Jump to content

పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

కేంద్ర గ్రంథాలయము, బరోడా

మహారాజు వారిని బరోడా రాజ్యమునం దీది ముఖ్యపుస్తకా వారము. దీని కార్యక్రమ నిర్వాహకమునకు శ్రీమహారాజా గయిక్వార్ అమెరికాదేశము నుండి గ్రంథభాండాగార వ్యాపనా కుశలుండ గు బోర్డనుదొరగారిని పిలిపించెను. బోర్డను దొరగారు ప్రప్రథమమున నొక సంవత్సర ముండుటకై కోరఁబడిరి. మరి రెండు సంవత్సరములవరకు వదలి పెట్టలే -దు. బోర్డను దొరయాజమాన్యముక్రింద బరో డారాష్ట్రమునం దెల్ల భాగములను 451 గ్రం ధాలయములు స్థాపింపబడినవి. క్రొత్తక్రొత్త పుస్తకనిలయములు స్థాపింపబడనిమాస మొ క్కటియునులేదు. తాను స్వయముగ పాటు పడి వ్యాపనముఁ జేయుటయేగాక తత్కార్య మునం దనేకయువకులకు బోర్డనుదొర నిరు పమానమగు నా వేశమునుగలిగిం చెను.

కేంద్రగ్రంధాలయమున 57296 గ్రంథము లును, 3000 పాఠకులును గలరు. పాఠకుడు ఒక్కనికి సాలునకు 19 గ్రంథముల చొప్పున జదివిరి. అమెరికా దేశమునందలి పురాతనగ్రం క థభాండాగారములుగల బ్రాన్ఫర్డు, క నెక్టికట్ పట్టణములయందలి పాఠకులుగూడ నింతటి కంటె విశేషముగాఁ జదివియుండ లేదు.

ఈ భాండాగార చర్యయం ద నేక శాఖలు కలవు.

1. బాలశాఖ:—ఇందన్ని వయసుల బాలు రకు నుపయుక్త ములగు పుస్తకములనేకము 9D 2 విరికు వయసుగల బాలురకు 88 బొమ్మల పుస్తకములు వి శేషముగా సమకూర్పఁ బడినవి. గ్రంధాలయముయొక్క గోడలయం దును వ స్తుపాఠ బోధకములగు పటము లనేక ము లలంకరింపఁబడినవి. పిల్లలకు వినోదముల మూలమున విద్యగరపఁబడు చున్నది. బాలుర లాలించుటయందు స్త్రీల కెక్కువ సామర్థ్య ముకలదు గనుక ఈశాఖ కధ్యక్షపదవికి నొక స్త్రీయే నియమింపఁబడినది.

2. క్రీడలు:—గ్రంధాలయమున క్రీడ లే మిటికని చదువరుల కందరికిని గొప్ప సందేహ ముకలుగవచ్చును. కాని మనమిప్పుడు య దార్థమును గూర్చి మాట్లాడుచుంటిమి కాని కల్పనాకధలనుగూర్చి కాదు. యదార్థమైనను మనకు వింతగా నేయున్నది. దీని రహస్యమును దెలిసికొనుట యొక కష్టసాధ్యమైన పనిగాదు. “గ్రంధాలయముయొక్క కార్యక్రమము ద్వివి ధము, వినోదపరచుట. విద్యఁగరపుట. గ్రం ధాలయమును ద్రొక్కిచూడనిమనుష్యు లనే కులు కలరు. అట్టివారి నాకర్షించుటకు క్రీడ లు మిక్కిలిసామర్థ్యముకలవి. ఒకేపనిని చా ల సేపు చేయుచుండుట చేత విసుగు జెందిన మన సుగలవారికి క్రీడలు బు బుద్ధిమాంద్యమును రించి సంతోషమలవర చుటకు సిధౌషధము లువంటివి.

3. ప్రదర్శనశాఖ:— మాజిక్ లాంటరన్ (వింతలలాంతరు) మొదలగు యంత్రముల సా హాయమున ననేక విషయములు జనులకుఁ బో ధింపఁబడుచున్నవి. ఈ కార్య మొక సంవత్స రముజరిపిచూచుటకుగాను, మహారాజా గయిక్వార్ 10,000 రూప్యము లొసంగెను.