Jump to content

పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

11

జేయుట మనము వారికి జేయదగిన రెండవపని. ఇందుకొరకై మనము తరుచుగా ఉపన్యాస ములను హరికథలను, భజనలను పెట్టి వారినాకర్షించి, ఎవ్వరెవరికే గ్రంధములనువుగ నుండునో అట్టివారి కట్టి పుస్తకములనే అందజేయుచుండవలెను. పుస్తకముల యోగ్యతను బట్టి జనులు, వారి అధికారము ననుసరించి పుస్తకములు, అమఱి యుండవలెను. పరస్పరమెవరు తగియుండక పోయినను మనము జేయు పనియంతయు వ్యర్థము. సామాన్య జనులు పుస్తకములకు తగియుండరనుట నిజముకాదు. ఏలయన వారికి తగిన పుస్తకములనే మనము సమకూర్చవలెను. గ్రంధములు తమంతట తాము చదువుకొనజాలని జనులు మనదేశమునందు విశేషముగ గలరని ఇదివరకే జెప్పియుంటిని పైన జెప్పిన రెండురకముల జనులకంటే వీరిని జ్ఞానవంతులుగ జేయుటకే మనము విశేషముగ శ్రద్ధవహింపవలసియున్నది. దేశమునందు ఇంతమంది జనులు జ్ఞానవిహీనులై యున్న నాదేశ మెన్నటికిని బాగుపడదు. అది కలలోనివార్త యనవచ్చును. వీరికి చదువు జెప్పి విద్యావంతులుగ జేయుదమన్న అసంభవము. కావున వీగిని జ్ఞానవంతులుగ జేయుటకే మనము ప్రయత్నింపవలెను. పరిశ్రామికములు, శాస్త్రములు ఆదిగా గల విషయములను గూర్చి వారికుపన్యాసములిచ్చి వారిబుద్ధికి వికాసమును గలుగ జేయవలెను. మహా గ్రంధముల నెల్ల వారికి జదివి వినిపించి బోధింపవలెను. ఇంకను వీలగునేని మాజిక్కు లాంతరునుగాని, సినిమోటాగ్రాఫునుగాని, సంపాదించి వానిమూలమున పలు విషయములను బ్రదర్శింపుచు బోధనలను జేయవలెను. అది ఎక్కువ హృదయరంజకముగను చిత్త సంస్కారముగను నుండువారిని మనమున్న చోటికి రమ్మనమనిన రాకపొతే మనమే వారున్న స్థలమునకు బోవలెను. వేష భేషజముల నన్నిటిని వదలి వేయవలె వారియందొకనిగ భావించునటుల బోయిరేమికోరుదురో అడిగి దెలిసికొన వలెను. కోరబడు దానినుండియే వారి కొరతను బాపవలెను. కొన్ని సమయములయందు ఆ కొరతలు మన భావనలకు భిన్నములైయుండును. ప్రథమమున, వారేమి గోరెదరో తెలుసుకొనుడు. వారిలో కొందరు ఏకాకులుగనుండ గోరెదరు. అట్టివారి నటులనే నుండ నించి వారిపిల్లల ఉన్నతిని గోరవచ్చును. కావున వారికొరకై వేచియుండుము. ఈ కార్యము వేసవికాలపు శలవులలో గాని శీతకాలపు శలవు దినములలో గాని చేయదగినదిగాదు. ఇది జీవితాంతమునంతను ధారపోయవలసిన మహత్కార్యము.

ప్రతి గ్రంధాలయమును తనగ్రామమునందు గాని లేక పట్టణమునందుగాని గల పాఠశాలతో సంబంధమును గలుగ జేసు కొనవలెను. పాఠశాల యందుపాధ్యాయులు పాఠములను బోధింపునపుడు, వివిధవిషయములని గూర్చి జెప్పునపుడు ఆయా విషయములను గూర్చిన విపుల గ్రంధములు అచటి గ్రంధాలయమునగలవని జెప్పి వానిని విద్యార్థులు జదువునటుల జేయవలెను. ఇంతియగాక ఉపాధ్యానటుల జేయవలెను. ఇంతియగాక ఉపాధ్యాయులప్పుడప్పుడు తమ విద్యార్ధులను గ్రంథాలయమునకు గొనివచ్చి, అచట గలవారికుపయోగకరములగు గ్రంథములయందు అభిమానము గలుగు నటుల ఉపన్యాసముల నొసగచుండవలెను.