Jump to content

పుట:Grandaalaya Sarvasvamu - Vol.1, No.2 (1916).pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

90 గ్రంథాలయ సర్వస్వము

యని ర్మాణము చేసికొనిన చాలును. “ఇదివఱ కే ప్రతిగ్రామమునందును దేవాలయములు గలవే, వానినిపోషించుటయే కష్టతరముగా నున్నది. తిరిగి ఆలయనిర్మాణము చేయుట ఎందుల”కని మీరు ప్రశ్నింపవచ్చును. కాని మనమిప్పుడు చేయవలసినది దేవాలయనిర్మా ణముకాదు. గ్రంథాలయనిర్మాణము. దేవాల యనిర్మాణమువలన ఆముష్మికములను మా త్రము సాధింపవచ్చును. నేఁడు ప్రపంచము నందు ఉన్న తిస్థితిని బొందవలెనన్న ఆముష్మి కముగ ఔన్నత్యమును సంపాదించిన చాల దు. ఒక మనుజుని యాత్మ జ్ఞానప్రపూతమై యుండవచ్చును; కాని ఆతని దేహము కూడ ఆరోగ్యవంత మైయుండవలయును. ఈ రెండు నుగూడ సమానస్థితిలోనున్నఁగాని మనుజుఁ డభివృద్ధి మెందుట అసంభవము. ఇదేవిధము గ ఒకజాతి ఆముష్మిక ముగ ఔన్నత్యమును జెందియున్నను, ఐహికముగగూడ ఉన్న తల్లి తస్థితి లోనున్నఁగాని అది సమగ్రమగు అభివృద్ధిమెం దుటకు వీలు లేదు. కావున మనమిప్పుడు నిర్మిం పఁబోవు ఆలయములు ఐహీ కాముష్మికముల కు రెండింటికి నిగూడ సహకారులగునవిగ ఉం డవలెను; ఇట్లు ఇహపరములకు రెండింటికిని సహ కారులగు ఆలయములకే గ్రంథాలయ ములని పేరు ; ఈ ఆలయములకు జనులు అందఱునుగూడ వెళ్ళలేకపోవచ్చును. అంత మాత్రముచేత అట్లుపో లేని జనులకు గ్రంథా లయములవలనఁ గలుగవలసిన పుణ్యము లభిం పక పోవలసినదేనా? ఎంతమాత్రమును కాదు. ఆ యాలయమునకు వెళ్ళఁ గలిగిన వారందఱు ను తాము సంపాదించిన పుణ్యమునందు కొం తభాగమును వెళ్ళలేనివారికి నిత్యమును థా రవోయుచుండుట ధర్మమైయున్నది. దేవా లయములకుఁబోవుటవలనఁ గలుగు పుణ్యము ధారవోయుటవలన అదితఱిగిపోవచ్చునేమో కాని, ఈ గ్రంథాలయములకుఁ బోవుట వల నఁ గలుగు పుణ్యము ఇతరులకు ధార పూసిన కొలఁదిని తఱుగుటకు మారుగ సెరఁగుచునే యుండును. ఇదే దీనియందలి ఆధిక్యము. మనము గ్రంథాలయమునకుఁ బోయి జ్ఞాన సముపార్జనము చేయవచ్చును. కాని, లయమునకు రాఁజాల ని వారును, వచ్చి దాని యుపయోగమును బొందఁజాలనివారును మ న దేశమునందెండఱోకలరు. అట్టివారిని వంతులుగఁ జేయుటఎట్లు? ఒక వైపున జ్ఞాన దాయకములగు గ్రంథాలయములు వెలయు చున్నవి ; మఱి యొక వైపున అజ్ఞానతిమిర బా ధితులగు మూఢజనులున్నారు. మధ్యనున్నారము, మనమో కాన, మనము వానికిని వీరికిని పరస్పర సంబంధము కలిగింపవలెను. ఈ మహ త్తరమైన కార్యమును నెఱవేర్చుట ఎట్లు ? అనఁగా పుస్తకములకును సామాన్య జనులకును పరస్పర సంబంధము కలుగఁజేయవలయును గదా ! అట్టి స్థితికలుగుటకు అవియునువారు ను పరస్పరము తగియుండవలెను. పుస్తకములకు జనులు తగియుండవలెను. జ నులకు పుస్తకములు తగియుండవలెను. పర స్పరముగా తగియుండక పోయిన యెడల మన ముచేయుపని అంతయును వ్యర్థమే ; బూడిద లోపోసిన పన్ని రే. సామాన్యజనులు పుస్త - కములకు తగియుండరనుట వ్యర్థప్రసంగము; ఏలయన వారికి తగిన పుస్తకములనే మనము సమకూర్పవలెను. ఒక వేళ తగిన పుస్తకము లు లభ్యముకాని యెడల వారికి తగినటుల