పుట:Goopa danpatulu.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

153

ఆశ్లేషణము.

యనుమానంపడుచుండెను. క్రమముగా గంగమ్మ మాటల యందాతనికి నమ్మకము చెడజొచ్చెను. "అయ్యో! నేనెట్లు భరింతు? కన్నకడుపగుటచే గూతు నుపేక్షింపజాలను. దాని నుపేక్షింపకుండవలయునన్న భర్తను మోసము చేయక తప్పదు. మోసము చిరకాలముదాగదు. అయ్యో! దైవమా! నాకీవిషమ సమస్య లేలకల్పించితివి? నిజమాడి నాకూతు కొఱ కాతమిళులయింటి కరుగుచుంటినని నాభర్తతో జెప్పుదునేని, మున్నున్న గోడును జెడును. నేనింత భ్రష్టురాలనైతినని యాయనకు దెలియదు. తెలిసిన, విడాకులేగదా? ఈశ్వరా! నాకేమిదారి? ఏదొదారిజూపి రక్షింపుము. కాకున్న, నాప్రాణములంగొని నాబాధలుడువుము, అని గంగమ్మతనలోదాను బల్కి కొనుచుండెను.

    అప్పలసామి కనుమాన మెక్కూయైన గొలది వ్యవసాయపు బనులడుగంటుచుండెను. అతడిల్లు కదలి యీవలావలకు వెళ్లుటమానుచుండెను. ఎక్కడకేని పోయినను ద్వరితగతిన్మి మరలివచ్చు టకు మొదలిడెను. తానిలువిడిచి యెక్కువసేపెక్కడ నైన నుండవలసి వచ్చినయెడల దనభార్య చర్య గనుచుండునని యొకరిద్దరునౌకరులను వేగులవాండ్రనుగా నియోగించుచుండెను. ఇట్టులామె బ్రతు కడకత్తెరలోని పోక చెక్కవలె నుండెను. 
    గంగమ్మ పగటివేల సుందరమ్మగారి యింటికి బోవుటమాని, రాత్రులయందు మగడునిద్దురవొయిన తర్వాత,