పుట:Grandhaalayasarvasvamu, sanputi 9, sanchika 4 january 1935.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

డియే మన దేశములో గ్రంథాలయోద్యమము ప్రారంభమైన దనియు, అస్వతంత్రమగు దేశమునందు ఇట్టియుద్యమములు కొనసాగుట కనేకములైన అంతరాయము లుండు సనియు, ఇట్టియుద్యమములు స్వప్రయత్నముపై గాని, లేక పరావలంబనమువలన గాని ఈ రెండు మార్గములలో నే ద్యే యొక దానివలసి జరుగవలెననియు, మన పాలకుల యొక్క సాయమును మని మాశింతు మేని వారు సర్ల యించువిధిని షేధముల కన్నిటికీని లో బడి వర్తింపవలెననియు వివిధ రాష్ట్రములందును ప్రభుత్వమువారు వేర్వేరు శాసనములను కావించియున్నా రనియు, ప్రభుత్వసాహాయ్యమును బొందుచు, అట్టి శాసనముల సతిక్రమించినచో ఆసంస్థ అక్రమసంస్థ యగు ననియు, ఆంధ్ర దేశములో ప్రభుత్వమువారి ఆదరణ లేకయే, పజలు, యువకులును ఈ యుద్యమము నింతవరకు పోషించుచు, తమ వ్యక్తిత్వమును నిలుపుకొనుచున్నా రనియు, గ్రంథాలయస్థాపనయనగా గొప్ప కట్టడములు, అద్దముల బీరువాలు, వేల కొలది పుస్తకములను సేకరించుటయేయని తలంపరా దనియు, ఉన్న గ్రంథములు కొలదియైనను అయ్యది ప్రజలవిద్యావ్యాప్తికి, విజ్ఞానోదయమునకు తోడ్పడునట్లుగా చూడవలె సనియు, దేహమే దేవాలయము, జీవుడే దేవుడు, అజ్ఞాని మే చీకటియని పెద్దలు చెప్పి రనియు, కావున అజ్ఞానాంధ కారమును పోద్రోలవలె సనియు, లక్ష్యము సమున్న శ్రీ మైయుండు టనసరి మనియు, ఆంధ్ర దేశములో గ్రంథాలయోద్యమమున కవకాశమున, అభ్యుదయమును కల దనియు, ఐనను ఈ యుద్యమమును ఏకముఖముగా క్రమమైన పద్ధతులపై ఇడుపవలసిన భారము ఉద్యమ నిర్వాహకులపై కల దనియు రాజకీయములతో నీ యుద్యమమున కేసంబంధమును లేడనియు పల్కిరి. వివిధ ప్రాంత ములనుండి సభ కణుదెంచిన ప్రతినిధులకు మసఃపూర్వక స్వాగతమును సమర్పిచింది.

దాసు త్రివిక్రమరావుగారి అధ్యక్షకోపన్యాసము.

పిమ్మట శ్రీదాసు శ్రీవికమ రావుగారు అధ్యక్ష వహింపవలెనని సి. వి. రంగం శెట్టిగారు, దశిక సుబ్బయ్యగారు గుబిలు సుంద రేశసుగారు ఉపపాదిం చినపిమ్మట త్రివిక్రమరావుగారు ఈ క్రింది ఉపన్యాస మిచ్చిరి:---

గ్రంథాలయోద్యమమునకు సేవచేయుట యం దాసక్తుడనై యున్న సన్ను మీ రీ సభకు అధ్యక్షునిగా నియమించినందులకు నేను మిక్కిలి సంతసించుచున్నాను. ఈ ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘ మేర్పడినపిమ్మట నీ 20 యేండ్లలోను ఆంధ్ర దేశ వాఙ్మయ విజ్ఞాని వాఙ్మయవిజ్ఞాన రితి లో చాల ముఖ్య విషయములు జరిగినవి. గ్రంథాలయముల ద్వారా సమస్త ప్రజలలోను విజ్ఞానాభివృద్ధిని కలిగించుటకు యత్నింప బడెను. ఇది ఎంతవరకు సఫలమైనదో చరిత్రకారులే వివరింప నర్హులు.

తెలుగుభాషను మాట్లాడునట్టి రెండుకోట్ల మంది ప్రజలలోను 1920 నుండి 100 కి 100 వంతున చదువుకొనిన వారిసంఖ్య అధికమగుటయేగాక దేశాభివృద్ధికి సహాయకములగు నన్ని ఉద్యమములతోను ప్రజలకు సంబంధము