క. |
ఘనుడు గుశధ్వజుఁ డీగతిఁ, దనయాద్వయయుక్తుఁ డగుచుఁ దడయక వేగం
బున వచ్చి గౌతమజునకు, జనకునకును మ్రొక్కి వారిసమ్మతి నొకచోన్.
| 1239
|
తే. |
శిశిరకరకాంతపీఠి నాసీనుఁ డయ్యె, నట సుదామనుఁ డనుమంత్రి కనియె జనకుఁ
డాజిని సుతాప్తగురుబాంధవాన్వితముగఁ, దోడుకొని రమ్ము పొమ్ము సంతోష మెసఁగ.
| 1240
|
క. |
చని దశరథునకు నతుఁ డై, జనవర మిము బిల్వ నంపె జనకుఁడు నన్ను౦
దనయగురుమంత్రియుతముగఁ, జనుదేరఁగ వలయు మీరు సమ్మద మలరన్.
| 1242
|
క. |
అన నౌఁ గా కని దశరథుఁ, డనుపమసంతోష మలర నందఱితోడం
జని భర్మాసనగతుఁ డగు, చును ని ట్లనె జనకుతోడ సొం పలరారన్.
| 1243
|
చ. |
నరవర యీవసిష్టమునినాథుఁడు మత్కులదైవతంబుఁగా
నెఱుఁగుము సర్వకృత్యముల కీయన వక్త గురుండు దేవతా
గురునిభుఁ డైనకౌశికునిఁ గూడి మహర్షులసమ్మతంబునన్
సరసత మత్కులక్రమము సర్వము మీ కెఱిఁగించు నింపుగన్.
| 1244
|
వసిష్టుఁడు జనకునికి దశరథాన్వయక్రమం బెఱింగించుట
ఉ. |
నా విని యవ్వసిష్ఠమునినాయకుఁ డాజనకక్షితీశుతో
నావనజాప్తవంశవిధ మంతయుఁ జెప్పఁగఁ బూని యి ట్లను
న్భూవర సత్యవాక్యగుణభూషణ వేడుక సర్వలోకసం
భావిత మైనసూర్యకులపద్ధతిఁ జెప్పెద నాలకింపుమా.
| 1245
|
సీ. |
అవ్యక్తసంభవుం డవ్యయుఁ డజుండు శాశ్వతుండు చతుర్ముఖబ్రహ్మ దనరు
నతని మానసపుత్రుఁ డై మరీచి జనించె నతనికిఁ గశ్యపాహ్వయుఁడు పుట్టె
నతఁడు సూర్యునిఁ గాంచె నతఁడు వైవస్వతుఁ డనుమనువును గాంచె నమితయశుని
నాతఁ డిక్ష్వాకుమఃహారాజుఁ గాంచె నాతఁడు కుక్షిఁ గనియె నాతఁడు వికుక్షి
|
|
తే. |
నతఁడు బాణునిఁ గనియె నయ్యధిపతి యన, రణ్యుఁ డనువానిఁ గనియె నారాజు పృథునిఁ
గాంచె నతండు త్రిశంకునిఁ గనియె మఱియు, నాతనికి దుందుమారాఖ్యుఁ డవతరించె.
| 1246
|
క. |
అతఁడు యువనాశ్వుం బడసెను, నతనికి మాంధాత పుట్టె నన్నరపతికిన్
సుతుఁ డై సుసంధి వొడమెను, నతనికి ధ్రువసంధి వొడమె నవనీనాథా.
| 1247
|
వ. |
అతనితమ్ముండు ప్రసేనజిత్తుఁ డనంబడు.
| 1248
|
చ. |
చతురత నొ ప్పునట్టి ధ్రువసంధి కిల న్భరతుండు పుట్టె నా
స్తుతచరితుండు గాంచె నసితుం డనువాని నతండు ధాత్రి న
|
|