున్నాము. జవహర్లాలు పండితుడు భారత దేశీయ మహాజన సభాధ్యక్షుని హో దాలో జవహర్లాలు పండితుడు అదర్శకమగు ఉప న్యాసమునిచ్చినారు. ఆయాదర్శము ననుసరించి ఒకానొక సాధ్యకార్యక మమును(ఆయన యుద్దే నిర్ణయించినాడు. శము ప్రకారము) గూడ ప్ర్రజాసామాన్యముతో సంబంధము నెక్కువగ కలుగ జేసికొనుటయే ముఖ్యాతిముఖ్యమగు కార్యక్రమమని ఆయన అభిప్రాయము. దీని విషయమై ఆయన మాటలు గమనింప దగినవి. “వ్యక్తి పరముగ మనలో చాలమందికి ప్రజా సామాన్యముపై పలుకుబడియున్నది. మనమాట లను వారు శిరసావహించెదరు. నిజమునకు Xes గౌరవ మననాయకుడగు గాంధీ మహాత్మునిపై ప్రజా సామాన్యమునకు ప్రేమ లను కొలచుట కెవరికి సాధ్యమగును! కాని సాంఘికముగ చూచినచో, ఆ సన్నిహితసంబం ధము మృగ్యమయినది. ఖాదీ, గా గ్రామపరిశ్రమ, హరిజన ఉద్యములవంటి సాంఘిక సంస్థలచే,
పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.2 (1936).pdf/44
స్వరూపం