పుట:Goopa danpatulu.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

145

అశ్లేషము.

మ్మకు నిజముగా నున్మాదమేకలిగెననియు, దాననున్మాదవైద్యశాలకు గొంపోబడి చికిత్సలో నుంప బడెగాబోలుననియు దలంచిరి. కాని సత్యవృత్తాంత మెఱుంగలేకపోయిరి. అప్పలసామియు గరుణముగారి తొ భాషించుచు దనయవస్దం దెలిపెను. మొదట దానెట్లు కీర్తిధనముం గొల్లగొనగల్గెనో, యవల దనభార్యకూడ నెట్లు పాముగరిడీలలో బాల్గొనివన్నెక్కినదో, యనంతరమామె తముళుల దుర్భోధకు లొనై మతిచెడగొట్టుకొని తిరిగినదో, క్రమ్మఱ నామె యెట్లుతనకు లభించినదో యదియంతయు బూసగ్రుచ్చినట్లు దెలిపెను. తానుసయిత మామెదుశ్చరిత మెఱుగకపోవుటచేత నందునుంగూర్చి యేమియు బలుకకుండెను. చాలరేయిగడుచువఱకు వారట్లు సంభాషించుకొనిరి.

     మఱునాదు కరణముగారు తమబసకు సమీపముమందు నొక యిల్లు మనయప్పలసామికి నద్దెకిప్పించి, యతనినందు విడియించిరి. అప్పలసామి కొలదిధనము తనకడ నుంచుకొని మిగిలనదేల్ల విశాఘపురకేగి యందలి 'బ్యాంకు ' లో దాచుకొనెను. అతని కేవృత్తియు నవలంబింపవలెనని  యిచ్చలేదు. తనకున్న ధనముపై వడ్డితెచ్చుకొని యనుభవింప వలయుననియే యాతని కొర్కె. అప్పుడు వ్యవసాయముచేయుదమన్న వీలుగాని కాలము. ఇకరెండునెలలలో గరణముగారికిచ్చిన