55
చు జట్టములఁజేసి యందు కనుగుణ్యముగ ధర్మపాఠశా లల సైతము నేర్పాటు చేయుచున్నారు. జనసామాన్య మునకుఁ జదువను వ్రాయను దెలియునంతవరకు మాత్ర మీ పాఠశాలయందు నిర్బంధముగ నేర్పవచ్చు నేగాని యంతకు పైన నిర్బంధ పఱచుట యిప్పటి కాలస్థితినిబట్టి కతవ్యముగాదు. అంతకుపైన జ్ఞానము సంపాదించుకో ను విషయములో స్వాతంత్య్రమునిచ్చి పైనఁ గోరువారి కవకాశము కల్పించి మాగణము చూపి సాహాయ్యము చే యవలయును. ద్రవ్యాద్యుపపత్తులుగల విద్యార్థుల కుత్త మపాఠశాలల నట్టి యవకాశము కలిగి యున్నది. అట్టి యుపపత్తులులేని బీదసాదలకు జ్ఞానాజ౯నకు గ్రంథాల యములే శరణ్యములు కావలయు. పాఠశాలలఁ జదువఁ దగినవారలు సైతము సర్వకాలమును బాఠశాలలయందు జదువుచుండుట సాధ్యము గాదు. పాఠశాలలను విడిచి న యనంతరము నూతనముగ నుత్పన్నములగు గ్రంధములఁ బదువవలయుననిన స్వయముగ వానిని సంపాదింపలేని వారికి నీ గ్రంథాలయములే శరణ్యములు.
గ్రంథసాన్నిధ్యము గ్రంధకత ల సాన్నిధ్యము సంతటిది. అట్టి యీసాన్నిధ్య మెంతటి మేలులఁ జేశూ ర్పఁగలదు. చదువని వారలంగూడఁ జదువఁ బురికొల్పగ లదు. నలువుఁటఁ జేరినతోడనే గ్రంథముల గురించిన ప్ర సావము రాకపోవదు. ఆమాటలు వినువారు గ్రంధముల స్వయముగఁజదివి యందలి సారస్యముల గ్రహింప్ నువ్వికు లూఱుచుందురు, తద్గ్రంథములఁ జదువ నిదియె పెద్ద ప్రోత్సాహము కాఁగలదు. కాఁబట్టి యీగ్రంధాలయ ముల నెంత విరివిగ నేర్పాటు చేసి జనుల కెంత సులభసా ధ్యములుగఁ జేసిన దేశమున కంత క్షేమము. నందేమూల నేమి జరుగుచున్నదియు నిముసములోన నె ఱుఁగ గలిగినట్టియు, మా సత్రియమున భూప్రదక్షిణము చేయనగునట్టియు, గడియలోన వేనవేల ప్రతుల ముద్రిం పఁ దగినట్టియు, నీకాలమున గ్రంధముల ప్రతుల సేకరిం చుట కష్టముగాదు. పాశ్చాత్య దేశస్థు లీవిషయమున నె క్కువ ప్రయత్నము చేసి యనేక గ్రంధాలయముల నే ర్పఱచి జనులకు మేలుజేయుచున్నారు. మన హిందూ దేశములో స్వదేశాభిమానమునకుఁ బేరు గాంచిన బరోడా మహారాజుగారు వారి రాష్ట్రమున ననేక పుస్తకభాం డాగారముల స్థాపించి ప్రజల కన్ని విధముల సుఖములు గలిగించుచున్నారు. ఇంతటితోఁ దృప్తినందక వారు కే వల కు గ్రామవాసులకుఁ గూడ : నీలాభము కలుగుటకుగా ను నూకూర దిరుగుచుండుటకునై చరద్గ్రంథ భాండా గారముల సయితము కల్పించి యితరులకు మార్గము చూ పుచున్నారు. మన మాతృభాష నభివృద్ధి జేయ సమకట్టి యున్నారముకదా. ఈ విషయమున మిగుల వనుభవము గలిగియుండు పాశ్చాత్య దేశీయుల గ్రంథభాండాగారము మాతృకలఁగా నిడికొని మన భాండాగారములు స్థిర ములుగాను జనోపయోగకరములు గాను నడుచునట్లు క ట్టుదిట్టములు జేయవలెను.
౧౭౫౩ వ సంవత్సరమున స్థాపింపఁబడిన బ్రిటిష్ మ్యూజియమను వస్తుప్రదర్శ కళాశాలా సంబంధమగు గ్రంథాలయము లోకములోని యన్నిటికన్న మిక్కిలి ప్రసిద్ధి కాంచినయది. ప్యారిస్ పట్టణమునందలి బిబ్లియోధి కె న్యాష నేల్ యను గ్రంథాలయము గ్రంధసంఖ్యయం దు బ్రిటీష్ మ్యూజియమును మించియుండినను పాఠక సౌ కర్యములగు నేర్పాటులందు బ్రిటిషు గ్రంథాలయమున కు సాటిరాదని చెప్పఁదగి యున్నది. ఈ బ్రిటిష్ గ్రంధా లయమందు ౧౫౫౦౦౦ ముద్రిత గ్రంధములును ౫౦౦౦౦ యముద్రిత గ్రంధములు నున్నవి. ఇందొక విశేషము. కేవల మాంగ్లేయ భాషా గ్రంధములేకాక యన్యభాషాగ్రంధము లుకూడఁ బెక్కులుగలవు. ఐరోపాఖండము దేశ భాష లలో నాయా దేశమున గల శ్రేష్ఠ గ్రంధ సముదాయముల నెల్ల నిందుఁ జేర్చియున్నారు.
ఈగ్రంథములన్నిటిని వలయాకృతిఁగల పఠనాల యమునఁ జుట్టును మంచల పై నమర్చియున్నారు. పఠనా లయములోని ౮౦౦౦౦ గ్రంథములలో పాఠకుల యవిచ్ఛి న్నో పయోగమునకై క్రిందియంతస్తున 90000 గ్రంథము లున్నవి. గ్రంథముల వాడునతఁడు చదువరులకు సహా యము చేయుచుండును. ఈగ్రంథాలయమునఁ జదువు టకు గ్రంథాలయాధిపతి యనుమతి యుండవలయు. ఈయనుమతి ౨౧ సంవత్సరమునకుఁ బై పడినవారికి మా మొసగబడును. వారికిని మఱియొకగృహస్థుని ప్రార్ధన మీఁదనె యొఁసగఁ బడును.