71
ఇతర విషయములయందును గూడ అమూల్యమగు పనిని స ల్పినవి, గొప్ప గ్రంధాలయముల యందలి ఉద్యోగస్థులం దరునుగూడి “ఉద్యోగస్థుల సముదాయము”ల నేర్పరచు కొందురు. సమాజములకును వీటికిని స్వల్ప భేద ముండున ప్పటికిని వీరును వారు జేయు పనినే సలుపుచుందురు; వీరి సభలకు ఇతర పెద్దమనుష్యులను గూడ నాహ్వానము జే సెదరు.
ఇంతియ గాక గ్రంధాలయ సంఘములు' గూడ గలవు. ఇవి ఆయా పట్టణములకు సంబంధించి మాత్రముం డును. కావలసిన విషయములను ఇతరస్థలములకు బోయి నేర్చుకొనుటకుగాని, మహాజన సభలకు బోవుటకు గాని, కాలమును ద్రవ్యమును గలిగియుండని వారందరికిని ఈ సంఘములు అత్యంతోపయుక్తములు,
బరోడా రాష్ట్రము.
ఉచిత ప్రారంభ విద్యతో బాటు సరి సమానముగా గ్రంధభాండాగారోద్యమమును బరోడా రాష్ట్రమున నె లకొల్పబడినది. ఆరాష్ట్రప్రభువులగు శ్రీ శాయాజీరా వు మహరాజాగారు దీనికంతకును ప్రాణాధారము. పై న జెప్పబడిన మార్గముల ననుసరించియే బరోడా యందు ను “గ్రంధభాండాగార సమాజ” మొకటి స్థాపింపబడినది. గ్రంధభాండాగారోద్యమమునం దభిమానము గలిగినవా రందరును ఈసమాజమునందు జేరి వారికభిమానములగు వి వయములను గూర్చి జర్చింపవచ్చును.
బరోడాయందున్న కేంద్ర గ్రంధాలయమునందు మొదట నీ సంఘమిరువది యైదుగురు గ్రంధ భాండాగార కులతో ప్రారంభింపబడెను. ఇప్పుడు బరోడా రాష్ట్రము న మూడువందల నేబది కంటె నెక్కుడు భాండాగారము లుగలవు. సర్వగ్రంధాలయాధ్యక్షులును నొక్కచో సమావేశ మైయందు వారియనుభవముల నన్యోన్యము దెలిసికొని, పుస్తకాలయ వ్యాపనమునకు సంబంధించిన వివిధ విషయములను జర్చించుట వారి యుద్దేశము. ఈ సంఘము కేవలము బరోడా రాజ్యమునందలి గ్రంధాలయాధి కారుల నేగాక భరతవర్షమునందన్ని తావులను గలవారి నాకర్షించి, సంఘీభావమును వృద్ధిపరచి, జర్మనీ, యిం గ్లాండు, అమెరికా మొదలగు దేశములందువలె జాతీ యసంఘముగా నేర్పడుచున్నది.
ఆంధ్ర దేశము.
గ్రంధభాండాగారోద్యమమును గూర్చి ప్రపంచ మునందు జరుగుచున్న యభివృద్ధినిజూచి సంతసించి, ఆంధ్రదేశముయొక్క దుస్థితికి జింతించి, బెజవాడయం దున్న రామమోహన ధర్మపుస్తక భాండాగారము వారి యాదరణక్రింద 1914 సం. ఏప్రియలు నెల 10వ తేదీన బెజవాడపట్టణమున “ప్రధమ ఆంధ్రదేశ గ్రంధ భాండా గార ప్రతినిధులమహాసభ" కూడినది, “ఆంధ్రదేశమునం దు గ్రంధభాండాగారోద్యమమును వ్యాపింపజేయుట” యే ఈసభాతీర్మానములయందు ప్రాధాన్యమును వహిం చినది. ఆతీర్మానముల నన్నిటిని ఆచరణయందు బెట్టుట కుగాను “ఆంధ్రదేశగ్రంధ భాండాగార సంఘ” మేరా టు గావింపబడినది. కృష్ణాజిల్లా యందున్న బెజవాడ, గుడివాడ, తణుకు తాలూకాలయందును, గుంటూరుజిల్లా తెనాలి తాలూకాయందును, గోదావరిజిల్లా రామచంద్ర పురం తాలూకాయందును ఇతర తాలూకాలకంటే కొం చెమెక్కువ భాండాగారములు కలవు. అందుచేత ఈ తాలూకాలయందు గ్రంధాలయముల నేర్పాటు జేసి పని జేసిన మిక్కిలి యభివృద్ధి జెందుననుట కెంత మాత్రమును సందియము లేదు.
| మ. | లలినొక్కొక్క తెఱంగు రంగలను లీ♦లల్ మబ్బులందుండుటెం | |