Jump to content

పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

మనము సంపాదింపవలెను. ప్రతిచదువరికిగాను ఒక పుస్తకమునైన మనము పెట్టవలెను. అట్లు చేయలేని యెడల గ్రంధాలయము యొక్క యుపయోగ మేమి?

వేయేల! సంఘసముద్ధరణ భారమంతయు ఈ కాలమున గ్రంధాలయము మీదనే పడియున్నది. సంఘమునకు గావలసిన నీతివిద్యావిషయ వ్యాసంగమును, రసజ్ఞతా వ్యవసాయమునకు, సహానుభవాభివృద్ధిని, జ్ఞానసముపార్టనను—ఇంతేల, ఈ ఇరువదియవ శతాబ్దమున ఒక సంఘమును కలంచివైచు సకలోపకరణములను గూర్చి అనుభవసిద్ధముగ నుండు సూచీకరణము గ్రంధాలయమునందే జరుగవలన్నది. ఇట్టి సాంఘిక సేవారతి నెట్లు జరుగునో కొంచెము విచారింతము.

పిల్లలే సంఘమునకు జీవమని జెప్పవచ్చు వారియందు అనంతమైన శక్తులు గర్భితలై యున్నవి. ఈ శక్తులను ప్రథమమున పాఠశాలయందు వర్ధిల్ల జేయవలసియున్నను విద్యకుచితములగు నిర్భంధ పాఠపుస్తకములను అందించుటయందే వారి నణగద్రొక్కక, ఆశయాలు వికాసమునంది వలసిన దోహదమునంతను మనమీయవలసియున్నది. పిల్ల లయొక్క మనస్సులు అతి కోమలములు. కావున అట్టి సమయమున నే వారికి మంచిదారులయందు బెట్టుట మిక్కిలినావశ్యకము. అట్లు చేయగలిగితిమేని వారికి సంపూర్ణ ధైర్యసాహసము లలవడుననుటకు ఏమాత్రము సందేహము లేదు. ఈదినమున పిల్లలుగ నుండువారు రేపటిదినమున పెద్దలగుదురు.అందుచేత పిల్లలకు సన్మార్గమలవడునటుల జేసితి మేని మనజాతి ఔన్నత్యము నెందుట కేమియు సందియము లేదు. కాబట్టి వారికి ఉపయోగకరములగు ప్రత్యేకపుస్తకములను సేకరించి వేరుగనుంపవలెను. అవి విశేషముగా బొమ్మలు గలిగినవై యుండవలెను. గోడలయందు వస్తు పాఠబోధకములగు పటములను బెట్టి వాటిని గురించి బాలురకు బోధింపుచు అందుకు సంబంధించిన పుస్తకములను వారు చదువునటుల అభిరుచిని గల్పింపవలెను. మఱియు సుబోధకములును నీతిబోధకములును నగు కథలను జెప్పి వారి మనస్సుల నాకర్షించి గ్రంథపఠనమునకు వారిని బ్రోత్సహింపవలెను.

స్త్రీల విషయమున మనము మూకీభావమును వహించుటయం దనర్థకమము లనేకములు కలవు. పాశ్చాత్య దేశములయందు ప్రత్యేకముగ చదువుకొనుటకు వలయు సౌకర్యముల నెల్ల స్త్రీలకు గల్పించిరి. అక్కడ స్త్రీలు భాండాగారిణులుగగూడ గలరు. ప్రారంభదశ యందు మనమట్టి ప్రయత్నములకు బూనుకొనకపోయినను గృహములకు పుస్తకములను బంపి స్త్రీలు విశేషముగ జదువునటుల జేయవలెను. పురుషులకంటె స్త్రీల యందు విద్యావిహీన లెక్కువగగలరు. అందుచేత విద్యావతులగు స్త్రీల నేర్పరచి చదువుకొనజాలని స్త్రీలకు వారి గృహములకు బోయి వారు కోరిన విషయములుగల గ్రంధములనెల్ల 'చదివి వినిపించునటుల జేయవలెను.

గ్రంధములను చదువుకొన గుతూహలము గలిగినవారికి వానినందిచ్చుట పురుషులగు మనము జేయగలిగిన మొదటిపని గ్రంధములను చదువుకొనుటకు శక్తిగలిగి, వానిని పఠియింప నిచ్ఛలేనివారల కట్టియిచ్ఛను గలుగ