పుట:Goopa danpatulu.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

49

దుష్టద్వితయము.

చుండువాడు. భార్యతొ గూడియుండునపుడుమాత్ర మాతనికా వ్యసనములేదు. 
    నటేశమునకు భార్యతో గాపురముగలదు. అట్టులుండియు నతడా ప్రధమవ్యసనమునకు మిక్కిలి చిక్కి పెక్కుతావుల నవమానముంగూడ బొందియుండెను. రెండవవ్యసనమగు ద్యూతమం దిరువురును విశేషాసక్తి గలుగువారలే. క్లబ్బులొవారు ప్రత్యహముచేయు పనియదియే, ఆసమయమందే నడుమనడుమ బావవ్యసనమునకు లోపడుచుందురు.  మృగయావ్యసనము భావవ్యసనమునకువలె లేదు. కాని వారమాయికాత్మలగు మృగీనయనల చంచలదృక్కాంతులచే నాకర్షింపబడి తదాకర్షణప్రయత్న మృగయావ్యసనమున కలవడినవారే. ప్రధాన వ్యసన చతుష్టయములో నాఱితేరిన వారికి దక్కుగల వాక్పారుష్య, దండసారుష్యార్ద దూషణములను వ్యసనత్రితయ మప్రయత్నముగనే యలవడుననుట యతిశయొక్తి గాదు. 
     ఈరీతిగా జరించువారు స్టారుసర్కసువారి ప్రధమ ప్రదర్శనమునకు బోయియే యున్నారని వేరుగ చక్కాణింపనక్కరలేదు. నాయికా నాయకులకు బదకములిచ్చి, వారిరువురి పరిచయము గల్గించుకొను నుద్దేశముతో గ్రీన్ రూమనబడు నెపధ్యాగారములోనికేగి వారితో గరచాలన వినొదమొనర్చిన ప్రముఖులలో బ్రబ్రధములువారే. ఆయిరువురిలో రామయ్యశెట్టి సుందరరూపుడు. 35 యేండ్ల