Jump to content

పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పల్లెలయందలి గ్రంథాలయములు.

గ్రంధములను, పాఠకులను వీలయినంతవ రకు పైన చెప్పిన పద్ధతులననుసరించి పెట్టుట కు కార్యనిర్వాహకులు ప్రయత్నించుచు వీ రు తమపై మరియొక భారము వైచికొనినచో నెంతయుమంచిది. దీనివలన భాషా సేవయు, చరిత్రసాధక సముపార్జితమును గూడ కలుగు చుండును. పట్టణములయం దుండు వారలు పూర్వాపూర్వగ్రంధములను ముద్రించి తమ కంపుచు సేవ యొనర్చుచుండిరి. పల్లెటూళ్ళ యందలి భాండాగారములు తమ చుట్టుపట్ల గ్రామములయం దటగలవై క్రిమిభక్షితము లై నాశనములగుచున్న తాళపత్రగ్రంధము లను సంపాదించి, వానికి మట్టినూనె ప్రతిపత్ర మునవ్రాసి, నూతనసూత్రములకు పసుపురాచి జాగ్రతపఱచవలయును. ఇందువలన రెండు ప్రయోజనములుకలవు, మనపూర్వులీయచ్చు గ్రంధము లేమియు లేనప్పు డీతాటియాకుల గ్రం ధములువ్రాసికొని యెంత కష్టపడెఁడువారో వారెంతటివి ద్యాప్రియులో తెలిసికొనుట కిప్ప టివారికి బ్రబలనిదర్శనములగుటయేగాక, ప్రతి మానవున కాయద్భుత కాయకష్ట ఫలితములగు గ్రంధములను జూచుటతోడనే తనమాతృభా షావై ముఖత్వమునకు సిగ్గుగలిగి భాషాభిమా న మొదవును. ఈ వాక్యము ఈ వాక్యము లసత్యములని త్రోసివేయక ప్రయత్నించిచూడుడు ! భాం డాగారములు వారు భాషకుఁ జేయు సేవయం దిది ప్రధానస్థానము నాక్రమించును. రెండవ 17 ప్రయోజన మంతరించిన మాయముకానున్న యనేక గ్రంధములు బయటపడుట. వ్రా తగ్రంధములయం దచ్చుపడిన విదొరికినను వా నిని నిరసింపక, పట్టుగుడ్డలతో నలంకరించి తాళపత్రగ్రంధముల పైనున్న గబ్బిలపు పెంట ల దులిపి, యుచిత గౌరవమునిచ్చి ఘంటముల వ్రాయసకాండ్రయాత్మలకు తృప్తి నిగలుగ జే యుట ప్రతియాం ధ్రునకుగర్తవ్యము. ఈ పని పల్లెటూళ్ళయందలి భాండాగారముల వారు ప్రా రంభించినచో స్వల్పకాలములోనే ఫలితము అత్యద్భుతములుగ పరిణమించును. వారి భాఁ డాగారములయందలి గ్రంధములు ప్రజలు ప్ర యోజనపఱచుకొననికొఱంత తీరగలదు! “ఏక క్రియా ద్వ్యర్థికరి!” మిత్రులారా! ఈ పైవా క్యముల ననుగ్రహించి చేయుఁడు. దీనివలన ధననష్టము లేదు. కేవలమభిమానము. కొంచె ము ఓపిక కావలయును. అట్టి గ్రంధములను పరిశీలించుటకు వాఙ్మయచరిత్రకారులకు విడిచి పెట్టవచ్చును. మదరాసు ఓరియంటల్ లై బ్రరి, ఆంధ్రసాహిత్యపరిషత్తు లేక మీరంద రు కలసి ముందుస్థాపింపఁబోవు “సెంట్రలు లై బ్రరి”కి యీయవచ్చును. మీరు భద్రపఱచ జాలనియెడల వారాపని చేయుదురు. సోదరు లారా ! ఆలసింపకుఁడు ! ఇంతలో మరియొక గ్రంధము క్రిమిభక్షితమో, యగ్ని పరమో కావచ్చును. దయయుంచి త్వరలో భాషాభి మానులంద రీకార్యమునకు పూనుకొనుఁడు!

వంగూరి సుబ్బారావు.