పుట:Goopa danpatulu.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
154

గోపదంపతులు.

నింటిపనులు చేయుచుండునట్లు నటించి, కూతుకడకరిగి చూచి,నిద్రించుబిడ్డనులేపి, యెత్తుకొని, యేదో యాహారపదార్దములం బెట్టి లాలించివచ్చు చుండెను. శకుంతలకు దెలివిదేటలువచ్చినకొలది నూరటగలుగుచుండెను. అది తనయీడు బాలబాలికలతొ నాటలాడుకొనుట కలవాటుపడెను. కాని తల్లినిజూడకుండ నొక్కనాడేని నిలువలేకుండెను.

   ఈరీతిగా గొన్నినెలలు గడచెను. వృద్ధులపాలిట మృత్యుదేవతయగు హెమంత మేతెంచెను. గోపాలపట్టణము పర్వతప్రాంత ప్రదేశమగుటచేత నందు జలి మిక్కుటముగా నుండెను. అప్పుడు చేలకు గోతలు జరుగురోజులు గావున గర్షకజనులు రేయింబవలు బాటలయందు దిరుగుచుండిరి. సీతుబాధ గణీంపక కూతుపై గల మమకారముచేత గంగమ్మ యర్దరాత్రమున నిలువెడలిచనుచుండ నామెనెఱిగిన పాలికాపులిద్ద ఱొకసారి కనబడి "అమ్మా! ఇంతనడిరేయి నెక్కడికిబోవుచున్నా' రని ప్రశ్నించగా, నామె యాలోచించిచెప్పుటకు గాలము జాలక 'యొకపనిమీదస్టేషన్ మాస్టరుగారియింటికి బోవుచున్నా" నని మారుపల్కెను. చలియక్కువగా నున్నప్పుడెల్ల నామె తనబిడ్డేట్టులున్నదో యని భయపడుచుండును. తరుచుగా నాబిడ్దకు జలిగాలి తగిలి యూపిరితిత్తులు చెడినట్టులో జ్వరముతగిలి నట్టులో మఱియేయితర వాధియే కలిగినట్టులో యామె యూహించుచుండును. గాని,బిడ్డ యానందముతొ దోడిబిడ్డలతో నాడుకొను