Jump to content

పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

72


క్షాత్రయుగమునాటి హింద్వార్యులు, వారి యుడుపులు.



క్షాత్రయుగమునాఁటి మనవారి స్థితిగతులను వారి యాచారవ్యవహారములను దెలుపు ముఖ్య గ్రంథములు భారత రామాయణములు. వేల సంవత్సరములక్రింద నుండిన మన పూర్వికులెట్టి యుడుపులను ధరించుచుండిరో తెలిసికొనవలయుననిన మన మా గ్రంథములతో నెక్కువ పనిఁగొనవలసియున్నాము. ఈ యంశమును గుఱించిన వివరములు వానిలోనైనను విస్తారముగా గానరావు. అయినను ఉన్న సంగతులను బట్టి మన మేమి గ్రహించవలయునో చూతము.

పురుషు లాకాలమున ధరించుచుండిన యుడుపు లు మిక్కిలి సామాన్యమైనవి. అప్పటివారి యుడుపు లనఁగా, ఎక్కువపొడవు తక్కువ వెడల్పుగల రెండు విడి వస్త్రములుమాత్రమే యైయుండవచ్చును. ఒకటి కట్టుకొనఁబడునది, రెండవది కప్పుకొనఁబడునది. మొదటిది నడుమునుండి క్రిందిభాగమును గప్పుచుండెను; రెండవది నడుముమీఁది భాగము నాచ్ఛాదించుచుండెను. ఈయూహ కేవలము కల్పితమైనదని తలఁపఁగూడదు. ఇది సప్ర మాణమనుట నిస్సంశయము. ద్రౌపది కౌరవసభలోనికి లాగికొనిరాఁబడినపుడు, దుర్యోధనుఁడు ఆమె చూచు చుండఁ గాఁ దన కుడితొడమీది వస్త్రమును దొలగించేనని మహాభారతమందున్నది. దాదాపుగా నిప్పటికాలమున వాడుకయందున్న విధమున ధోవతిఁ గట్టికొనిన నేకాని అతఁడట్లు తన కుడితొడను ఆనాచ్ఛాదితముగాఁ జేయుట సంభవింపదు. రాజు మొదలు జనసామాన్యమువఱకు నందఱును ధోవతి నే కట్టుకొను చుండినట్లుకూడ తోఁచుచున్నది. భేదమేమైన నుండినచో వస్త్రముయొక్క మృదులత్వమునందును నేతయొక్క సన్నదనమునందును ఉండవచ్చును. ధృతరాష్ట్రృఁడు పుత్రునిశరీరము కృశించి నందునకుఁ గారణమునడుగు సందర్భమున నిట్లనును “నీవు ప్రావారవస్త్రములను ధరించుచున్నావు. మాంసముతో నన్నమును భుజించుచున్నావు. దివ్యాశ్వముల నెక్కి సవారీచేయుచున్నావు. ఇట్టి నీవు కృశించుటకుఁ గారణ మేమి?” (ప్రావారవస్త్రము'లనఁగా నేమో వ్యాఖ్యాత వివరించలేదు. అయినను పైశబ్దమునకు మనము అందమైన వస్త్రములని యర్దము చెప్పిన చెప్పవచ్చునని తలఁ చెదను, శరీర ్వభాగము నాచ్ఛాదించుచుండిన రెండవ వస్త్రమును గుఱించి మనకంతగాఁ దెలియదు. మత గ్రంథములలో వచ్చిన (ఉ త్తరీయ' శబ్దమునుబట్టి మన మీ రెండవ వస్త్రముండెనని నిశ్చయించుకొన వలసినవారు మైతిమి. ఈవస్త్రము వెనుకఁజెప్పిన ప్రకారము శరీరోర్ధ్వభాగమున గప్పికొనఁబడుచుం డెడిది. కొన్ని వేళలయందు కుడి చేయి ఆనాచ్ఛాదితముగా వదలివేయఁ బడుచుండెను. అట్టి సమయమున నీ యుత్తరీయము కుడిచంక క్రిందినుండి యెడమభుజముమీఁదికిఁ బోవుచుండెనని యూహింప వలయును. విద్యార్థులు తమ చేతిని బయటకు తీసియుంచవలయునని మనుస్మృతి విధించియున్నది. దీనికి వ్యాఖ్యాత (ఉత్తరీయము కప్పక బయటకుఁ దీసియుంచ వలయునని యర్థము చెప్పియున్నాఁడు. పురాతన కాలపు హింద్వార్యులు యుద్ధ సమయములందు ఉత్తరీయము నిట్లే వైచికొని దాని చెఱఁగులను ఎడమభుజము పైనఁ గట్టిగా ముడి వేసికొనుచుండిరని తోఁచుచున్నది.

  • క్షాత్రయుగమనఁగా మన దేశ చరిత్రములోని యొక నిర్ణీతకాలము, ఈశాలమున మనదేశమునందలి వీరకావ్యములుగు రామాయణ భారతములు రచింపఁబడి

నందున దీనికి క్షాత్రయుగమని పేరు పెట్టఁబడినది. పాశ్చాత్యవిద్వాంసులును వారి ననుసరించిన మనవిద్వాంసులును ఈయుగముయొక్క పరిమితి వేయిసంవత్సరముల (క్రీ. పూ, ౧ ౨౩౦ నుండి క్రీ. పూ. 300 సంవత్సరములవఱకు) దాని సిద్ధాంతీకరించియున్నారు. సి. వి. వైద్యా ఎం.ఏ., ఎల్. ఎల్, బి. గారు క్షాత్రయుగ వైశాల్యమును ఇంచుమించుగా క్రీ. పూ. 3000 నుండి క్రీ. పూ ౨౫ం వఱకు నిర్ధారణ చేసియున్నారు. వీరి యభిప్రాయముతో నంద జెకీబవించకపోయినను, వీరు చెప్పిన యంశములను వివరములను మనము పాశ్చాత్యవిద్వాంసులచే నిశ్చయింపఁబడిన క్షాత్రయుగమునకే వర్తించునవి యని యూహించుకొనవచ్చును. వైద్యా గారి మతిమున భారతయుద్ధము క్రీ- పూ. 3000 వ సంవత్సరమున జరిగినది- గ్రంథము తరువాత కొలఁదికాలమునకే వ్రాయఁబడినని వారభిప్రాయపడుచున్నారు, 1. నిత్యముద్ధృతపాణిస్యాత్-