Jump to content

పుట:Grandaalaya Sarvasvamu - Vol.1, No.2 (1916).pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94 గ్రంథాలయ సర్వస్వము

లగుపడుటవలనను ఈ సమాజమునకు స్వంతమందిరముండుటావశ్యకమని తలపోసికొని ఈగ్రామాధికారులద్వారా తాలూకా అధికారులను స్థలమిప్పింపుడని కోరగా వారొక్క 'సెంటు'స్థల మిచ్చిరి. అది ప్రజల కూడికకు అనుకూలమైనదియే. ఆ స్థలమునందు ఆ 1897వ సంవత్సరాంతమున తాటియాకు కప్పుతో నొక చిన్న మందిరమును గట్టుకొనిరి. ప్రప్రధమమున మందిర నిర్మాణమునకు కోపల్లెగ్రామ నివాసులగు శ్రీ కాళ్ళకూరి నరసింహముగారి ప్రోత్సాహమువలన విద్యాధికులై ఆంధ్రభాషాభివృద్ధికి సదా కృషి జేయుచున్న పోలవరం జమీందారువారగు శ్రీరామచంద్ర వేంకటకృష్ణారావు పంతులు బి.ఏ. బహద్దరుగారు మొదట రు 25_0_0లు దయతో నొసంగుటవలన దీనికి కె.ఆర్.వి. కృష్ణారావు మందిరమని తగువారిచే అప్పుడు నామకరణము చేయబడినది. ఇట్లీసమాజము దినదినాభివృద్ధి నొందుచురాగా మందిరము నభివృద్ధి పరచి స్థిరమైనదిగా చేయవలసిన యగత్యత కలిగెను. సమాజమునకు తెనుగు గ్రంథములు విశేషముగా సమకూర్పబడినవి. జనుల వివేకాభివృద్ధికై సర్వదాకృషి చేయుదుమేని తప్పక ఈశ్వరసహాయము కలుగుననియు అప్పుడు గాని క్రమమగు ఫలితముతో కూడిన మనస్సంతుష్టి కలుగదనియు కావున ఎడతెగని కృషిచేయుటయే విధాయకధర్మమనియు ఈ సమాజము వారి యాశయము. ఇట్లుండ ఆ 1909 సం॥రం ఆగస్టు నెల 8 తేదీని నరసాపురం రెవిన్యూ డివిజక్షా అధికారులగు శ్రీ జ్యోతీంద్రనాధరాయి ఐ.సి.యస్. గారు ఈ గ్రామమునకు విచ్చేసి మా యాహ్వానముపైన ఈ మందిరమున ప్రవేశించి మా సమాజ స్థితిగతులను చక్కగా పరికించి ఆసమయమున దీనిని పెంకుటిల్లుగా జేసికొనుటకు యీ గ్రామ చెరువుగట్టుపై నున్న తాటి చెట్లలో 15 టి నుచితమగ నిప్పిఁపుడని వేడిరి. వారు దయతో 10 టిని కొట్టించుకొనుటకు వెంటనే యుత్తరువునొసంగిరి, తుదకవి చాలినంత పనికిరాకపోయినను వారు వాత్సల్యతతో దయ చేయుటవలననే ఈ మందిర నిర్మాణమునకు వారు మొదటి ప్రోత్సాహకులయిరి. ఈ మందిరము విశాలపరచి పెంకుటిదిగా చేయుటకు దీని చుట్టునున్న స్థలమొక్కంత ఇప్పింపుడని కోరగా ఏయాటంకమును కలిగింపక ఈ గ్రామాధికారులు సిఫార్సుచేయగా ఇదివర కిచట తాలూకా యధికారిగా నున్న ప్రాఙ్ఞలగు శ్రీ తుర్లపాటి వాసుదేవమూతి౯ పంతులు గారు వెంటనే స్థలమిప్పించిరి. ఈ యిల్లు కట్టుటలో సమాజికులును అభిమానులును వారివారి శక్తి కొలది ధనసహాయము చేయుటయేగాక కొందరు శరీరకష్టమును లెక్క చేయక స్వయముగా పాటుపడుచువచ్చిరి. అట్లయినను పూతి౯ పరచలేక పూనిన పని నిర్వహించుటకు తమకుగల మనోభిలాషను విడనాడక ఇతర గ్రామములలో నున్న మిత్రులను ధనసహాయము చేయగోరగా, వారు శక్తికొలది తోడ్పడిరి. ఇదియునుంగాక, ఆ గ్రామములోనున్న మువ్వురు ఆనాధలగు క్షత్రియ స్త్రీలు తగు ధనసహాయము చేసి మిగుల ప్రోత్సాహము గలిగించిరని దెలుపుటకెంతయు సంతసిల్లుచున్నారము. గుప్తదానపరులగు వారి నామములను వెల్లడిచేయుటకు వారంగీకరింపలేదు. పేరుచెప్పుకొనుట కిష్టము లేనివారే పెట్టున కుదార పరులన్న సామెత సాధ౯కపడుట కిదియొక ఉదాహరణము, మొదట ఈ గృహనిర్మాణమునకు ధనసహాయమొసగిన పోలవరం జమీందారువారిని కొంత కలపను ఇప్పింపుడని మనవిచేసుకొనగా నూరు రూపాయలు విలువగల కలపను దయచేసిరి. ఈ తోడ్పాటులవలనను ఈ సమాజము యొక్క నూతన మందిరమును 1910 సం॥ జూ౯ 1వ తేదికి పూతి౯ చేయగలిగిరి. మిగిలిన తలుపులు వగయిరా పనులు పూతి౯కొరకు, అనేకముగ ప్రజాక్షేమమగు శాశ్వతములలున ప్రతిష్ఠాపనలు చేసి ఈ చెన్నపురి రాజధానిలోని జమీందార్లలో నెల్ల సత్కార్యధౌరేయులని వాసిగాంచిన పిఠాపురంజమీందారు వారగు శ్రీరాజారావు వెంకటమహీపతి సూర్యారావు బహద్దరు వారికి విన్నవించుకొనగా వారు పరిపూర్ణదయతో నూరురూపాయలు మణియార్డరుద్వారా పంపిరి. ఈ సహాయముతో మందిర నిర్మాణమంతయు పూతి౯యైనది. ఆత్మకు శరీరమెట్లు నిలయమో అట్లే శరీరమునకు గృహమావశ్యకము. శరీరపోషణకోరు ప్రతిమనుజుడును గృహపోషణము జేయుట విధాయకకృత్యము. అట్టి వ్యక్తి గల ఈ సమాజికులందు ప్రతివారును ఈ యిల్లు తన శరీరమని దృఢముగ నమ్మి కంటికి చెప్పవలె దీని రక్ష