Jump to content

పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

83


ఆంధ్రభాగ్యము మోయగ గౌతమీకృష్ణ
దరులను నావలు దిరిగెననచు,
ఆంధ్రవీరులకు స్వర్గాతిథ్యమిచ్చి పా
టలుపాడిన యుగముకలదటంచు,


తే.గీ.

చెప్పి యొప్పించు పుస్తక శ్రీకుమారి
యందగింపఁగఁగల యాలయములుగట్టుఁ
డాంధ్రదేశమునందెల్ల నాంధ్రపుత్రు
లాప్తమానవసంఘ సేవానురక్తి.


ఆంధ్రమునందనుస్వారము

పురాణమిత్యె వనసాధుసర్వం| నచాపికావ్యం నవ

మిత్యవద్యం |సన్తః పరీక్ష్యాన్య తరద్భజన్తె | మూఢ

పరప్రత్య య నేయబుద్ధిః॥

యని అభయుక్తోకి కలదు. ప్రాచీనులు చెప్పిన మాత్రాన సాధువనియు, నవీనులు చెప్పినమాత్రాన నసాధువనియు నెంచక గుణాగుణ విచారణచేసి సత్పురుషులు గ్రహింతురనియు నట్లు కాకుండుట మూర్ఖపద్ధతీయనియు దీని భావము. బాలాదపి సుభాషితమ్మను మాట యీయధ౯మునే దృఢపఱచుచున్నది. ప్రియ పాఠకులారా, నేనీదృష్టితోనే త్రిలింగయను పత్రిక యందుండిన “ఆంధ్రము నందనుస్వార కలదా” యను వ్యాసమును జదివితిని. అవ్యాసములో వక్తవ్యాంశమునకు ముందుగా నుండు కొన్నిమాటల న్యాయదృష్టితో నంగీకరించితిని. అవసరమైనను గాకపోయినను బ్రాచీనార్యులను సంస్కృత వ్యాకరణ రచయితలగు పాణిన్యాదులఁజేసిన స్తుతికి మిగుల సంతసించితిని. ఆంధ్రవైయాకరణాలకేమి, ఆధునిక కేవల సంస్కృత వ్యాకరణాభిజ్ఞులకేమి, కొంత యజ్ఞానమారోపించినను వీరు చూపింపఁబోవు నపూర్వ విషయము గ్రహించుటకై సైచితిని. చివరకు నామతమిందు పైఁ దెలుపవలసిన యవసరము గన్పట్టినందున, నాపనికిఁ బూనితిని.

ఆవ్యాసమెంత పొడుగుగ నుండినను దాని సారమిది:_ “ఆంధ్రము నందనుస్వారము లేదు. ఙ, ఞ, లున్నవి. అను స్వారమునకు కవర్గము పరమగుచో, 'జ' కారమును చ వర్గము పరమగుచో 'ఞ'కారమును, ట వర్గము పరమగుచో 'ణ' కారమును, త వర్గము పరమగులో 'న' కారమును 'ప' వర్గము పరమగుచో 'మ, కారమును స్వారస్థానమందు వ్రాయవలయును. పఙ్గ, గఞ్జ, కణ్డ,కన్త, చమ్బు యధాశ్రమముగా నుదాహరణములు. సూక్ష్మదృష్టితో విచారించిన నుచ్చారణ స్థానముల బట్టి, బోధ కాఁగలదు. పాణినీయములోని "నశ్చాపదాన్తస్యఝలి,” “మోనుస్వారః," అను సూత్రములచే నిరనునాసికలగు స్పశ౯లు నూష౯లు పరమగునపుడు ఆపదాన్త నకారమునకును పదాన్తమందుఁ గూడ మకారమునకును అను స్వారమువచ్చును. “అను స్వారస్యయయి పరసవర్ణః” అను సూత్రముచే నీయనుస్వారమునకు స్పశ౯లు సంతస్థలములు పరమగునపుడు క్రమముగా ఙ, ఞ, ణ, న, మ, లగును. లక్ష్యములు, అఙ్కితము, ఆఞ్చితము, కుణ్డితము, శాన్తము, గుమ్భితము అని వ్రాయుట సాధువు గాని, అంకితము, అంచితము, కుంఠితము, శాంతము, గుంభితము అనునవి యెట్లు సాధువులు గావో అట్లే పంగ, గంజి, కండ, కంత, చంబు అనునవి కూడ సాధువులు గావు."

కాని సంస్కృతమున నింకొకటి విచారణీయాంశము గలదు. “హిపదాన్తస్యయను సూత్రముచే పదాన్తమగు ననుస్వారమునకు వర్గీయములు పరమైనచోఁ బరవసవర్ణము కంసఞ్జఘాన యనియు ననుస్వార ఘటితరూపము కంసంజఘాన యనునదియు సాధువే. కానీ సంస్కృతమును, తద్వైయాకరణులఁ బ్రమాణముగాఁ గొనిన మనము “దృతంచ బిందుస్యాత్,” “ప్రధమా విభక్తి కమోర్బిందుశ్చ” యను సూత్రములచే పదాన్త నకార మకారములకు బిందువులను వచ్చెంగమలాక్షుఁడు భయంపడి యనువాని నొప్పుకొనవలయుఁ గదా. అట్లయిన నాంధ్ర