33
ఆండ్రూ కార్నీజీ.
అమెరికా కోటీశ్వరుడు.
అమెరికాదేశ గ్రంథభాండాగారోద్యమమునకు కల్పతరువు.
ఇదివరలో గొంతకాలము క్రిందట నాచే వ్రాయబడిన అమెరికావత౯క చరిత్ర పీఠిక యందు మహనీయుడగు కార్నీజీయెడ నాకుగల గౌరవమును దెలిపియున్నాను. ఇప్పుడు కార్నీజీ యొక్క జీవితచరిత్రను ముఖ్యముగ భాండాగారాభ్యుదయములతో సంబంధించినంతవరకు వ్రాయుటకు బూనితిని.
అమెరికా యందు సార్వజనిక గ్రంథాలయముల యభివృద్ధికి మూలపురుషుడనదిగిన ఆండ్రూ కార్నీజీ యొక్క నామము పవిత్రవంతమై గ్రంథభాండాగారముల యభివృద్ధితో నెల్లప్పుడును పరిగణింపబడుచున్నది. కార్నీజీ యొక్క పేరు తలంచినంతమాత్రమున ఆయన యెడ మనకుగల గౌరవభావము స్ఫురింపకమానదు. కార్నీజీ యెటుల కోటీశ్వరుడయ్యెనో తన ధనము నెటుల పుస్తకభాండాగారములకై వెచ్చింపుచుండెనో తెలియుటవల్ల మనకు ఎక్కువ సంతోషమును ఉద్రేకమును కలుగుట కవకాశము గలదు.
ఇప్పటికి ఎనుబది సంవత్సరముల క్రిందట స్కాట్లాండు దేశములో డంఫర్ లైను నగరమునందు ఆండ్రూకార్నీజీ అను మన కథా నాయకుడు జననమందెను. ఆయన తండ్రి విల్లియము కార్నీజీ యను నాయన మగ్గముల నేతవల్ల జీవించుచుండెడివాడు. మన యాండ్రూకార్నీజీ బాల్యమునందు తల్లి వద్దను పినతండ్రి వద్దను విద్యాభ్యాసము జేసెను. తల్లి ఆయనకు అక్షరాభ్యాసము ను జేసెను; అతని నడవడిని మంచి మార్గమున నుంచగలిగెను. అట్టిమాత అతనికి ఏబది సంవత్సరముల వయస్సు వచ్చువరకును జీవించియుండి మన కథానాయకుని మేధాశక్తిని సానపట్టినదై వజ్రముకన్న విలువగలదిగా జేసెను. అతని పినతండ్రి రాచకీయ తంత్రజ్ఞుడై యుండుటచేత చిన్నతనములోనే యాండ్రూకార్నీజీకి ప్రజాపరిపాలనా పద్ధతులలవడి చరిత్రాభ్యాసప్రాప్తి సిద్ధిఅయ్యెను.అందుచేత అతడు పదియవయేటనే ప్రజాపక్షమున రాచకీయపద్ధతులందు మెలంగుచుండెను.
కార్నీజీకి పదునొకండవ సంవత్సరము వచ్చెను.ఆకాలమున దేశమునందు నూతనముగా ఆవిరియంత్రములు ప్రబలసాగెను; వానిముందర చేతిమగ్గముల పసతగ్గిపోవుటచే నాపోటీకి తాళజాలక విలియము కార్నీజీ తన కుటుంబముతో జీవయాత్రకై అమెరికాలో పిట్సుబర్లు పట్టణమునకు బోవలసివచ్చెను. కార్నీజీని 12 వయేట దూది ఫ్యాక్టరీలో వారమునకు 2 రూపాయిల కూలిని బుచ్చుకొని దూది నేరు పనిలో తండ్రి ప్రవేసింపజేనెను. తర్వాత అనేక కోట్ల రూపాయిలతని చేతిమీద వ్యయపడినను మొదట తాను తన తలితండ్రులకై సంపాదించిన 2 రూపాయిల విలువను తానెన్నటికి మరువజాలననియు, తర్వాత తానార్జించిన కోట్లకంటే నా రెండురూపాయిలనె ఎన్ని రెట్లో ఎక్కువగ చూచుచుండెడివాడననియు, అప్పుడు తాను పడిన కాయకష్టము బానిస వృత్తికంటె యధమముగ నుండినను తన తలిదండ్రులకు సహాయపడుటకై గానిచో దుర్భరమై యుండెడిదనియు కార్నీజీ వ్రాసియున్నాడు.
ఒక సంవత్సరము దూది ఫ్యాక్టరీలో పనిచేసిన తర్వాత ఆవిరి యంత్రముతో పనిచేయు మరియొక ఫ్యాక్టరీలో బాయిలరులో నిప్పునుజూచు పనియందు కార్నీజీ ప్రవేసించి, ప్రతిదినము ఎక్కువకష్టపడి పనిచేయుచుండెడివాడు. అంతమాత్రము కష్టము చేత నాతడు అధైర్యము చెందలేదు. ఎప్పటికైనను మంచిదినములు రాకబోవునా యను మనో ధైర్యము కలిగియుండెను. పేదరికము వలన భయమును జెందుటకు మారుగ సంపన్నుల గృహములయందు జూడజాలని నిజమైన సౌఖ్యము పేదవా