Jump to content

పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అపూర్వ ప్రకటన.

అమెరికాదేశమునందున్న 'బుఫెలో' సార్వజనిక గ్రంథాలయమువారు ఈ క్రింది రీతిని ప్రకటనను గావించిరి.

"మీకు గావలసినదెల్ల గ్రంథాలయమునందు లభ్యమగుచున్నదా ? 'బుఫెలో' యందుండు సర్వజనుల చేతను ఈ గ్రంథాలయము పోషింపబడుచున్నది. సాధ్యమైనంతమంది జనులకు విశేషముగ నుపకారము జేయ వలెనని దీని కోరికయైయున్నది. దీని యుపయోగ మును ఇంకను వృద్ధి జేయుటకు తగు సలహాల నియ్యవలయునని ప్రజలు కోరబడుచున్నారు. మీకు గావలసిన ఏ పుస్తక ములు గ్రం థాలయమునఁదు లేవు?

ఇంకను గ్రంథాలయము ఏరీతిని మీకు సహకారి కాగలదు?"

దీనినిబట్టి జూచిన ఆదేశమున ఒక పట్టణమునం దుండు జనుల వాంఛితాధములను బట్టి అచటి గ్రంథా లయము పనిజేయుచుండునని దేలుచున్నది. ఆహా! అట్లు పనిజేయు గ్రంథాలయముగల పట్టణమే స్వర్గ తు ల్యము గదా!

గత వత్సరమున గోదావరి జిల్లాయందొక గ్రామమునందున్న గ్రంథ భాండాగారమును దర్శింపవల యునని బోతిమి, ఆభాండాగారము ప్రధమమున పదు నైదుగురు పౌరులచే స్థాపింపబడినది. కాని ఇపుడు దా నియందు ఇతర పౌరులును జేరి చందాల నిచ్చుచున్నా రు. ఐనప్పటికిని ప్రధమమున స్థాపించిన పదునైదుగు రే ఆభాండాగారముయొక్క పరిపాలనను తమ వశమునం దుంచుకొన వాంఛించుచున్నారని వింటిమి. ఈ సంగతి నిజయేయైనచో మన దేశమునకును అమెరికాదేశమునకు ను—అంతవరకును బో నేల, బరోడా రాష్ట్రమునక్తుము తారతమ్య మెంతగలదో చదువరులకే గోచరించును ఆరాష్ట్రమునందు మూడు వందల నేబదికంటే నెక్కువ సార్వజనిక గ్రంథాలయములు గలవు. వీటియందు గో న్ని శ్రీశాయాజీ గాయ క్వార్ మహారాజు గారి చే స్థాపిం పబడినవి. మరికొన్నిటిని మహారాజు గారి సహాయము చే ప్రజలు స్థాపించిరి. ఐనప్పటికిని వీటియొక్క పరిపాలన యంతయు జనులకే విడచి పెట్టబడినది.

గ్రాహ్యపుస్తకవిమర్శ.

భరతఖండమునందు పుస్తకములకు పుస్తకాలయ ములకు చరిత్రకందని కాలమునాటనుండి యుత్తమ గౌర వస్థాన మొసంగబడుచుండినను, లిపి ప్రాచుర్యములో నుండినను, చదువను వ్రాయను, నేర్చుట విద్యకు ము ఖ్యాంగముగా నెన్నఁబడినను, వీనితోపాటు జ్ఞానప్రా చుర్యమునందుమాత్రము లాతిదేశములకంటే వేయిమడుం గులు ధారణాశక్తి గౌరవము జేయఁబడుచుండెను. గ్ర హణశ క్తితోపాటు ధారణగూడ ప్రయత్న పూర్వకా భ్యాసముచే నీ దేశమునందు పెంపుసేయబడుచుండెను. పుస్తకముకం టేగూడ నొక్కొకతఱి ధారణకే పూజ్య త గలుగుచుండెను. మనకాది గ్రంధమైన వేదమునందు సంశయముగలిగినప్పు డిప్పటికిగూడ నచ్చెన గ్రంథముల కంటె పండితుల ధారణయే ప్రమాణము. చదువను వ్రా యను నేరువనివాఁడు జ్ఞానశూన్యుఁడని యితర దేశము లందు వాడినట్లు భరతఖండమందు వాఁడ నెతఁ గాదు, జనాభాలెక్కలనుఁబట్టి నూటి కెంతతక్కువమంది చదువ గలవారు తేలిసను తక్కినవాండ్రందరు ప్రాకృతులనియు స్త్రీలు సామాన్యముగ గ్రహించబడినట్లు అజానాంధి $ 1 5 I