54
ఇట్లు జ్ఞానము లిఖిత గ్రంధస్థమైన యనంతరము నిట్టి గ్రంధము లరుదుగ దొఱకుట చేతఁ బ్రభువులు ప్రసిధ్ధ దేవాలయముల యందును దమనగరుల సరస్వతీ నిల యములందును నట్టి గ్రంధములు సంపాదించియుంచి జనులకు జ్ఞాన ధారమును గల్పించుచుండిరి. ఇదియె మన దేశ మునఁ బుస్తక భాండాగారముల కారంభము.
మన దేశమున నార్యస్వతంత్ర ప్రభువులు ప్రభుత్వ ము చేయుఁచుండ భాండాగారములు క్రమక్రమముగా వర్ధిల్లుచుండినవి. తరువాత జైన బౌద్ధులు ప్రబలి తమ మఠ ములయందు మొదట తమతమ గ్రంధములను బిమ్మట నితర గ్రంధముల సైతము సేకరించి గ్రంధభాండాగారము సభివృద్ధి చేయుచుండిరి.
ఆనంతరము భరతఖండమున మహమ్మదీయ ప్రభువులు ప్రవేశింప మన దౌర్భాగ్య కృష్ణ పక్షాంధతమసము దేశమంతయు నావరించె. గ్రంథ భాండాగారము లంగారకున కాహుతులయ్యె. జ్ఞానాభివృద్ధికి హానిగలె.భాషలకు క్షేణ్యము సంభవించె.
అంతే భారతీయ భాగ్యవశమునఁ నాంగ్లేయ ప్రభుత్వమను శుక్లపక్షము బ్రారంభమయ్యే. ఆంగ్లేయ రాజ్యము చల్లదనమున మాత్రము చందురునిబోలి వాని యస్థిరతి వహింపక సూర్యునిపగిది సుస్థిరమై తేజోవంతమై నిఖిలజీవనాధారమై దేశీయ స్వాతంత్ర్యప్రదాయకమై నాట నాటుకొని నానాటఁ జలపడుచు వెలుంగుచుండుగాత.
గ్రంధభాండాగారముల పునరుద్ధానముచేయ సమయము వచ్చినయది. మనదేశము మహమ్మదీయ ప్రభుత్వాంధకారమున మునిఁగి బలవత్సుషిప్తిని బొంది జీవచ్ఛవముపగిది నిర్వ్యాపారతఁ జెందియుండు కాలమున నన్యదేశీయులు విజానమందును నాగరికత యందును మనల జ్ఞానమందాఁటి ముందు మిగిలిపోయిరి. మనము మేల్కొని మనల మిగిలిపోయినవారినిఁ బరువంటుకొనవలసి యున్నది. ఇది ప్రబలప్రయత్న మున గాని సాధ్యము గానేరదు. మన యదృష్ట వశమున ప్రభుత్వమువారు మనకన్ని విధములఁ దోడ్పడనున్నారు. మన ముత్సాహసమన్వితులమై ప్రయత్నింపఁదగును. దేశమున కొలఁది మంది మాత్రము తమ జ్ఞానము సంపాదించుట వలన దేశాభివృద్ధి కలుగఁజాలదు. జనసామాన్యమునకు యధోచిత జ్ఞానము కలుగవలయు. వలయు గ్రంధభాండాగారముల స్థాపించి ముందడుగిడినారము. ఇక వెనుకతీయక పట్టువిడువక మన ప్రయత్నమును గొనసాగించి కృతకృత్యులము గావలయు.
“విఘ్నేర్ముహుర్ముహురపి ప్రతిపాన్యమా నాః
ప్రారబ్ధము తమగుణానపరిత్యజంతి”
ఇట్టి గ్రంథాలయములన్య దేశములందుఁ మిగులఁ బ్రబలి యున్నవి. వీనికిని పూర్వకాలపు గ్రంథాలయములకును గొంత తారతమ్యము కలదు. రాకపోకలకు సులభములు కాని కాలమందెక్కడ నేగ్రంథము దొరకునది గుటయే దుస్తరముగా నుండినది. తెలిసిన యనంతరము నొక్కొక్క గ్రంథమునకై యెంతెంత దూరప్రయాణ ములో చేయవలసియుండె. అచ్చులేనందున బ్రచురము లేక యెన్నియో కష్టముల యనంతరము లభించిన గ్రంధమును మొదలునుండి చివరవఱకుఁ జేతులార వ్రాసికొనినం గాని తనదిగాదు, ఇట్లొక్కొక్క గ్రంధమును సంపాదించుటయం దింతటి కష్టముండ నాకాలమున గ్రంథభాండాగారములఁ జేర్చుటయన్ననెంతటి కష్ట కార్యమొ యోజింపుఁడు, ఇట్టి గ్రంథ భాండాగారము లరుదుగ మూలకొక్కటెక్కడెక్కడనో మాత్రముండుట చిత్రము గాదు.
పండితులీ పుస్తక భాండాగారములకు యాత్రలు సలిపి యేఁడుల కొలఁది యట నిల్చి జ్ఞానము సంపాదించు చుండిరి. అట్టి యాత్రికులకు వలయునన్ని విధములయిన సౌకర్యములును నన్నపానాది సాహాయ్యములును భాండాగారాధిపతు లొడగూర్చుచుండిరి. కాని యెన్ని చేసినను జనసామాన్యమువుకీ గ్రంథ భాండాగారములుప యోగించుచుండినవి కావు. జనసామాన్యమునకు చదువక్కఱ లేదను నాకాలపు దురభిప్రాయము గూడ దీనికి గారణముగా నుండచోపు. అప్పటి యభిప్రాయములెట్లుండినను కాలమిప్పుడు మాఱినది. చదువందఱకు నవశ్యమనుట తేటపడినది.
ఇప్పుడనేక దేశములయందు జనుల కందఱకును జదువను వ్రాయను దెలిసియుండవలసినదని నిర్బంధపఱ