పుట:Goopa danpatulu.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
42

గోపదంపతులు.

అప్ప—అబ్బే!మాదేశమున నాడువారు బయటికేరారు. బయటికివచ్చినను నిట్టి నికృష్టకార్యమునకు సిద్ధపడరు.

   రామ—ఇది నికృష్టకార్యమందురా? అంగడిలో దుకాణముబెట్టి సరకులమ్ముస్త్రీలు మీలోలేరా? మీభార్య పస్లవర్తకములో నట్లింటికి బోయియుండలేదా? అంతకన్న నిందు దోషమున్నదా? దోషము గుణము ననునవి మనమనస్సులోనున్నవిగాని యాయాపనులలోలేవు. నిష్కల్మషహృదయముతో దేశహొతంగోరి చేయు కస్ర్యమెట్టిదియు జెడ్డదికాదు.

అప్ప—ఇట్టిది దేశహితకార్యమెట్లగును?

రామ—స్త్రీలబలలనియు బురుషులొనర్చు కార్యములు చేయజాలరనియు నొకదోషారోపణమును లోకులు చేయుచున్నారు. దానిని శ్రీమతి తారాబాయమ్మగారు మున్నగు మహనెర్యురాండ్రు కొంతవఱకు బోగొట్టి, స్త్రీలకుగూడ దేహపరిశ్రమ మవసరమని నిచర్శనపూర్వకముగా జూపియున్నారు. మీరీయ్యకొందురేని గంగమ్మా ళట్టిప్రసిద్ధస్త్రీరత్నము కాగలదు. అప్పుడామె చేయునవి దేశహితకార్యముకాదా?

అప్ప—కావచ్చును. కాని యామెయందుల కొప్పుకొనునోలేదో!