Jump to content

పుట:Grandaalaya Sarvasvamu - Vol.1, No.2 (1916).pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గ్రంథాలయములు - అవి చేయవలసిన పనులు

క్కిలి గొప్పసంగతులని నాయభిప్రాయము.

ప్రాచీన కాలమున మన భరతఖండమునఁ గల గ్రంథాలయములను గూర్చి కాని, నవీన కాలమున పాశ్చాత్యదేశములయందు గ్రంథా లయోద్యమమును గూర్చి జరుగుతున్న ప్ర యత్నములను గుఱించి గాని నేనిచటఁ జెప్పఁ బూనుకొనలేదు. నవీన కాలమున గ్రంథాల యముల యవశ్యకతయు, అవి ఆంధ్రదేశము నందు జనులయొక్క స్థితిగతుల నభివృద్ధి చే యుటకుఁగాను ఎయేముఖములు పనిచేయవ లసియున్నదియు కొంచెము చెప్పెదను.

ప్రపంచమునందలి దేశములన్నింటికంటే ను మనదేశమునం దెక్కువగ అజ్ఞానదేవత తాండవమాడుచున్నది. మూరతా పిశాచ మునకు మన దేశమన్న మిక్కిలి ప్రియము. సౌఖ్యముగ తిని దేహయాత్రనుఁ గడపుటయే జీవితో దేశమను తలంపులు ప్రబలుచున్నవి. కాని, జీవితధర్మమేమి? అను నాలోచన తోఁ చుట లేదు.

దీనికి కారణమేమి? మన దేశ మునందు వి ద్యాధికుల సంఖ్య స్వల్పము. విద్యనార్జించు టకు కొందఱు మాత్రమర్హులు. ఈ స్వల్పసం ఖ్యాకులైనను విశేషభాగము జ్ఞాన సమన్వి తులు కారు. అట్టి స్వల్ప సంఖ్యాకులు జనసా మాన్యముయొక్క గతులను నడుపవలసినవా రుగానున్నా గు,జనసామాన్యమునకు సంబంధిం చిన సకల విషయములను అట్టి కొందఱు మాత్రము నిర్ణయింపవలసినవారుగా నున్నా రు. వీరి భావనా ప్రపంచమునకును నిజమ గు స్థితిగతులకును సంబంధమేలేదు. దేశము లోనున్న జను లందరును తమనలెనే సౌ ఖ్యవంతులై ఆనందము ననుభవించు చు న్నారని వీరిభావన. నిజమగు స్థితిగతుల ను కనుఁగొనుటకుఁ గాని, ఒక వేళ 'కనుఁగొ న్నను వానికి తగిన ప్రతిక్రియ చేయుటకుఁగా ని వీరికి సామర్థ్యము లేదు. ఇట్టిస్థితి దుర్భరము. కావున మనమిప్పుడాలోచింపవలసిన సంగతి ఏమనఁగా విద్యాధికులును జ్ఞానవంతులును కొందఱు మాత్రమే ఉండఁదగినదా ? లేక అందఱును విద్యాధికులును జ్ఞానవంతులును నై యుండవచ్చునా?

లైనను. పురుషులైనను. జనసామా న్యమంతయును గూడ విద్యావంతులును-జ్ఞా నవంతులునునై యుండవలెను. భావికాలము న నుదయింపఁబోవు మహాపురుషులందఱియొ క్క బీజములును ఈ కాలమునందలి జనసా మాన్యము నందంతర్గర్భితములై యున్నవి. అనువగు దోహదమునిచ్చితిమా ఆబీజములు మొలక లె త్తి క్రమముగ తరువులై మహావృ క్షములై పరోపకార పరతంత్రములగును. మున్నెక కాలమున నాగరికాగ్ర గణ్యమై తన విజ్ఞాన తేజస్సుచే ప్రపంచమునంతను ప్రజ్వరి ల్లఁజేసి పవిత్రమైన యీ దేశముమీఁద విద్యా ధిదేవతకు నేఁడు దయతప్పినది; ఆ దేవత యొక్క దయ సంపూణముగ నబ్బినఁగాని మనకు పురోభివృద్ధి లేదు; ఆమె దయను సంపాదించు టకు మనమిప్పుడు ఘోరమైన తపస్సు చే యవలసియున్నది.

ఈతపస్సును చేయుటకు మనము వనాం తరములకుఁగాని నిర్జన ప్రదేశములకుఁ గాని, కొండగుహలకుఁగాని వెళ్ళనక్కఱలేదు; మన ము నివాసముచేయు గ్రామములయందే ఆల