32
లేని వారిలో పములను దొలఁగించుచున్నవి.
శాస్త్రజ్ఞులకు, బండితులకు వివిధ విషయములలో నూతన పరిశోధన చేయువారికి నవి చేయు సాయము అమితము, గొప్పగొప్ప భాండాగారము లిట్టివారికి నిశ్శబ్దముగానుండు గదులను బ్రత్యేకముగా వందలకొలఁది పుస్తకములతోఁగూడ నిచ్చి మేలు చేయుచున్నవి. ఉచితముగాఁ గొన్ని యెడలఁ జందానైన స్వీకరింపకయే వారికి వలయు గ్రంధముల నెన్ని యైనను సేవకుని మూలముగా నిండ్లకుఁ బంపి మరలఁ దెప్పించుకొనుచున్నవి.
ఆ దేశమునందు బాఠకులను జక్కగానాదరింతురు. చనవుగానెల్లరను బీరువాల దగ్గఱ కేగి గ్రంధములం దీసికొననిత్తురు. ఇందుచేఁ గొన్ని యెడలఁ బుస్తకములు పోవచ్చును. కాని వీరి మూలమున నెల్లరకు నష్టము కల్గింపకుండుట మేలని యానష్టము సహించుచున్నారు. ఇంకను వారు చేయు లోకోపకారకార్యములు వర్ణింపశక్యముగాదు.
ఈ విషయములనన్నిటిని నెఱవేర్చుట మనదేశపు భాండాగారములకు సాధ్యమగునని నాయాశయముకాదు. మనకాసాయము, ప్రోత్సాహము, పట్టుదల, సంపద, ఐకమత్యము, విద్య, దేశారాధన, జీవనము లేవు. అయినను మీరాయుతృష్టాదర్శములను మదిలో నుంచు కొనుఁడు. వీలైనప్పుడెల్ల నాయాదర్శములలో మెక లేశమునేని మీశక్తి కొలఁది చేయుఁడు. ఉదారాశయములు కల్గియుండుట మానవులకు జాల లాభకరము. మన భాండాగారముల వారెల్లఱు నీవిషయమును గమనింతు రేని, నెర వేర్ప శక్తి కొలఁదిం బ్రయత్నింతు రేని ప్రపంచమునకు మహోపకారముకల్గును.
బెంగుళూరు గ్రంధాలయము.
మైసూరు ప్రభుత్వము వారి వలన బెంగుళూరు నందు సార్వజనిక గ్రంధనిలయము స్థాపింపబడినది. ఇట్టి గ్రంధనిలయములను స్థాపించు విషయము తొలుదొలుత 1912వ సంవత్సరమున మైసూరు ఆర్ధిక సభలో విద్యాశాఖవారిచే ప్రస్తావింపబడెను. 1914వ సంవత్సరమున దొరతనము వారట్టి గ్రంధనిలయములను బెంగుళూరునందొకటియు, మైసూరునందొకటియు నెలకొల్పుటకు అనుజ్ఞనిచ్చిరి. బెంగుళూరు గ్రంధనిలయమునకు గ్రంధములను కొనుట మొదలగు ఖర్చులకుగాను రు.2000ల నిచ్చిరి. ఇదిగాక సంవత్సరమునకు రు.1500ల గ్రాంటును గూడ నిచ్చుచుందురు.
గ్రంధ భాండాగారము.
మ. అతివాచావిభవంబుతో సభలయం దాటోపమేపార ధీ
యుతులై యెంత యుపన్యసించినను లేదొక్కింతయు లాభమూ
ర్జిత కార్యాచరణ ప్రవీణతయె వాసింగూర్చు జ్ఞానాప్తికై
ప్రతియూరన్నెలకొల్పు డాంధ్రులు సమగ్ర గ్రంథ భాండారముల్.