పుట:Goopa danpatulu.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
48

గోపదంపతులు.

క్కండ్రుగలరు. గొప్పగొప్పభవనములు, వనములు, సత్రములు, చావడులు, చెట్టియార్లవే. వితరణ విషయమునగూడ వారు విశేషకీర్తిరమ గాంచియుండిరి. దొరతనము వారేటేట ఘనబిరుదము లాతెగవారికే మిక్కుటముగా నిచ్చుచుండిరి.

    వారిలో రామయ్యసెట్టియు నటేశముచెట్టియు మేటు లనవచ్చును. వారిరువురును గోటికి బడగనెత్తిన ధనాధ్యులు. వారికన్యోన్యమైత్రిగలదు. రామయ్య పూనమల్లెబాటమీద నిర్మింపబడిన సుందరరామహర్మ్య మందు నివసించును. ఆ హర్మ్యమేకాక యతనికి చెన్నపురిలో, బెక్కుమందిరములు గలవు. నటేశము నంగంబాకములోని సొంతభవనమందు నివాసము చేయును. ఒకరియింటిక్ రెండవవారు తఱుచుగా నోయి ముచ్చటించుకొనుచుందురు. ఇరుగువురును గలసి ప్రతిదినమున 'కాస్మొపోలిటన్ క్లబ్బు ' నాబడు ఘనపౌరమందిరమునకేగి యందు దమ కన్నిటనీడగు మిత్రబృందముతొ జేరి వినొదనీల గాలక్షేపము చేయుచుందురు. వారొద్దఱు వ్యసనలోలురు. రామయ్యకు భార్యగలదు. కాని యాదంపతులొండొరువులనుమించు నాత్మస్వాతంత్ర్యము నాభిజాత్యమును గల్గువారగుటచే బ్రకృతమున బరస్పర విరోధభావము లొంది విడిపోయియుండిరి. ఇట్లాతడు మూడేండ్లనుండి యొంటిగానుంటచే దుర్వసనములలో మొదటిదానికిలోనై చరించు