పుట:Grandhaalayasarvasvamu, sanputi 9, sanchika 4 january 1935.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

17 వ ఆంధ్రదేశ. గ్రంథాలయమహాసభ.

స్థాపించెను. కాని స్కాట్లాండు దేశమున నీయుద్యమ మందిన వ్యాప్తి చాల ఆశ్చర్యకరము. అచట ప్రతిగ్రామమునందును, బట్టణమందు నుగూడ అనేక గ్రంథాలయములు గలవు.

“మన దేశమున అఖిలభారత గ్రంథాలయ సంఘమును స్థాపించుటలో మనవారు దూరదృష్టిని గన్పరచిరి. ఇందువలన నిక నీ దేశమం దన్ని ప్ర్రాంతములలోని గ్రంథాలయ ములును ఏకముఖను న పనిచేయగలవు. ఈయుద్యమవిజయమునకు, ప్రజల యుత్సాహము కార్యదీక్ష, ధనికులఔదార్యము, ప్రభుత్వమువారి చట్టసహాయము అన్నియుగూడ అవసరము. ఈయుద్యమమును వ్యాపింపచేయు కార్యము, ఉత్సాహపరులును, సమర్థులును అగు యువకులక ప్పగింపవలెను. గ్రంథాలయములను ప్రజాసామాన్య విద్యాసంస్థలు పరిగణించి వానిని నిర్వహించు. భారమును. స్థానిక సంస్థలును, పులపాలక సంఘములును రాష్ట్రీయ ప్రభుత్వములును వహింపవలెను. మదరాసు పబ్లికు లైబ్రరీల చట్టమువంటి శాసననిర్మాణమందుకు చాలతోడ్పడగలదు. ఆ చట్ట సహాయమున జిల్లా గ్రంథాలయసంఘ ములును, తాలూకా, గ్రంథాలయ సంఘములును ఏర్పరుపబడును. ఒక్కొక తాలూకా యందలి ప్రాంతమునందలి గ్రామము లన్నిటి యందును, స్థానిక గ్రంథాలయములుగాని సంచార గ్రంథాలయములు గాని ఏర్పరుచుటకును, ఉపన్యాసములను, 'ప్రదర్శన: ప్రదర్శనములను నేర్పరుచుటకును తాలూకా సంఘములును చాలవరకు కార్యభారము వహింపగలవు. చెన్న పట్నమువంటి పెద్దనగరములలో, ప్రతీ డివిజనునకును అథమ మొక్క గ్రంథాలయ మైన నుండవ లెను. ప్రజ లచటకు వచ్చి వార్తాపత్రికల ప్రకటించుటకును, స్వల్ప మొత్తమును ధరావతు చేసి, గ్రంథముల నెరువుతీసుకొని వెళ్ళి కొని వెళ్ళి చదువుకొనుటకును "ఏర్పాటులు జరుగవలెను. ఈయుద్యమమున ఔదార్య వంతు లెల్లరును 'చాలి 'తోడ్పడగలరు. అమెరికా దేశమున కార్ని జీవంటి యుదారులీయుద్యమమున' కొనర్చిన సాహాయము జగత్ప్రసి ద్ధము. మన దేశమునగూడ ధనికుల ఔదార్య మాయుద్యమమునకు చేయూత యగునుగాక ! విశ్వవిద్యాలయములుగూడ గ్రంథాలయ నిర్వహణమునందు శిక్షణము నేర్పరచి, చాల వరకు తోడ్పడగలవు. మన రాష్ట్రమున ఆంధ్ర దేశ గ్రంథాలయసంఘ వియుద్యమమున కమూల్య మగు సౌహాయ్య మొనర్చుచున్నది. ఆసంఘము దినదిన ప్రవర్ధమానమై ఆంధ్ర దేశమున విజానకాంతులు వెదజలుగాక.”

రెండవదినము.

. 25 వ తేదీ మధ్యాహ్నమున తిరిగి సభ సమావేశ మయ్యెను. ఆహ్వాన సంఘాధ్యక్షు లగు శ్రీ దేశోద్ధారక నాగేశ్వర్ రావువంతులు గారు ఈ క్రిందిరీతిని ఉపన్యాసమిచ్చిరి:-

ఆహ్వాన సంఘాధ్యక్షులగు దేశోద్ధారక్ష కాశీనాథుని నాగేశ్వరరావు మంతులుగారి ఉపన్యాససారము.

కడచిన దినమందు అఖిలభారత గ్రంథాలయ మహాసభ జరిగియుండెననియు, అందు ప్రసిద్ధు లైనవార లనేకులు పాల్గొనియుండి రనియు, నాడు ఆంధ్రా గ్రంథాలయ మహాసభకు పల్లెటూరి ప్రజ లనేకులు "ప్రతీనిధులుగా నరుదెంచి రనియు, 1885 సం॥ నుం