Jump to content

పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84

మున ననుస్వారమున్నదని యైన ననవలె, లేనిచో సంస్కృత వ్యాకరణ ప్రణేతయగు పాణినికింగొంత యజ్ఞత నారోపింపవలయును. గీర్వాణ వ్యాకరణ ప్రణేతల నంత పెద్దగాఁ బొగడిన మీరలాయన కజ్ఞత నారోపింపఁజాలరు. కాననాంధ్రమున ననుస్వారమున్న దనియొప్పుకొనుఁడు. ఇంక పంగ యనునట్టి యేక పదములుండునవి యనుస్వారములా పంచమ వర్ణములా? "తస్యస్యాచ్చ పూర్ణ బిన్దురపి” “షవట్త్రింశదత్రేతే," ఇత్యాది సూత్రములు తప్పులని చెప్పిన యాక్షేపము తప్పా కాదాయని విచారింపవలయును. అనుస్వారమునకు స్థానము కేవలనాసిక, వర్గీయ పంచమవర్ణములకు నాసిక, తత్తద్వర్గ స్థానములగు ఙకారమునకుఁ గంఠము, ఞ-కారమునకుఁ దాలువు, ణకారమునకు మూర్ధము, నకారమునకు దన్తము, మకారమున కోష్టములు స్థానములు గలవు. కానఁ పంగయనునప్పుడు, అనుస్వారము కేవలము నాసిక చేతనే యుచ్చరింపఁబడినను, తదవ్యవహితోత్తరవర్తి యగు గకారమునకున్న కంఠస్థాన మీయనుస్వార నాసికా స్థానముతోఁ గూడఁ జేరినట్లు దోచుటచే వారి కట్లు భ్రమకలిగెను. అనుస్వారమునకుఁ నాసికయు దానికిఁ బరమగు శకారమునకు గంఠము, రెండు సంహితగా నుచ్చరింపఁబడుచున్నవి యని యనుకొని సూక్ష్మదృష్టితోఁ జూడుఁడు. పంగ యనుచో 'ఙ'కారమే లేదు, యనుస్వారమే యున్నది యని మీకు బోధయగు, ఙ'కారమే యున్న యెడల నాసికా స్థానమైన తరువాత కంఠము ఙకారమున కొకసారియు గకారమున కొకసారియు వినియోగింపఁ బడనగు. అట్లు రెండుసార్లు కంఠ ముపయోగింపఁబడుచున్నదా? లేదు. సంస్కృతములోననో ఙ ఞ లు ప్రత్యేకమున్నవి. ఙఞలు హల్లులు ప్రాణులు. ప్రాణులు ప్రాణములతోఁగూడి వ్యవహరింపఁబడనగు, ఙకారము ప్రత్యజ్ఞాత్మా. ఇకారము ప్రజ్ఞాయాచా, యనుచో నచ్చులతోఁ గలసి ప్రత్యేక వణ౯ములై వ్యవహరింపఁబడచున్నవి. ఇట్లెచ్చోనయినఁ దెలుఁగున బ్రత్యేక మచ్చుతోఁగలసి ఙ ఞ లు కానవచ్చునా ? అట్లు లేనిచో నీని జీ౯ ప్రతిమలఁ జేర్చినచో లాభమేమో మృగ్యము. సంస్కృతముననో అఙ్కితః , అఞ్కితః ఇత్యాదులయందుండు ఙ ఞ లు లక్ష్యాంతరములయందు ప్రకృతిసిద్ధ ములై యిచ్చట ననుస్వారస్థానమం దాదేశముగావచ్చినవి గాని స్వతసిద్ధములు గావు. అకి, అఞ్చి ధాతువుల వలనఁబుట్టిన యీరూపములు మొదలు నకారము గలవి యని తజ్ఞులకు విశదము. గంజి, పంగ లలో నుండునవి నకారమనిగాని ఙ ఞ- లనిగాని సప్రమాణముగా వ్యుత్పత్తి ననుసరించి మీరు చూపింపలేదు గనుకను అనుస్వారమున కుండవలసిన నాసికామాత్రమే పైవణ౯ ములకుండిన కంఠాదిస్థానములతో సేకీభవించిన ననుభవసిద్ధమగు సుఖోచ్చారణము సిద్దించుచున్నది గనుకను ననుస్వారమనియే యొప్పుకొనక తప్పదు. స్థూలదృష్టితో విచారించినను మీ మతమందింకొకతప్పు గలదు. అనుస్వారము లేదనిన నథ౯మెక్కడిది ? అదియు లేదందురా, అతిసాహసము. ఉన్నదందురా దేనికధ౯ము? దీనికిఁ బూణ౯ మేది? నకార స్థానికము పూణ౯ము. దానికి లోపము ప్రాపించినపు డధ౯మని వైయాకరణులు వ్యవహరించిరి. కాన నాంధ్రమునం దధ౯ పూణా౯నుస్వారములున్నవనియు ఙ ఞ లు లేవనియుఁ జెప్పినది సర్వమనవద్యము. నిర్వికారదృష్టితో నీవ్యాసమును జూచిన సత్యము గోచరమగుననియెంచి శాస్త్రీయచర్చ నొకింతఁజూపి విరమించుచున్నాడను.

తత్ - సత్.